MS dhoni: ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో చెన్నై సూపర్ కింగ్స్ ఎంత సక్సెస్ఫుల్ జట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్ లో ఏకంగా ఐదుసార్లు ఛాంపియన్ గా నిలిచింది సీఎస్కే. ఈ జట్టు ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఎవరంటే.. వందలో 90% మంది చెప్పే పేరు మహేంద్రసింగ్ ధోని. కానీ ఇప్పుడు ధోనీని చాలామంది నిందిస్తున్నారు. సరిగా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడని, అతడే జట్టుకు భారంగా మారాడని, రిటైర్మెంట్ ప్రకటించకుండా ఇంకా జట్టును పట్టుకొని ఎందుకు వేలాడుతున్నాడు అంటూ ధోనీని అనరాని మాటలు అంటున్నారు.
ఇక ఈ సీజన్ ప్రారంభమైనప్పటినుండే ధోని రిటైర్ అవుతాడా..? అనే ప్రశ్న వైరల్ అవుతూనే ఉంది. ఈ క్రమంలో ఏప్రిల్ 5వ తేదీన చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ – ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ని వీక్షించేందుకు మహేంద్రసింగ్ ధోని తల్లిదండ్రులు మైదానానికి వచ్చారు. దీంతో ఢిల్లీ మ్యాచ్ అనంతరం ధోని ఇక రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని వార్తలు వినిపించాయి. కానీ మ్యాచ్ ముగిసిన అనంతరం ధోని ఎటువంటి ప్రకటన చేయలేదు.
అయినప్పటికీ ధోనీ ఇక ఐపీఎల్ కి గుడ్ బై చెప్పబోతున్నాడని క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ రిటైర్మెంట్ వార్తలపై తాజాగా ధోని స్పందించాడు. ఐపీఎల్ 2026 లో ఆడాలా..? వద్దా..? అన్నదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పుకొచ్చాడు. తాను ప్రతి సంవత్సరం సమీక్షించుకున్నాకే ఐపీఎల్ లో పాల్గొంటున్నానని.. ప్రస్తుతం తనకి 43 ఏళ్లు కాగా, ఈ జూలై నాటికి 44 ఏళ్ళు వస్తాయని, మరో 10 నెలల సమయం ఉన్నందున రిటైర్మెంట్ గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని చెప్పుకొచ్చాడు.
తన శరీరం సహకరిస్తే ఖచ్చితంగా వచ్చే ఏడాది కూడా ఐపీఎల్ ఆడతానని పేర్కొన్నాడు ధోని. ఇక మంగళవారం రోజు ముల్లాన్ పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎంఎస్ ధోని 12 బంతుల్లో 27 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్లో 5వ స్థానంలో బ్యాటింగ్ కి దిగిన ధోని.. ఆశించినంత స్థాయిలో వేగంగా ఆడలేకపోయినప్పటికీ.. ఉన్నంతసేపు తన అభిమానులను అలరించేలా భారీ షాట్లు ఆడాడు. కానీ ధోని మునుపటిలా ఆడలేక పోతున్నాడు అనేది వాస్తవం.
దీన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఓ 43 ఏళ్ల వ్యక్తి 18 ఏళ్ల కుర్రాడిలా మారి బ్యాటింగ్ చేయాలనుకోవడం కూడా అత్యాశే. అయితే ఇలాంటి వాళ్ళు రిటైర్మెంట్ ఇవ్వడం బెటర్ అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. కానీ టీమిండియా విజయంలో ధోని ఇది ఎప్పుడో చేశాడు. యువ ఆటగాళ్లు జట్టులోకి వస్తున్న సమయంలో అతడు జట్టు నుండి తప్పుకున్నాడు. కానీ చెన్నై సూపర్ కింగ్స్ విషయంలో అలా చేయలేకపోతున్నాడు.
ఎందుకంటే సీఎస్కే ఒక బ్రాండ్ లా మారడానికి ఏకైక కారణం ధోని. వాస్తవానికి ధోని అంటే సీఎస్కే, సీఎస్కే అంటే ధోని. వందలో 90 శాతం మంది ధోని ఇంకా ఆడాలని కోరుకునే వాళ్లే ఉన్నారు. వారి కోసమే తన మోకాలికి గాయం అయినప్పటికీ.. ఆ కాలికి పట్టి ధరించి మరి ఆడుతున్నాడు. పంజాబ్ తో మ్యాచ్ కి ముందు తన మోకాలికి పట్టి ధరిస్తున్న ధోని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన ధోని అభిమానులు.. తమకోసం ఎంతగానో కష్టపడుతున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
He is not fit but still playing for his fans. 🫶🥺♥️ pic.twitter.com/H1dAaF8ySU
— mufaddla parody (@mufaddl_parody) April 8, 2025