BigTV English

Indian Cricketer Relative: టీమిండియాలో విషాదం.. పులి దాడిలో ఆమె మృతి ?

Indian Cricketer Relative: టీమిండియాలో విషాదం.. పులి దాడిలో ఆమె మృతి ?

Indian Cricketer Relative: టీమిండియా క్రికెట్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. టీమిండియా ( Team India ) క్రికెటర్ బంధువు ఓ పులి దాడిలో.. మరణించడం జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. అయితే ఆ టీమిండియా క్రికెటర్ ఎవరో కాదు మిన్ను మణి ( Minnu Mani ). ఈమె టీమిండియా మహిళల జట్టుకు సంబంధించిన ప్లేయర్. తాజాగా…. ఓ గ్రామంలోకి చొరబడ్డ పెద్దపులి దాడి సంఘటనలో… టీమిండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి ( Minnu Mani ) బంధువు… మరణించారు.


Also Read: Yuzvindra Chahal: చాహల్ కు బ్లాక్ మెయిల్… 100 కోట్లు ఇవ్వాలంటూ టార్చర్ ?

కేరళ రాష్ట్రంలోని ( Kerala ) వయనాడు ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. వయనాడులో ( Wayanadu ) పెద్దపులి… దాడి చేయడంతో… టీమిండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి ( Minnu Mani ) దగ్గరి బంధువు రాధ ( Radha ) అనే మహిళ మరణించడం జరిగింది. మరణించిన మహిళ వయసు 45 సంవత్సరాలు ఉంటుందని సమాచారం. ఈ టీమిండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి ( Minnu Mani )కి అత్త వరుస అవుతుందని సమాచారం అందుతుంది.


వయనాడులో ఉన్న… ఓ గ్రామంలో కాఫీ తోటలో… రాధా పనిచేస్తున్నారట. ఆ సమయంలోనే ఒక్కసారిగా… పెద్దపులి అటాక్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు ఆ కాఫీ తోటలో… రాధా అనే మహిళ ఒక్కరే ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఎంత అరిచినా అక్కడ ఎవరూ లేకపోవడంతో… పెద్దపులి తన పని తాను చేసేసింది. టీమిండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి ( Minnu Mani ) బంధువు రాధా ను చంపేసి మృతదేహాన్ని సగభాగం వరకు తినేసిందట ఆ పెద్దపులి ( Tiger ).

పెద్దపులి అక్కడి నుంచి వెళ్లిపోయిన తర్వాత… కాఫీ తోటలో పనిచేసే మరి కొంత మంది అక్కడికి చేరుకోవడంతో అసలు విషయం బయటపడింది. ఈ ఘటన బయటకు రావడంతో…. టీమిండియా మహిళా క్రికెటర్ మిన్ను మణి ( Minnu Mani ) కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం కూడా… తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాధా కుటుంబానికి నష్టపరిహారం కూడా ఇచ్చేందుకు.. కేరళ సర్కార్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

Also Read: ICC ODI Team of Year: టీమిండియాకు అవమానం.. ICC ODI జట్టులో ఒక్కడూ లేడు ?

ఇక రాధ మరణం తర్వాత కేరళ రాష్ట్రంలో ప్రజల నుంచి తీవ్ర నిరసన సెగలు తెరపైకి వస్తున్నాయి. కేరళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకి ఎక్కి నిరసనలు తెలుపుతున్నారు. క్రూర మృగాల దాడిలో 10 సంవత్సరాలలో దాదాపు 8 మంది మృతి చెందారని… ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న కేరళ సర్కార్ మాత్రం స్పందించడం లేదని… నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేరళ రాష్ట్ర ప్రజలు. అయితే పెద్ద పులుల దాడులపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అల్లరి అయినట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని మరి దీనిపై ప్రత్యేక కార్యచరణ రూపొందించేందుకు సిద్ధమైందట. ఇక  రాధా మృతి చెందడంతో మహిళా క్రికెటర్ మిన్ను మణి ( Minnu Mani )… సంతాపం తెలిపారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×