BigTV English

Sampoornesh Babu: మోహన్ బాబు నన్ను కూలోడివని అన్నారు.. ఆ రోజు బస్సు ఆపేసి.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్

Sampoornesh Babu: మోహన్ బాబు నన్ను కూలోడివని అన్నారు.. ఆ రోజు బస్సు ఆపేసి.. సంపూర్ణేష్ బాబు కామెంట్స్

Sampoornesh Babu Shocking Comments on Mohan Babu: సంపూర్ణేష్ బాబు.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అసవరం పేరు. హృదయ కాలేయం, కొబ్బరి మంట వంటి చిత్రాలతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు. కామెడీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకు కెరాఫ్ అయిన సంపూర్ణేష్ బాబుకు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింది. హృదయ కాలేయం సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో సంపూర్ణేష్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆ తర్వాత కొబ్బరి మంట, బజార్ రౌడీ సినిమాల్లో నటించాడు. మెల్లిమెల్లిగా ఆయన సినిమాలకు ఆదరణ తగ్గడంతో ప్రస్తుతం పెద్దగా సినిమాలు చేయడం లేదు. అయితే బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చిన అతడు బుల్లితెరపై కూడా మంచి గుర్తింపు పొందాడు.


ఆ క్షణం ప్రత్యేకం

అయితే సెలబ్రిటీ హోదా వచ్చినప్పటి అతడు సింపుల్ లైఫ్ కే ప్రాధాన్యత ఇస్తాడు. ఆడంబరాలకు పోకుండ సాధారణ వ్యక్తిలా జీవిస్తాడు. స్టార్ డమ్ వచ్చినప్పటికీ ఇప్పటికీ తన సొంతూరు సిద్ధిపేటలోనే జీవిస్తున్నాడు. అయితే ఓ సారి ఆయన బస్సులో ప్రయాణించిన సంఘటనను గుర్తు చేసుకున్నారు. గతంలో సిద్ధిపేట నుంచి హైదరాబాద్ రావడానికి ఆయన బస్సులో ప్రయాణించాడట. తాను బస్సులో ఉన్నానని తెలిసి బస్సు ఆపేశారట. మొదట ముఖానికి కర్చీఫ్ కట్టుకుని ఎక్కిన ఆయన ఆ తర్వాత కర్ఛీఫ్ తీసేశారట. ఆ బస్సులో ఉన్న ఓ వ్యక్తి తనని గుర్తు పెట్టి సార్ మీరూ బస్సులోనా? అంటూ షాక్ అయ్యాడు. మీరు ఎక్కారా? అని సర్ప్రైజ్ అయ్యాడు. అతడి హడావుడి చేయడంతో ఆ విషయం డ్రైవర్ వరకు వెళ్లింది. ఇక బస్సులోని అందరికి నేను బస్సులో ఉన్న విషయం అంతా హడావుడి చేశారు. అంత ఎంతో ఎగ్జైట్ అయ్యారు. దీంతో ఓ చోట బస్సు ఆపేశారు. ఇక డ్రైవర్ ఎగ్జైట్మెంట్ తో వచ్చి నాతో సెల్ఫీ తీసుకున్నాడు.


నా వల్ల బస్సు ఆపేశారు..

ఆయన కూతురు నా ఫ్యాన్ అని, ఈ విషయం తెలిస్తే తను చాలా సంతోషిస్తుందని ఆయన అత్యుత్సాహాం చూపించారు. అలా అంతా నన్ను చూసి ఎగ్జైట్ అవ్వడం, గుర్తు పట్టడం,  ఆ సమయంలో వారి కళ్లల్లో కనిపించిన ఎగ్జైట్మెంట్ నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇచ్చింది. వారంత నన్ను చూసిన ఆ సంఘటన నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పుకొచ్చారు. కారులో ప్రయాణించమా, బస్సులో ప్రయాణించమా అనేది ముఖ్యం కాదు. నేను వెళ్లాలనుకుంటే ఎలా అయినా వెళ్తా. డ్రైవర్ అందుబాటులో లేని కారణంగా అప్పుడు బస్సులో ప్రయాణించాను. కానీ, ఆ బస్సు ప్రయాణం నాకు చాలా స్పెషల్ మూమెంట్ ని ఇచ్చింది. అలాగే ఓసారి షూటింగ్ కోసం బైక్ లిఫ్ట్ తీసుకుని వెళ్లిన సంఘటనను కూడా గుర్తు చేసుకున్నాడు. ఓ రోజు షూటింగ్ టైం అవుతుంది.. బయటకు వచ్చి ఓ వ్యక్తిని లిఫ్ట్ అడిగాను. భయ్యా.. నన్ను పెద్దమ్మ గుడి దగ్గర డ్రాప్ చేయవా? అని అడిగాను. దిగాక నన్ను గుర్తు పట్టి అతడు షాక్ అయ్యాడు.

కాస్ట్లీ కూలోడిని అన్నారు..

స్టార్ డమ్ ఉన్నంత మాత్రానా కారులో తిరగాలని నేను అనుకోను. అందుకే ఆ టైం నాకు ఏది అందుబాటులో ఉంటే అందులో ప్రయాణిస్తాను. అందుకే నన్ను మోహన్ బాబు గారు కాస్ట్లీ పనోడివి అన్నారు. నా ఉద్దేశం కూడా అదే. ఓ రోజు మోహన్ బాబు కారు షూటింగ్ లో నాతో ఇలా అన్నారు. ‘‘ఏమయ్యా టైంకి వెళ్తవా?’ అని అడిగారు. టైంకి వెళ్లు.. నువ్వోక కూలోడివి.. అతి కాస్ట్లీ కూలోడివి. ఆరుగంటలకు వస్తే ఆరుగంటలకు వెళ్లు.. 8 గంటలకు వస్తే.. 8 గంటలకు వెళ్లు. టైం సెన్స్ అనేది ఉండాలి. ఆరు గంటలకు ప్యాకప్ అయితే నువ్వు వెళ్లిపో’’ అని అన్నారు అని గుర్తు చేసుకున్నారు. గతంలో అతడు చేసిన కామెంట్స్ తాజాగా వైరల్ అవుతున్నాయి. ఆయన సిప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. స్టార్ డమ్ వచ్చినంత మాత్రాన.. గర్వం లేకుండా.. తన మూలాలను మర్చిపోకుండ ఉండటమంటే అది సాధ్యం కాదు. సెలబ్రిటీ హోదా వచ్చాక సాధారణ వ్యక్తిలా ఉండటం చాలా కష్టం. కానీ, సంపూర్ణేష్ బాబు మాత్రం తన మూలను మర్చిపోకుండా.. సాధారణం జీవితం గడపడం అది ఆయన గొప్పతనం అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

Related News

Naga Vamsi: స్పీచ్ లు వద్దులెండి మేడం, ఒక్క దెబ్బతో నాగ వంశీ ఎంత మారిపోయాడో?

Dulquar Salman : గత జన్మలో కళ్యాణి నేను కవలపిల్లలం

Venky Atluri: స్టేజ్ పైనే నాగ వంశీ పరువు తీసేసిన దర్శకుడు వెంకీ అట్లూరి

Kishkindhapuri : హర్రర్ సినిమా అన్నారు, ఎక్కడ భయపడాలో కూడా చెప్పండి

Bollywood: 15 ఏళ్ల బంధానికి స్వస్తి పలుకుతూ.. విడాకులు ప్రకటించిన బాలీవుడ్ నటి!

Anushka Shetty : అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ బానే సెట్ చేసింది, స్వీటీ అభిమానులకు పండగే

Big Stories

×