E-Paper
Advertisement

జై షా పోస్ట్ కు ఎస‌రు..ఐసీసీ కొత్త బాస్ గా న‌ఖ్వీ..ఇక BCCIని పాతాళానికి తొక్క‌డ‌మే?

జై షా పోస్ట్ కు ఎస‌రు..ఐసీసీ కొత్త బాస్ గా న‌ఖ్వీ..ఇక BCCIని పాతాళానికి తొక్క‌డ‌మే?
Advertisement

ICC Chairman: ఇండియా, పాకిస్తాన్ రెండు దేశాలు బ‌ద్ద శ‌త్రువులే. ఈ త‌రుణంలోనే పొద్దున లేస్తే చాలు ఇండియాపైన పాకిస్తాన్ ఏదో ఒక రూపంలో విష ప్రచారం చేస్తుందన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్రికెట్ ఫీల్డ్ లో బీసీసీఐకి పోటీగా ఇండియాలో అవమానించేలా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుడుతూనే ఉంటుంది. అదే సమయంలో నెగిటివ్ ప్రచారం కూడా చేస్తూ ఉంటుంది. ఇప్పటికే ఐపీఎల్ కు పోటీగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ ను తీసుకువచ్చి చేతులు కాల్చుకున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు… ఇప్పుడు మరో విష ప్రచారానికి తెరలేపినట్లు తెలుస్తోంది. ఏకంగా ICC బాస్ జై షా ( ICC Chairman Jay Shah) పదవికి ఎసరు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. జై షాను తొలగించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ న‌ఖ్వీకి ( Mohsin Naqvi) ఐసీసీ అధ్యక్ష ( ICC Chairman) బాధ్యతలు ఇస్తారని చర్చ జరుగుతోంది. ఈ మేరకు పాకిస్తాన్ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం కూడా మొదలైంది. దీనికి సంబంధించిన పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి.

Also Read: MI vs KKR Toss Fixing: వివాదంగా టాస్..తెర‌పైకి ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లు, KKRపై ముంబై విజ‌యం

2027 తర్వాతే మొహ్సిన్ న‌ఖ్వీకి ఐసీసీ బాధ్యతలు ?

Advertisement

ఐసీసీ బాస్ జై షా పదవి గండంలో ఉందని.. అతని స్థానంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీకి అవకాశం వస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మేరకు ESPN నివేదిక తయారు చేసినట్లు కూడా కొంతమంది ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని సదరు ESPN వెల్లడించింది. అయితే 2027 తర్వాత మొహ్సిన్ న‌ఖ్వీకి ఐసీసీ ఛైర్మ‌న్‌ బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు కూడా పేర్కొంది. 2024 సంవత్సరం డిసెంబర్ ఒకటో తేదీన ఐసీసీ ఛైర్మ‌న్‌ బాధ్యతలను జై షా తీసుకున్నారు. ఐసీసీ ఛైర్మ‌న్‌ పదవి కాలం కేవలం మూడు సంవత్సరాలు మాత్రమే. అంటే 2027 చివరి వరకు ఐసీసీ ఛైర్మ‌న్‌ బాధ్యతలో జై షా ఉంటాడు. అంటే వన్డే వరల్డ్ కప్ షా హయాంలోనే పూర్తవుతుంది. ఆ తర్వాత న‌ఖ్వీకి అవకాశం ఉండే ఛాన్సులు ఉన్నట్ల చెబుతున్నారు. అప్పటివరకు జై షాకు ఎలాంటి ఢోకా లేదు.

ఐసీసీ అధ్యక్షుడి ఎన్నిక ఎలా ఉంటుంది ?

అంతర్జాతీయ క్రికెట్ ను శాసించే ఐసీసీ అధ్యక్ష పదవి చేపట్టాలంటే పెద్ద ప్రాసెసే ఉంటుంది.. ఈ ఐసీసీ చైర్మన్ పదవి చేపట్టాలంటే 108 సభ్య దేశాల ప్రతి నిధులు ఓటు వేయాల్సి ఉంటుంది. ఇందులో మెజారిటీ ఓట్లు ఎవరికి లభిస్తే వాళ్లే చైర్మన్ అవుతారు. అప్పుడప్పుడు ఏకగ్రీవం కూడా అవుతుంది. మరి పాకిస్తాన్ లాంటి చిన్న క్రికెట్ బోర్డు చైర్మన్ న‌ఖ్వీకి ఈ అవకాశం వచ్చేది డౌటే. దానికి తోడు ఇప్పటికే ఆసియా క్రికెట్ కౌన్సిల్, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, చైర్మన్ గా నఖ్వీ వ్యవహరిస్తున్నాడు. ఐసీసీ బాస్ కావాలంటే ఈ రెండు పదవులను కోల్పోవాల్సి వస్తుంది. అయితే ఒకవేళ ఐసీసీ బాస్ గా న‌ఖ్వీ బాధ్యతలు తీసుకుంటే మాత్రం ఇండియాకు చుక్కలు కనిపించడం గ్యారంటీ అంటున్నారు. బీసీసీఐని ముప్ప‌తిప్పులు పెట్టే ప్రయత్నం న‌ఖ్వీ చేస్తాడని అంటున్నారు. కాగా న‌ఖ్వీకి ఐసీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి కాలం 2028 వ‌స్తే, 2032 దాక ఉంటాడు.

Advertisement

Also Read: PSL లో ఫిక్సింగ్ క‌ల‌క‌లం..అర్ధ‌రాత్రి హోట‌ల్ గ‌దిలోకి 4 గురు దుండ‌గులు..షాహీన్‌, సికంద‌ర్ పై 2 ఏళ్ల బ్యాన్

 

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×