Clothes Drying On Balcony During PAK vs SL: పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక (Pakistan vs Sri Lanka, 1st Test) మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ (Sri Lanka tour of Pakistan, 2026 ) జరుగుతోంది. ఇప్పటికే రావాల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (Rawalpindi Cricket Stadium) వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. అయితే.. ఈ మ్యాచ్ జరుగుతుండగా కెమెరామెన్ కు ఏమైందో తెలియదు కానీ.. స్టేడియం పక్కనే ఓ బిల్డింగ్ బాల్కనీలో ఆరేసిన బట్టలను జూమ్ చేశాడు. దాదాపు 50 సెకండ్ల పాటు వీడియో తీశాడు. దీనికి సంబంధించిన విజువల్స్ ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఇది చూసిన క్రికెట్ అభిమానులు దీనిపై దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. బాబర్ ఆజం (Babar Azam) జిడ్డు బ్యాటింగ్ భరించలేక బాల్కనీలో ఉన్న కట్ డ్రాయర్లు, నైటీలు, బనియన్లను కావాలనే కెమెరామెన్ చూపించాడని సెటైర్లు పేల్చుతున్నారు.
పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ సందర్భంగా మ్యాచ్ కాకుండా బాల్కనీలో ఉన్న బట్టలపై కెమెరామెన్ జూమ్ చేయడంపై ఫుర్ఖాన్ భట్టి ఆగ్రహం వ్యక్తం చేశాడు. లైవ్ మ్యాచ్ చూపించకుండా ఇలా దిక్కుమాలిన విజువల్స్ ఎందుకు పెట్టారని ఫైర్ అయ్యాడు.
అంతర్జాతీయ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఇలాంటి విజువల్స్ ప్లే చేస్తే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పరువు పోతుందని ఆగ్రహించాడు. ఇలా చేసిన కెమెరామెన్ పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. బాబర్ ఆజం జిడ్డు బ్యాటింగ్ నచ్చకపోతే… ఇలా బాల్కనీలో ఉన్న బట్టలు చూపిస్తావా? అంటూ సీరియస్ అయ్యాడు. బాల్కనీలో బట్టలు చూపించిన తర్వాత వెంటనే బాబర్ ముఖాన్ని ప్లే చేసి అతడి పరువును తీశాడని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు.
పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన రావాల్పండి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 434 పరుగులు సాధించి డిక్లేర్ చేసింది. ఈ తొలి ఇన్నింగ్స్ లో కెప్టెన్ బాబర్ ఆజం పడుతూ లేస్తూ అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 446 పరుగులు సాధించి ఇరగదీసింది. ధనంజయ డీ సిల్వా, కుశాల్ మెండిస్ ఇద్దరు సెంచరీలతో రెచ్చిపోవడంతో శ్రీలంక పట్టు బిగించింది. ఇక పాకిస్తాన్ రెండో ఇన్నింగ్స్ లో అట్టర్ ఫ్లాప్ అయింది. 284 పరుగులు చేసి ఎనిమిది వికెట్లు కోల్పోయింది. చివరలో షకీల్ దాటిగా ఆడిన క్రమంలో మ్యాచ్ డ్రా అయింది.
During Pakistan Vs Sri Lanka Match Cameraman Zoom In On Clothes Drying On A Balcony. After That Bhatti Sabb 🙏🙏
🎥 Furqan Bhatti YouTube Channel. #PAKvsSL pic.twitter.com/tdUGXDA9D0— Gurtej Singh (@GGurtej) November 13, 2026