MLA Kaushik meets KL Rahul: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో భాగంగా సన్రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా… ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య బిగ్ ఫైట్ ఉండనుంది. ఇవాళ సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఇప్పటికే మ్యాచ్ ప్రక్రియకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు జరిగాయి. ఇలాంటి నేపథ్యంలో గులాబీ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి… ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ ను కలిశారు.
కె ఎల్ రాహుల్ ను కలిసిన కౌశిక్ రెడ్డి
ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు కేఎల్ రాహుల్ ను గులాబీ పార్టీ హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కలవడం జరిగింది. తన కూతురిని తీసుకువెళ్లి మరి రాహుల్ను కల్పించారు. ఈ సందర్భంగా కౌశిక్ రెడ్డి కూతురుకు ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చాడు కేఎల్ రాహుల్. ఈ సందర్భంగా తండ్రి కూతురు ఇద్దరు కలిసి… కేఎల్ రాహుల్ తో ఫోటోలు కూడా దిగారు. ఇవాళ ఉప్పల్ వేదికగా మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ లోని ఓ ప్రముఖ హోటల్లో దిగింది.
అయితే ఆ హోటల్ వివరాలు తెలుసుకున్న కౌశిక్ రెడ్డి.. తన కూతుర్ని తీసుకువెళ్లి కేఎల్ రాహుల్ ను కలిశారు. గతంలో రంజి ట్రోఫీలలో కౌశిక్ రెడ్డి ఆడిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో కేఎల్ రాహుల్ తో కూడా మ్యాచ్ ఆడాడట కౌశిక్ రెడ్డి. ఆ సాన్నిహిత్యంతోనే కేఎల్ రాహుల్ ను కౌశిక్ రెడ్డి కలవడం జరిగింది. ఇక మొన్నటికి మొన్న గుజరాత్ టైటాన్స్ హైదరాబాద్ వచ్చిన క్రమంలో గిల్ అలాగే మహమ్మద్ సిరాజును కూడా కలిశాడు. ఇటు ముంబై ఇండియన్స్ కూడా హైదరాబాద్ వచ్చిన నేపథ్యంలో…. సూర్య కుమార్ యాదవ్ అలాగే తిలక్ వర్మను కూడా కౌశిక్ రెడ్డి అలాగే ఆయన కూతురు కలిసి ఫోటోలు దిగారు.
ఇక లేటెస్ట్ గా ఢిల్లీ క్యాపిటల్స్ హైదరాబాద్ కు వచ్చిన నేపథ్యంలో కేఎల్ రాహుల్ ను కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో అలాగే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కేఎల్ రాహుల్ పింక్ టీ షర్టు ధరించిన నేపథ్యంలో… మాది పింకే మీది పీకే… అంటూ కౌశిక్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్టు కూడా వైరల్ గా మారింది. ఇక కౌశిక్ రెడ్డి పోస్టు చూసినవాళ్లు… కేఎల్ రాహుల్ ను గులాబీ పార్టీలో చేర్చుకుంటున్నారా అని కామెంట్స్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇవాల్టి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఓడిపోతే.. ఇంటి దారి పట్టడం ఖాయమని చెబుతున్నారు. ఒకవేళ ఇవాల్టి మ్యాచ్లో హైదరాబాద్ గెలిస్తే ప్లే ఆఫ్ ఆశలను మరింత పెంచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. హోమ్ గ్రౌండ్ కావడంతో ఢిల్లీని ఓడించడం గ్యారంటీ అంటున్నారు క్రీడా విశ్లేషకులు.