Dhoni Brothers: భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్ లలో మహేంద్రసింగ్ ధోని {MS DHONI} ఒకరు. ధోనీని అతడి అభిమానులు ప్రేమగా “కెప్టెన్ కూల్” అని పిలుచుకుంటారు. మైదానంలో ఎంతటి ఒత్తిడిలోనైనా ప్రశాంతంగా వ్యవహరిస్తూ కీలక నిర్ణయాలు తీసుకునే ధోని శైలికి “కెప్టెన్ కూల్” అనే పేరు మారుపేరుగా నిలిచింది. ధోని నాయకత్వంలోనే భారత జట్టు 2007లో టి-20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక ఐసీసీ టైటిల్ లను గెలుచుకుంది.
Also Read: India Tour of Bangladesh: పొలిటికల్ వార్… టీమిండియా బంగ్లాదేశ్ టూర్ రద్దు?
ధోని సోదరుల మధ్య గొడవ:
గతకొద్ది రోజులుగా మహేంద్రసింగ్ ధోని, అతడి సోదరుడు నరేంద్ర సింగ్ ధోని మధ్య గొడవలు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్ ధోనీకి.. నరేంద్ర సింగ్ ధోని అన్నయ్య. దాదాపు పది సంవత్సరాలు పెద్దవాడు. నరేంద్ర సింగ్ ధోనితో మహేంద్రసింగ్ ధోని ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు. మొదట బిజెపి పార్టీలో ఉన్న ధోని సోదరుడు 2013లో సమాజ్వాది పార్టీలో చేరాడు. నరేంద్ర సింగ్ ధోనీకి 2007 నవంబర్ 21న వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు.
అయితే ధోని సోదరులకు 2009లోనే గొడవలు జరిగాయని, అప్పటినుండే వీరిమధ్య విభేదాలు ఉన్నాయని ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇదే అదునుగా విరాట్ కోహ్లీ అభిమానులు ధోనీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నిజానికి ధోనీ కెప్టెన్సీలో రాటుదేలిన విరాట్ కోహ్లీ.. ధోని వారసుడిగా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉంది. కానీ కోహ్లీ అభిమానులు మాత్రం ధోనీని ట్రోల్ చేస్తుంటారు. ఓ ఇంటర్వ్యూలో తాము తరచూ మాట్లాడుకుంటూ ఉంటామని, తామిద్దరం మంచి ఫ్రెండ్స్ అని ధోని వెల్లడించాడు. కోహ్లీ కూడా ధోని అంటే తనకు ఎంతో అభిమానం అని గతంలోనే వెల్లడించాడు. అయితే ఈమధ్య ధోని సోదరుల మధ్య గొడవలు అంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెట్టాడు మహేంద్ర సింగ్ ధోని.
Also Read: Shubman Gill: కోహ్లీ కోసం ట్రిపుల్ సెంచరీ మిస్ చేసుకున్న గిల్… అసలు కారణం ఇదే
రూమర్స్ కి చెక్ పెట్టిన ధోని:
ధోనికి రాంచీలో ఓ బ్యూటిఫుల్ ఫామ్ హౌస్ ఉంది. ఈ ఫామ్ హౌస్ కి కైలాష్ పతి ఫామ్ హౌస్ అని పేరు పెట్టుకున్నాడు. ఈ ఫార్మ్ హౌస్ ఏడు ఎకరాల్లో విస్తరించి ఉంది. బిజెపి రాష్ట్ర కార్యాలయానికి సమీపంలోనే ధోని ఫామ్ హౌస్ ఉంటుంది. అయితే తన సోదరుడు కటిక పేదరికంలో ఉన్నాడని, అతడిని మహేంద్రసింగ్ ధోని పట్టించుకోవడంలేదని కొంతమంది ప్రచారం చేయడంతో.. తాజాగా తన సోదరుడితో కలిసి రిలాక్స్ గా మాట్లాడుకుంటూ ఒకే కారులో ఈ ఫామ్ హౌస్ లోకి వెళ్లారు ధోని సోదరులు. ఇలా ఈ ఒక్క వీడియోతో అందరి నోర్లు మూయించాడు మహేంద్ర సింగ్ ధోని. ఈ వీడియో ద్వారా ధోని సోదరుల మధ్య ఎటువంటి గొడవలు లేవని.. కోహ్లీ అభిమానులకు ధోని కౌంటర్ ఇచ్చాడంటూ కామెంట్స్ చేస్తున్నారు ధోని అభిమానులు.
Yesterday chokli fans trolled Dhoni for not having good relations with his brother and made fake theories.
Today dhoni was spotted with his brother happily relaxed in a car while returning from his farmhose😭😭🙏 pic.twitter.com/kV7Z5Kq2kd
— Ayush (@raghavayush7) July 3, 2025