జపాన్ లోని ఒకాసోలో జరిగిన వరల్డ్ ఎక్స్ పో 2025 అందరినీ ఆకట్టుకంది. చిన్న చిన్న యంత్రాల నుంచి భారీ మిషనరీలు కనువిందు చేశాయి. ఈ ఎక్స్ పోలో భారతీయ రైల్వే పెవిలియన్ బాగా అలరించింది. భారతీయ రైల్వే ఇంజనీరింగ్ అద్భుతాలు, ఆవిష్కరణలు జపనీయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వందేభారత్ రైలు అందరినీ ఆకట్టుకుంది. వైట్ అండ్ బ్లూ కలర్ లో మెరుస్తూ దూసుకెళ్లే రైలును చూసి అక్కడి ప్రజలు ఉత్సాహంగా సెల్పీలు తీసుకున్నారు. సెమీ హైస్పీడ్ రైలు నమూనాను చూస్తున్న పిల్లలు, ఈ రైలు స్పెసిఫికేషన్లుతో పాటు టెక్ విషయాలను గమనించారు.
చేతులు జోడించి నమస్కరిస్తున్న జపనీయులు
ఇక భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా చేతులు జోడించి ఇండియన్స్ కు నమస్తే అని చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. జపాన్ కు వెళ్లిన విజిటర్స్ ను చక్కటి చిరునవ్వుతో, నమస్కరిస్తూ స్వాగతించారు నిర్వాహకులు. భారతీయ అధికారులను ఎంతో ప్రేమగా వెల్ కమ్ పలికారు. వారి స్వాగతానికి ఇండియన్ ఆఫీసర్స్ ఫిదా అయ్యారు.
చీనాబ్ వంతెన అందానికి దాసోహం
ఇక ఇండియన్ ఫెవిలియన్ లోని చీనాబ్ రైల్వే వంతెన స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ వంతెన చుట్టూ జపనీయులు గుమిగూడారు. వారు ఆ రైల్వే వంతెనకు సంబంధించిన ఫోటోలను రకరకాల యాంగిల్స్ లో తీసుకున్నారు. బెస్ట్ ఫోటోలను క్లిక్ అనిపించేందుకు కిందకు వంగి ఫోటోలు తీశారు. హిమాలయ పర్వత శ్రేణిలో ఉగ్ర రూపంలో ప్రవహించే నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉన్న చీనాబ్ వంతెన కేవలం ఒక నిర్మాణ అద్భుతం కాదు, భారతీయ మనుగడ కోసం జాతీయ సంకల్పాన్ని సూచిస్తుందని భారతీయ అధికారులు విజిటర్స్ కు వివరించారు.
Read Also: సమోసా ఇండియాలో పుట్టిందని అనుకుంటున్నారా? కానే కాదు.. ఆ దేశంలో పుట్టి.. ఇక్కడికి!
అంతేకాదు, కాశ్మీర్ ప్రాంతంలో దేశంలో మొట్టమొదటి కేబుల్ స్టేడ్ రైలు వంతెన అయిన అంజి ఖాడ్ వంతెన మరో ఆకర్షణీయ అంశంగా మారింది. ప్రమాదకర ప్రదేశంలో నిర్మాణ కార్మికులు ఈ బ్రిడ్జిని పూర్తి చేసేందుకు ఎంత కష్ట పడ్డారో ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియోను చూస్తు పర్యాటకులు అలాగే ఉండిపోయారు. చీనాబ్ తో పాటు అంజిఖాడ్ వంతెన ముందు నిల్చోని జపనీస్ విద్యార్థులు ఫోటోలకు పోజులిచ్చారు. భారతీయ రైల్వే నెట్ వర్క్ డిజిటల్ మ్యాప్ ముందు గ్రూప్ సెల్ఫీ తీసుకుంటూ, నమస్తే ఇండియా అంటూ ఎంజాయ్ చేశారు.
వరల్డ్ ఎక్స్‌పో 2025 ఎప్పటి లాగే కొత్త థీమ్ తో ప్రారంభించారు. ‘మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాన్ని రూపొందించడం’ అనే కాన్సెప్ట్ ప్రకారం దీనిని ఏర్పాటు చేశారు. అంటే, సమాజ భవిష్యత్ కోసం మనం తీసుకొస్తున్న అద్భుతమైన మార్పులను సూచించేలా భారతీయ రైల్వే అద్భుతమైన రైల్వే వంతెలను ప్రదర్శించింది. థీమ్ ను ప్రతిబింబించేలా ఏర్పాటు చేసింది.
Read Also: బాబోయ్.. మేం నడపలేం, చేతులెత్తేసిన పాక్ రైల్వే, పలు రైళ్లు ప్రైవేట్ పరం!