BigTV English

ICC Cricket World Cup :  దేవుడే కాపాడాలి.. పాక్ క్రికెట్ టీమ్ డైరక్టర్ మికీ ఆర్థర్..

ICC Cricket World Cup :  దేవుడే కాపాడాలి..  పాక్ క్రికెట్ టీమ్ డైరక్టర్ మికీ ఆర్థర్..

ICC Cricket World Cup : పాకిస్తాన్ సెమీస్ చేరడం దాదాపు అసాధ్యమని అందరికీ అర్థమైపోయింది. స్వయంగా పాక్ క్రికెట్ టీమ్ డైరక్టర్ మికీ ఆర్థర్ కూడా ఆ మాట అన్నాడు. ఇక మా చేతుల్లో ఏమీ లేదు. ఆ దేవుడే కాపాడాలి అని అనేశాడు. ఏమైనా అద్భుతాలు జరుగుతాయేమోనన్న ఆశ ఒక్కటే మిగిలి ఉందని అన్నాడు.


వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా సెమీస్ రేస్‌లో పాకిస్తాన్, ఆఫ్గనిస్తాన్ ఉన్నాయి. ఇప్పటికే కివీస్ విజయం సాధించి 10 పాయింట్లతో 90 శాతం సేఫ్ జోన్ లోకి వెళ్లింది. ఇంక పాకిస్తాన్ తన తర్వాత మ్యాచ్ శనివారం నాడు ఇంగ్లండ్ తో ఆడనుంది. అయితే శ్రీలంకపై  గెలిచి ఆ జట్టు మళ్లీ రేస్ లోకి వచ్చింది. అందువల్ల అంత తేలికగా పాకిస్తాన్‌కి లొంగేలా లేదు.

అందుకే  పాక్ డైరక్టర్ ఆ దేవుడే కాపాడాలనే మాట అన్నాడేమో అంటున్నారు. ఇంకా ఏమన్నాడంటే శనివారం వరకు మా చేతుల్లో ఏమీ లేదు. కానీ తప్పకుండా సెమీస్ చేరుకుంటామనే ఆశ అయితే ఉంది. అందుకు ఆ భగవంతుడి సాయం కూడా అవసరం అవుతుందని అన్నాడు. కివీస్ మ్యాచ్ లో వచ్చినట్టే వరుణుడు రావాలని కోరుకుంటున్నాడా..? పాక్ డైరక్టర్… అని నెట్టింట కామెంట్లు వినిపిస్తున్నాయి.


అప్పుడైతే డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో అయినా సరే, 270 పరుగుల తేడాతో గెలిచి, కివీస్‌ను దాటి రన్ రేట్ సాయంతో సెమీస్‌లో అడుగు పెట్టగలరా అని కొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.  అంటే వీళ్లిప్పుడు 270 తేడాతో గెలవాలని కోరుకుంటున్నారా..? అని కొందరంటున్నారు. ఈ టోర్నీలో తాము అత్యుత్తమ గేమ్ ఆడింది మాత్రం బంగ్లాదేశ్ పైనే అని తెలిపాడు.

ఓపెనర్ ఫకర్ జమాన్ రాకతో పాక్ బ్యాటింగ్ ఆర్డర్ బలోపేతమైందని అన్నాడు. ఇంగ్లండ్ తో జరగబోయే మ్యాచ్ లో కూడా తను ఇలాగే దుమ్మురేపాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. మ్యాచ్‌ను ఏ క్షణమైనా మార్చేయగల సత్తా ఫకర్ సొంతమని ఆకాశానికెత్తేశాడు.

కానీ వరల్డ్ కప్ లో రెండు మ్యాచ్ ల్లో మాత్రమే తను ఆడాడు. మిగిలిన వాటికి ఎందుకు సెలక్ట్ చేయలేదో మాత్రం డైరక్టర్ మికీ ఆర్థర్ వెల్లడించలేదు. కానీ తను ఆడిన రెండు మ్యాచ్ ల్లోను పాక్ విజయం సాధించడం విశేషం.

ఇక తర్వాత సెమీస్ బెర్త్ పోరులో ఉన్న ఆఫ్గనిస్తాన్ బలమైన సౌతాఫ్రికా తలపడనుంది. నేడు జరిగే మ్యాచ్ లో ఆఫ్గన్ సెమీస్ రేస్ లో ఉంటుందా..? ఊడుతుందా..? అనేది తేలిపోతుంది. కాకపోతే ఆస్ట్రేలియాను ఓటమి అంచుల వరకు తీసుకెళ్లిన ఆఫ్గాన్‌ను అంత తేలిగ్గా తీసుకోడానికి లేదు. ఈ మ్యాచ్ మళ్లీ రసవత్తరంగా మారే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×