BigTV English

MS Dhoni : ధోని ఏది చేసినా ట్రెండే.. ఇక పవన్ కళ్యాణ్ లాగే.. అందరూ ఎర్ర కండువా కప్పుకోండి!

MS Dhoni : ధోని ఏది చేసినా ట్రెండే.. ఇక పవన్ కళ్యాణ్ లాగే.. అందరూ ఎర్ర కండువా కప్పుకోండి!

MS Dhoni : టీమిండియా క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ధోనీ క్రికెట్ ఆడితే అది ఒక ట్రెండే.. క్రికెట్ ఆడినన్ని రోజులు పలు రికార్డులు క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ధోనీ తన సొంత రాష్ట్రం జార్జండ్ కి సరికొత్త దిశా నిర్దేశం చేయడానికి రెడీ అయ్యారు. క్రీడలు, పర్యాటక రంగాలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ధోనీ సలహాలు, సహకారం తీసుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో ధోనీ ఓ కార్యక్రమంలో కనిపించాడు. ఇందులో ధోనీ ఎర్ర కండువా కప్పుకొని ఫొటోకి పోజులిచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఎర్ర కండువా కప్పుకొని ఇలాగే పలు సందర్భాల్లో కనిపించిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అందరూ ఎర్ర కండువా కప్పుకోండి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 


Also Read :  Sara – Gill: సీక్రెట్ గా గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సారా… క్రికెట్ కిట్ తో ఫోటో దిగి మరీ!

సమగ్ర అభివృద్ధికి శ్రీకారం.. 


ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిజిటల్ గవర్నెన్స్ వంటి ఆడ్వాన్స్ డ్ టెక్నాలజీ ఉపయోగిస్తూ.. రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. జార్ఖండ్ తీసుకుంటున్న ఈ కీలక నిర్ణయాలు.. రాష్ట్ర భవిష్యత్ ను పూర్తి గా మార్చబోతున్నాయి. ముఖ్యంగా జార్ఖండ్ క్రీడలు, పర్యాటక రంగాలను కొత్త శిఖరాలను తీసుకెళ్లడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం మాజీ భారత క్రికెట్ కెప్టెన్ ఎం.ఎస్. ధోనీ సహకారం కోరుతోంది. ఇందుకోసం ఆ రాష్ట్ర పర్యాటక, కళలు, సంస్కృతి క్రీడా శాఖ మంత్రి సుదివ్య కుమార్ తో భేటీ అయ్యారు. క్రీడా మౌలిక సదుపాయలు, పర్యాటక సామర్థ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ధోనీ అనుభవం.. నిబద్ధతతో రాష్ట్రాభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ విషయం పై ధోనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. 

కొత్త టెక్నాలజీ.. 

జార్ఖండ్ లోని దేవ్ ఘర్ జిల్లా యంత్రాంగం ఓ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. జులై 11 నుంచి ప్రారంభమైన శ్రావణి మేళాకు వచ్చే భక్తులకు సాయం చేసేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ ను ప్రారంభించింది. ఓ లింక్ ద్వారా డౌన్ లోడ్ చేసుకోగలిగే ఈ చాట్ బాట్.. దేవ్ ఘర్ చరిత్ర, ఆలయ విశేషాల గురించి.. అదేవిధంగా మేళా సమయంలో భక్తులకు అవసరమైన అన్ని విధాల సమాచారం అందిస్తుంది. ముఖ్యంగా మేళా ప్రాంతంలో రద్దీని నియంత్రించడానికి భద్రతను పెంచేందుకు ఫేషియల్ రికగ్నిషన్, హెడ్ కౌంటర్ కెమెరాలను కూడా ఏర్పాటు చేసారు. ముఖ్యంగా జార్ఖండ్ ప్రభుత్వం తమ అన్ని కార్యాలయాలను 2026 నాటికి పూర్తిగా డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించింది.

Related News

ODI WORLD CUP 2027 : కొంపముంచిన ఆఫ్ఘనిస్తాన్.. 2027 ప్రపంచ కప్ నుంచి ఇంగ్లాండ్ ఎలిమినేట్?

Team India Jersey : భారీగా పెరిగిన టీమిండియా జెర్సీ వ్యాల్యూ… ఒక్కో మ్యాచ్ కు ఎంత అంటే

Ashwin-Babar : పాకిస్తాన్ మాజీ కెప్టెన్ బాబర్ జట్టులోకి రవిచంద్రన్ అశ్విన్?

Yuvi – Msd : Ms ధోనికి యువరాజ్ అంటే వణుకు… అందుకే తొక్కేశాడు!

Hardik – Krunal : పాండ్యా బ్రదర్స్ గొప్ప మనసు.. చిన్ననాటి కోచ్ కోసం భారీ సాయం.. ఎన్ని లక్షలు అంటే

Chinnaswamy Stadium : బెంగళూరు అభిమానులకు బిగ్ షాక్.. చిన్న స్వామి స్టేడియం పై షాకింగ్ నిర్ణయం

Big Stories

×