Mohammed Shami: ఇంగ్లాండ్ తో భారత జట్టు ఐదు టి-20లో సిరీస్ ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ ఐదు టి-20ల సిరీస్ లో భాగంగా జనవరి 22న కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై భారత జట్టు 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలి టి-20 వన్ సైడ్ గా ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు ఏ దశలోనూ భారత జట్టుకు పోటీ ఇవ్వలేకపోవడంతో భారత్ సునాయాసంగా గెలుపొందింది. దీంతో ఈ ఐదు టి-20 సిరీస్ ని మంచి విజయంతో ఆరంభించింది భారత్.
Also Read: IND vs ENG 2nd T20: ఇవాళ ఇంగ్లాండ్‌తో రెండో టీ20..టీమిండియా డేంజర్ ప్లేయర్ దూరం ?
అయితే ఆదిక్యాన్ని పెంచుకునే లక్ష్యంతో నేడు రెండవ టి-20 మ్యాచ్ కి సిద్ధమైంది. శనివారం రోజు చెన్నై వేదికగా రెండవ టి-20 మ్యాచ్ లో మరోసారి అద్భుత ప్రదర్శన చేయాలని భారత్ పట్టుదలతో ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలని ఇంగ్లాండ్ పట్టుదలతో ఉంది. అయితే దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టేందుకు సిద్ధమైన సీనియర్ మొహమ్మద్ షమీని మేనేజ్మెంట్ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. కానీ తొలి టీ-20లో మాత్రం అతడు బరిలోకి దిగలేదు.
దీంతో ఈ సీనియర్ బౌలర్ ఫిట్ గా లేడన్న అనుమానాలు తలెత్తాయి. తొలి టి-20 లో షమి ఆడకపోవడానికి వెనుక అసలు కారణాన్ని తెలిపాడు అభిషేక్ శర్మ. మొదటి టి-20 జరిగిన ఈడెన్ గార్డెన్స్ లో పిచ్ పరిస్థితుల ఆధారంగా ముగ్గురు స్పిన్నర్లను తీసుకోవాల్సి వచ్చిందని.. ఈ కారణంగానే ఒకే ఒక్క పేస్ బౌలర్ తో ఆడినట్లు తెలిపారు. కాగా తొలి టీ-20 కి ముందు ప్రాక్టీస్ సెషన్ లో మహమ్మద్ షమీ మోకాలికి బ్యాడ్ వేసుకొని బౌలింగ్ ప్రాక్టీస్ చేసిన వీడియోలు ఫోటోలు, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
దీంతో అతడి గాయం ఇంకా తగ్గలేదని వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇదిలా ఉంటే షమీ రెండో టి-20 మ్యాచ్ లోనైనా ఆడతాడా..? లేదా..? అన్నది ఇప్పుడు మరోసారి ఉత్కంఠ గా మారింది. రెండవ టి-20 చెన్నైలోని చెపక్ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ పిచ్ స్పిన్ తో పాటు పేస్ కి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మ్యాచ్ లో షమీ రీఎంట్రీ చేయడం ఖాయం అని అంతా అనుకుంటున్న సందర్భంలో ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.
Also Read: Indian Cricketer Relative: టీమిండియాలో విషాదం.. పులి దాడిలో ఆమె మృతి ?
శుక్రవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొన్న షమీ.. ఎలాంటి ఇబ్బంది లేకుండా బౌలింగ్ చేశాడు. కానీ మోకాలికి బ్యాండేజ్ వేసి ఉండడంతో అతడు మ్యాచ్ ఆడడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రెండవ టి-20 లో అతడు భాగం కానున్నాడా..? లేదా..? అతడి ఆరోగ్య పరిస్థితి ఏంటి..? అన్న విషయంపై బిసిసిఐ కూడా ఇలాంటి ప్రకటన చేయలేదు. అభిమానులు మాత్రం షమీ ఆడాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ఒకవేళ అతడు జట్టులోకి వస్తే ఏ ఆటగాడి పై వేటు వేస్తారు..? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.