MS Dhoni: భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ తనదైన ఆటతోపాటు, తనదైన శైలితో క్రికెట్ ప్రపంచంలో చెరగని ముద్ర వేశాడు. నేటికీ ధోనీ స్వాగ్, అతడి హెయిర్ స్టైల్ అభిమానులకు ఎంతగానో నచ్చుతాయి. తన కెరీర్ ఆరంభం నుండే ధోనీ తన హెయిర్ స్టైల్ తో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాడు. కెరీర్ ఆరంభంలో తన జులపాల జుట్టుతో పాకిస్తాన్ అధ్యక్షుడు ముషారఫ్ ని కూడా ధోని ఆకట్టుకున్నాడు.
Also Read: Ind Vs Eng 5th Test: నేడు కీలక మ్యాచ్.. టీమ్ ఇండియాలో మార్పులివేనా… ఇక ఇంగ్లాండ్ కు చుక్కలే ?
అప్పట్లో ఈ జులపాల జుట్టుకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ధోనీని చూసి చాలామంది అభిమానులు అతడిలా జులపాలు పెంచుకున్నారు. ఆ తరువాత పొట్టి జుట్టుకు మారిపోయాడు. 2011 వన్డే ప్రపంచ కప్ తర్వాత జలపాల జుట్టును తీసేసిన ధోని.. ట్రెండ్ కి అనుగుణంగా తన హెయిర్ స్టైల్ ని మార్చుతున్నాడు. గత ఐపీఎల్ లో మళ్ళీ లాంగ్ హెయిర్ కి మారాడు. అయితే తాజాగా మరో కొత్త హెయిర్ స్టైల్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాడు మహేంద్రసింగ్ ధోని.
మరోసారి స్టన్నింగ్ లుక్ తో ఆకట్టుకున్నాడు. బాలీవుడ్ హీరోలను తలపించేలా ఉన్న ధోని న్యూ లుక్ కి ప్రస్తుతం నెటిజెన్లు, అభిమానులు ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా యాడ్ షూట్స్ కోసం ప్రత్యేకమైన హెయిర్ స్టైల్స్ లో కనిపిస్తున్నాడు. షార్ట్ హెయిర్, స్టైలిష్ గడ్డంతో బ్లాక్ టీ షర్ట్, గాగుల్స్ తో తలుక్కుమన్నాడు. అయితే ధోని న్యూ లుక్ ఏదో యాడ్ షూటింగ్ సందర్భంగా తీసిన ఫోటోలలా కనిపిస్తోంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో.. అదిరింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.
సెలబ్రిటీ హెయిర్ స్టైలిష్ అలీమ్ హకీం సహాయంతో ఈ కొత్త హెయిర్ స్టైల్ కి మారాడు ధోని. ఈ కొత్త హెయిర్ స్టైల్ కారణంగా 44 ఏళ్ల ధోని.. పాతికేళ్ల కుర్రాడిలా మారిపోయాడు. ఈ కొత్త హెయిర్ స్టైల్ తో ఉన్న ధోనీని చూసి అతడి అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఇక ఎప్పటికప్పుడు ధోని హెయిర్ కట్ ఫోటోలు బయటకు వస్తూనే ఉంటాయి. ఇలా ధోని హెయిర్ స్టైల్ ని అతడి అభిమానులు ఫాలో అవుతూనే ఉంటారు. మరి ఈ న్యూ లుక్ ని ఎంతమంది ఫాలో అవుతారు వేచి చూడాలి.
Also Read: Windies vs Australia T20 series: విండీస్ కోట బద్దలు కొట్టిన కంగారులు.. మొత్తం ఐదుకు ఐదు
ఇక మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్ కి దూరమై ఐదేళ్లు పూర్తవుతున్నప్పటికీ.. అతడి క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం కేవలం ఐపిఎల్ లో మాత్రమే ఆడుతున్న ధోని.. పలు వ్యాపార ప్రకటనల ద్వారా ఏడాదికి సుమారు 100 కోట్లకు పైగానే ఆర్జిస్తున్నాడు. అలాగే వాణిజ్య ప్రకటనలు, ఐపీఎల్ లేని సమయంలో తన 40 ఎకరాల ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తున్నాడు. దిగువ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ధోని ఎన్ని కోట్లు సంపాదించినా.. సాధారణంగా జీవించడానికి ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే ధోని అంటే చాలామందికి ఎంతగానో ఇష్టం.