Intinti Ramayanam Today Episode January 25th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని డాక్యుమెంట్స్ మీద అందరి చేత బలవంతంగా సంతకం పెట్టడానికి ఒప్పిస్తుంది. అందరూ డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ లో ఏం రాసానో అని మీరందరూ చదవండి మీకే తెలుస్తుంది అని అవని అంటుంది. దానికి పల్లవి నేను చదువుతాను బావగారు అని ముందుకు వస్తుంది ఆ డాక్యుమెంట్స్ ని చదవడానికి చేతికి తీసుకుంటుంది.. అది చూసి ఏంటక్క ఇదంతా ఆస్తి మొత్తం బావగారి పేరు మీద రాయడానికి వీలునామ వ్రాయించావా అని షాక్ అయినట్టు యాక్ట్ చేసింది.. అత్తయ్య మీరు ఒకసారి చదవండి ఇందులో ఏం రాసిందో మీకు తెలుస్తుంది అక్క ఇలా చేస్తుందని మేము అస్సలు ఊహించలేదని పల్లవి అంటుంది.. పార్వతి ఆ డాక్యుమెంట్స్ ని చదువుతుంది. అక్షయ్ కి తన ఆస్తి మొత్తం రాయించాలని తన తమ్ముళ్ళందరూ దానికి ఒప్పుకున్నట్లు సంతకాలు కూడా చేసినట్లు అందులో ఉందని చదువుతుంది. ఆ మాట విన్న అందరూ షాక్ అవుతారు అవని కూడా షాక్ అవుతుంది. ఇంట్లో వాళ్ళందరూ అవనిని నిలదీస్తారు. అవని మాత్రం నేనే తప్పు చేయలేదు నేను అలా రాయించలేదని వాదిస్తుంది కానీ ఎవ్వరూ నమ్మరు. పని ఇదే తప్పని అందరూ అంటారు ఇక భానుమతి అదే పనిలో ఉండి రెచ్చిపోతుంది. అందరూ అవనీదే తప్పంటూ వాదిస్తారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. ఇంట్లో వాళ్ళందరూ అవనిదే తప్పని అవని డబ్బు మనిషిని నానా మాటలు అంటారు పార్వతి కూడా నువ్వు ఒక అనాధవి అయినా నీకు డబ్బు పిచ్చి ఏంటి మంచి కుటుంబం దొరికిందని ఆలోచించాలిగాని ఇలా ఆలోచిస్తావని అవనిని దారుణంగా తిడుతుంది. అది విన్న పల్లవి సంతోషంతో మురిసిపోతుంది. ఇక లాయర్ ది తప్పని లాయర్ ని తీసుకురమ్మని అవన్నీ చెప్తుంది. రాజేంద్రప్రసాద్ లాయర్ ని పిలిపిస్తాడు. లాయరు ఇంటికొచ్చి అవని చెప్పినట్టే రాసానని అవనికి షాక్ ఇస్తాడు. నేను మీకు 40 ఏళ్ల మీ ఫ్యామిలీ లాయర్ గా పనిచేస్తున్నాను కానీ మీ ఫ్యామిలీ గొడవల్లోకి నన్ను లాగకండి మీ కోడలు చెప్పినట్టే నేను రాస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. ఇక లాయర్ చెప్పిన తర్వాత కూడా నీ మాటలే నమ్మమంటావా? నువ్వు చేసింది తప్పు అని పార్వతి అంటుంది. ఇక పల్లవి ఇంట్లో జరిగిన రచ్చ గురించి వాళ్ళ నాన్నతో చెప్తుంది.. ఇక అవని లాయర్ దగ్గరికి నిజం తెలుసుకోవాలని బయలుదేరుతుంది లాయర్ ని దుమ్ము దులిపేసి అసలు నిజం బయట పెట్టిస్తుంది. ఇదంతా చేసింది పల్లవిని అని తెలుసుకొని పల్లవి దగ్గరికి వెళ్లి వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటుంది ఇక ఊరుకునేది లేదు అసలు నిజం బయట పెట్టాలని అనుకుంటుంది.
నువ్వు ఇంతకు తెగిస్తావా ఇప్పుడు కుటుంబం చీలిపోయారు చేస్తావా అని పల్లవి పై కోపంగా అరుస్తుంది అవని.. నేను చెప్పాను కదా అక్క నాకు కావాల్సింది జరిగేంతవరకు నేను ఏదైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తానని ఇప్పుడు నువ్వే నీ అంతటి నువ్వే ఉచ్చులోకి బిగించుకున్నావ్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా ఎవరు నమ్మరు అత్తయ్య నమ్ముతుందని అనుకుంటున్నావా అంటే నువ్వు చేసిన ప్రతి విషయాన్ని నేను నమ్మించి అలా చేస్తాను అన్ని బయట పెడతానని అవని వార్నింగ్ ఇస్తుంది. అక్కకి నిజం తెలిసిపోయింది ఇక అవని ఆగదు నేను ఏదో ఒకటి చేయాలని అనుకుంటుంది. అవని వెళ్తుంటే అవని శారీ పిక్ ని ఫోటో తీసుకుంటుంది. అలాంటిసారి నేను నాకు కావాలని పల్లవి షాప్ అతనికి ఫోన్ చేసి అడుగుతుంది అతని వెంటనే సారి పంపిస్తానని చెప్తాడు.
ఇక అవని ఇంటికి వెళ్లి ఈ విషయాన్ని అత్తయ్యకి ఎలాగైనా చెప్పాలని కోపంగా బయలుదేరుతుంది అవని వెనకాలే పల్లవి కూడా మరో ఆటోలో వెళుతుంది. అవని ఇంట్లోకి వెళ్ళగానే అత్తయ్య అత్తయ్య అని అరుచుకుంటూ వెతుకుతుంది. ఇప్పుడే వెనకాల ఆటోలో పల్లవి కూడా అవన్నీ ఇలాంటి శారీనే కట్టుకొని ఇంటికి వస్తుంది. పార్వతిని పైనుంచి తోసేస్తుంది పల్లవి. అవని శారీ చూసి అవి నేను ఇదంతా చేసిందని అనుకుంటుంది. ఇక పార్వతి స్పృహ తప్పి కింద పడిపోతుంది. అవని మాత్రం గదిలో ఎవరో గడి పెట్టారని గడియ తీయండి అని మొత్తుకుంటుంది. పార్వతిని కింద పడిన తర్వాత పల్లవి ఆ గడియని తీస్తుంది. ఇక కిందికి వచ్చి చూడగానే పార్వతి కింద పడిపోతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..