BigTV English

SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?

SRH – Travis Head: SRHను చూస్తేనే వణకు పుట్టాల్సిందే…ఈ సారి 400 కొట్టడం పక్కా…?

SRH – Travis Head: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌ కు కౌంట్‌ డౌన్‌ షురూ అయింది. మరో రెండు రోజుల్లోనే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌ ప్రారంభం కానుంది. మార్చి 22వ తేదీ నుంచే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 టోర్నమెంట్‌ స్టార్ట్‌ అవుతోంది. మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అన్ని జట్లు ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాయి. ఈసారి ఎలాగైనా కప్ ఎగురేసుకుపోవాలని…. అన్ని జట్లు… కసరత్తులు మొదలుపెట్టాయి. ఈ సారి మెగా వేలం జరిగిన నేపథ్యంలో అన్ని జట్టల్లో కొత్త ప్లేయర్లు రావడం జరిగింది. కెప్టెన్లు కూడా పూర్తిగా మారిపోయారు.


 

ఇది ఇలా ఉండగా… ఇప్పుడు అంతా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు గురించి చర్చ జరుగుతోంది. గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు అత్యంత ప్రమాదకరంగా ఆడారు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లాంటి ప్లేయర్లు అత్యంత ప్రమాదకరంగా గత సీజన్ లో బ్యాటింగ్ చేశారు. వారికి తోడుగా తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా.. మిడిల్ ఆర్డర్ లో దుమ్ము లేపాడు. దీంతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు మొదట బ్యాటింగ్ చేస్తే.. కచ్చితంగా 250 పైగా పరుగులు చేసేవారు.


 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 టోర్నమెంటులో 287 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. నిర్ణీత 20 ఓవర్లలో అతిపెద్ద టార్గెట్ నమోదు చేసిన జట్టుగా… సన్రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. అయితే.. గత సీజన్లో హైదరాబాద్ జట్టు… దారుణంగా ఆడిన నేపథ్యంలో ఇప్పుడు కూడా… ఆడుతుందని ప్రత్యర్థి జట్లు భయపడుతున్నాయి. ఈసారి కచ్చితంగా… 300 కాదు 400 కొట్టిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని.. చాలామంది అంటున్నారు. గతంలో కంటే ఈసారి సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత ప్రమాదకరంగా తయారైందని కూడా చెబుతున్నారు.

 

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ , లాంటి డేంజర్ ఆటగాళ్లతో పాటు ఈసారి ఇషాన్ కిషన్ హైదరాబాద్ జట్టులోకి వచ్చాడు. గతంలో ముంబై ఇండియన్స్ ఓపెనర్ గా బరిలోకి దిగే ఇషాన్ కిషన్… సిక్స్ లు అలాగే బౌండరీలు అలవోకగా కొట్టగల కెపాసిటీ ఉన్నవాడు. అందుకే ముంబై ఇండియన్స్ లో సక్సెస్ అయిన తర్వాత టీమిండియాలోకి వచ్చాడు ఈశాన్ కిషన్. ఇక హైదరాబాద్ జట్టులో చేరిన తర్వాత ప్రాక్టీస్ మ్యాచ్లో కూడా అదరగొడుతున్నాడు.  ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా.. వరుసగా అర్థ సెంచరీలు చేసుకుంటున్నాడు  హైదరాబాద్ ఆటగాడు ఇషాన్ కిషన్. నెట్స్ లో ప్రాక్టీస్ చేస్తూ… బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. దీంతో… హైదరాబాద్ ఫ్యాన్స్ ఫుల్ జోష్లో ఉన్నారు.

 

తమ సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి మరో డేంజర్ ఆటగాడు వచ్చాడని… కావ్య పాపతో పాటు హైదరాబాద్ ఫాన్స్ సంబరపడిపోతున్నారు. ఇదే ఊపు కొనసాగితే… ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంటులో… హైదరాబాద్.. కచ్చితంగా 400 స్కోర్ చేస్తుందని అంటున్నారు. హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తే.. మొదటి మూడు మ్యాచ్ల్లోనే ఇది సాధ్యమని చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా… ఈ టోర్నమెంట్ లో సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మొదటి మ్యాచ్ జరగనుంది.

 

 

Related News

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

SL Vs PAK : టాస్ గెలిచిన పాకిస్తాన్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : హరీస్ రవూఫ్ కు అర్ష‌దీప్ అదిరిపోయే కౌంట‌ర్‌..నీ తొక్క‌లో జెట్స్ మ‌డిచి పెట్టుకోరా

Yuvraj Singh : ఆ కేసులో అడ్డంగా దొరికిపోయిన యువరాజ్.. రంగంలోకి ED.. విచారణ షురూ

IND Vs PAK : సిగ్గు, శరం లేదా… ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ పై మాధవి లత సంచలన వీడియో

IND Vs PAK : టీమిండియా పై పాకిస్తాన్ లేడీ సంచలన వ్యాఖ్యలు.. మీరు ఇంటికి వెళ్లిపోండి అంటూ!

IND Vs PAK : మరోసారి రెచ్చిపోయిన పాకిస్థాన్..వంక‌ర బుద్దులు ఏ మాత్రం పోలేదుగా !

Haris Rauf’s wife : హారిస్ రౌఫ్ భార్యకు పెను ప్రమాదం… తుక్కుతుక్కు అయిన కారు !

Big Stories

×