E-Paper
Advertisement

రిటైర్మెంట్ ఇవ్వాలంటూ రోహిత్ శర్మపై ఒత్తిడి.. గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?

రిటైర్మెంట్ ఇవ్వాలంటూ రోహిత్ శర్మపై ఒత్తిడి.. గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?
Advertisement

Nita Ambani Offer To Rohit Sharma:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో రోహిత్ శర్మ అభిమానులకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. లార్డ్స్ వేదికగా జరగబోయే మూడవ వన్డేనే రోహిత్ శర్మకు చివరి మ్యాచ్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ లో రోహిత్ శర్మను తీసుకోవడం లేదంటూ ఇప్పటికే బీసీసీఐ కూడా అతడికి సమాచారం అందించిందట. దీంతో లార్డ్స్ లోనే రిటైర్మెంట్ ఇచ్చేందుకు రోహిత్ శర్మ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే, రోహిత్ శర్మ రిటైర్మెంట్ కావడానికి అసలు విలన్ గౌతమ్ గంభీర్ అంటూ ప్రచారం జోరుగా సాగుతోంది.

Also Read: Pakistan Cricket Board Fine To Kavya Maran For NOC: కావ్య పాప‌కు షాక్ ఇచ్చిన పాకిస్తాన్‌..ఏకంగా రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని కండీష‌న్ !

రోహిత్ శ‌ర్మ‌తో బ‌ల‌వంతంగా రిటైర్మెంట్ చేయిస్తోన్న గంభీర్

Advertisement

2027 వన్డే వరల్డ్ కప్ ఆడి రిటైర్మెంట్ ప్రకటించాలని రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. కానీ వీళ్ళిద్దరి కెరీర్ కు అడుగడుగునా గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ అడ్డుకట్టలు వేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే గత కొన్ని రోజుల నుంచి రోహిత్ శర్మ పెద్దగా ప్రదర్శన చేయడం లేదని గౌతమ్ గంభీర్ కొత్త కుట్రలకు తెర లేపారట. అతడిని వన్డే వరల్డ్ కప్ నుంచి తొలగించాలని బీసీసీఐ ముందు నివేదిక కూడా అందించారట. అతని స్థానంలో కుర్రాడిని.. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ను తీసుకుందామని సూచనలు చేశారట. యశస్వి జైష్వాల్, సాయి సుదర్శన్, ఇషాన్ కిషన్ లలో ఒకరిని తీసుకుంటే బెటర్ అని కూడా నివేదిక ఇచ్చాడట. దీని వెనుక గిల్ కుట్ర కూడా ఉన్నట్లు చెబుతున్నారు. అందుకే బలవంతంగా రోహిత్ శర్మతో లార్డ్స్ వేదికగా రిటైర్మెంట్ కు బీసీసీఐ అధికారులు కూడా పన్నాగం పండినట్లు సమాచారం. నిన్నటి నుంచి ఇదే అంశం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

గంభీర్ కుట్రలకు చెక్ పెట్టిన అంబానీ?

బలవంతంగా రోహిత్ శర్మతో రిటైర్మెంట్ చేయిస్తున్న బీసీసీఐ, గౌతమ్ గంభీర్ లకు షాక్ ఇస్తూ అంబానీ ఫ్యామిలీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియాలో చోటు లేకుండా చేసినందుకుగాను.. రోహిత్ శర్మ కోసం అదిరిపోయే ప్లాన్ వేశారు. ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్ గా రోహిత్ శర్మను నియామకం చేసేందుకు అంబానీ ఫ్యామిలీ రెడీ అయిందట. హార్దిక్ పాండ్యా దాదాపు చెన్నై సూపర్ కింగ్స్ లోకి వెళ్లబోతున్నాడు. సూర్య కుమార్ యాదవ్ ప్రదర్శన కూడా సరిగ్గా లేదు. అతడు కేకేఆర్ లోకి వెళ్తాడని అంటున్నారు. ఈ నేపథ్యంలో 2027 ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కోసం రోహిత్ శర్మకు కెప్టెన్సీ ఇవ్వాలని నీతా అంబానీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ ఐపిఎల్ కు కూడా రిటైర్మెంట్ ఇస్తే… ముంబై ఇండియన్స్ కోచ్ గా ఛాన్స్ ఇస్తామని అనుకుంటున్నారట. ఈ మేరకు రోహిత్ శర్మకు కూడా సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో గంభీర్ చేసిన కుట్రల నేపథ్యంలో రోహిత్ శర్మకు మంచే జరుగుతుందని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.

Advertisement

Also Read: ICC unveils new formats for Men’s ODI and T20 World Cups:  వ‌ర‌ల్డ్ క‌ప్ 2027 ఫార్మాట్ వ‌చ్చేసింది..టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ‌ధ్య మూడు మ్యాచ్ లు

 

Related News

రోహిత్ శ‌ర్మ రిటైర్మెంట్ ఇస్తే, టీమిండియాను కుక్క కూడా ప‌ట్టించుకోదు

రోహిత్ శ‌ర్మను కాదు, ముందు గంభీర్ ను మెడ‌లు ప‌ట్టుకుని గెంటేయండి

2009లో మేం ఓడించాం, 2027 వ‌ర‌ల్డ్ క‌ప్ లోనూ చిత్తుగా టీమిండియా ఓడించాలి

డ్ర‌గ్స్ క‌ల‌క‌లం..పాకిస్తాన్ కు అమ్ముడుపోయిన జై షా…ఆ ప్లేయ‌ర్ కు శిక్ష త‌గ్గింపు?

జో రూట్ పెద్ద ఫులిష్ గాడు..99 ప‌రుగుల వ‌ద్ద నేనుంటే, సెంచ‌రీ చేసుకునేవాడు

41 ఏళ్ల‌ రొనాల్డో ఆడుతున్న‌ప్పుడు, రోహిత్ శ‌ర్మ ఆడితే మీకేం నొప్పి?

శ్రేయ‌స్ అయ్య‌ర్ దెబ్బ‌కు ప‌క్షి విల విల‌…జాకబ్‌ బెతెల్ చేసిన ప‌నికి ఫిదా కావాల్సిందే

Big Stories

Advertisement
×