BigTV English

Most Sixes in IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్.. సిక్సర్ల మొనగాడు.. మన అభిషేక్ శర్మ!

Most Sixes in IPL 2024: ఐపీఎల్ 2024 సీజన్.. సిక్సర్ల మొనగాడు.. మన అభిషేక్ శర్మ!

Abhishek Sharma has Emerged as the Top Six-Hitter in IPL 2024: టీ 20 మ్యాచ్ లంటే.. అందరికీ ఎక్కువ ఇంట్రస్ట్ ఎందుకంటే సిక్సర్ల వర్షం కురుస్తుంటుంది. ఫోర్లు వెల్లువలా వస్తుంటాయి. అందుకనే అందరూ ఉప్పొంగే ఉత్సాహంతో స్డేడియంలకి వస్తుంటారు.
తమ అభిమాన జట్లకి మద్దతు తెలుపుతూ ఎంజాయ్ చేస్తుంటారు.


ఈ క్రమంలో ఐపీఎల్ 2024 సీజన్ లో ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎవరెన్ని సిక్సర్లు కొట్టారో లెక్క తేలిపోయింది. మరి ఇందులో నెంబర్ వన్ సిక్సర్ల మొనగాడు ఎవరంటే హైదరాబాద్ సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఒక్కడే టాపర్ గా ఉన్నాడు. తను మొత్తం 17 మ్యాచ్ లు ఆడి 42 సిక్సర్లు కొట్టాడు. నెంబర్ వన్ గా నిలిచాడు.

ఇక అభిషేక్ శర్మ తర్వాత అత్యధిక సిక్సులు కొట్టిన వారిలో.. క్రికెట్ లో అరివీర భయంకరుడు విరాట్ కొహ్లీ ఉన్నాడు. తను 38 సిక్సర్లతో నెంబర్ 2 ప్లేస్ లో ఉన్నాడు. ఆ తర్వాత …
3. లక్నో సూపర్ జెయింట్స్ నుంచి  నికోలస్ పూరన్ (36)
4. హైదరాబాద్ నుంచి హెన్రిచ్ క్లాసిన్ (34)
5. రాజస్థాన్ రాయల్స్ నుంచి రియాన్ పరాగ్ (33)
6. ఆర్సీబీ నుంచి రజత్ పటీదార్ (33)
7. కోల్ కతా నుంచి సునీల్ నరైన్ (32)
8. హైదరాబాద్ నుంచి ట్రావిస్ హెడ్ (31)
9. చెన్నయ్ సూపర్ కింగ్స్ నుంచి శివమ్ దుబె (28)
10. ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి జేక్ ఫ్రాజర్ (28)
ఇలా సిక్సర్ల వీరులు వరుసగా ఉన్నారు.


Also Read: ఐపీఎల్ 2024 విజేత కోల్‌కతా నైట్ రైడర్స్..

అయితే దురదృష్టం ఏమిటంటే 42 సిక్సులు కొట్టిన వీరుడు అభిషేక్ శర్మ ఉండి కూడా ఫైనల్ లో హైదరాబాద్ విజయం సాధించలేకపోయింది. ఇక్కడ మరో చిత్రం ఏమిటంటే… టాప్ 10 సిక్సర్ల హీరోల జాబితాలో ట్రోఫీ సాధించిన కోల్ కతా ప్లేయర్ సునీల్ నరైన్ ఒక్కరే ఉన్నారు.
దీనిని బట్టి అర్థమైన నీతి ఏమిటంటే…టీ 20 అంటే రొడ్డ కొట్టుడు ఒక్కటే కాదు, నాణ్యమైన ఆట కూడా ఆడితేనే కప్ సాధించగలమనే సత్యం బోధపడిందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

Tags

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×