BigTV English

Shami resumes bowling: ప్రాక్టీస్ షురూ చేసిన షమీ.. నెట్టింట వీడియో వైరల్

Shami resumes bowling: ప్రాక్టీస్ షురూ చేసిన షమీ.. నెట్టింట వీడియో వైరల్

Mohammed Shami resumes bowling: టీమ్ ఇండియా పేసర్ మహ్మద్ షమ్మీ ప్రాక్టీస్ షురూ చేశాడు. గత పదేళ్లుగా టీమ్ ఇండియాలో కీలకపాత్ర పోషించిన షమీ 2023 వన్డే వరల్డ్ కప్ జట్టు విజయాల్లో అద్భుత పాత్ర పోషించాడు. అంతేకాదు పదేళ్లుగా రాని పేరు, ఒక్క ప్రపంచకప్ తో తన సొంతమైంది. ఫైనల్ లో ఓటమి పాలైనా, తన పెర్ ఫార్మెన్స్ తో ప్రశంసలు అందుకున్నాడు. ఒక దశలో వెన్ను గాయం ఇబ్బంది పెడుతున్నా ఇంజక్షన్లు తీసుకొని మరీ దేశం కోసం పోరాడిన యోధుడిగా పేరుపొందాడు.


వన్డే ప్రపంచకప్ ఫైనల్ లో జరిగిన ఓటమితో తను కూడా కొన్నినెలలు ఆటకు దూరమైపోయాడు. ఎందుకంటే వెన్ను నొప్పి కారణంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. దీంతో టీ 20 ప్రపంచ కప్-2024కూ దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న షమి తాజాగా ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

Also Read: ఆ క్షణం.. నా మైండ్ బ్లాంక్ అయ్యింది.. ప్రపంచకప్ లో ఉత్కంఠ విజయంపై రోహిత్ శర్మ


ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను తనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతేకాదు బాలీవుడ్ లేటెస్ట్ హిట్ సాంగ్ ‘తౌబా తౌబా’ మ్యూజిక్ను దీనికి జత చేశాడు. అది చూసిన అభిమానులు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఇదే పాట పెట్టి, కుంటుతూ రీల్ చేసిన వెటరన్ ప్లేయర్లు హర్భజన్, యువరాజ్, రైనా ఎంత ఇబ్బందిపడ్డారో అందరికీ తెలిసిందే. మళ్లీ దాన్నుంచి బయటపడటానికి వారికి తలప్రాణం తోకకి వచ్చింది. మళ్లీ షమీ కూడా అదే పాట పెట్టి, తను బౌలింగ్ చేస్తున్న వీడియో షేర్ చేశాడు. అయితే వారిలా మరీ కుంటుతూ చేయలేదు కానీ, చాలా స్లోగా బౌలింగ్ చేస్తూ కనిపించాడు. దీంతో నెటిజన్లు వీడియో పెడితే పెట్టావుగానీ, ఆ పాట తీసేయమని సూచిస్తున్నారు.

ఇకపోతే ఆ వీడియో చూస్తుంటే…త్వరలోనే వస్తానని చెప్పకనే షమీ చెబుతున్నాడని అంటున్నారు. ఇకపోతే భీకరమైన వేగంతో బాల్స్ వేస్తూ, వాటిని ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ చేస్తూ ప్రపంచంలోని మేటి బ్యాటర్లను ముప్పుతిప్పులు పెట్టే మహ్మద్ షమీ నెట్ ప్రాక్టీసులో స్లో గా బాల్స్ వేయడం చూసి అభిమానులు అయ్యో అనుకుంటున్నారు. అయితే ప్రాక్టీసు ఇప్పుడే మొదలుపెట్టాడు కాబట్టి, త్వరలోనే రిషబ్ పంత్ లా తిరిగి వస్తాడని కామెంట్లు పెడుతున్నారు.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×