Ind Vs Eng 5th Test: ఇంగ్లాండ్ తో నాలుగో టెస్ట్ ని డ్రా గా ముగించిన భారత జట్టు.. ఇప్పుడు మరో కీలక పోరుకు సిద్ధమైంది. 4వ టెస్టులో అసాధారణ పోరాటంతో ఓడిపోయే మ్యాచ్ ని కాపాడుకున్న భారత జట్టు.. నేడు లండన్ లోని ఓవల్ లో మధ్యాహ్నం 3:30 గంటలకు 5వ మ్యాచ్ లో ఇంగ్లాండ్ తో తాడోపేడో తేల్చుకోబోతోంది. ఈ సిరీస్ లో ప్రస్తుతం ఇంగ్లాండ్ 2 – 1 తో ఆదిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ని సమం చేయాలని టీమ్ ఇండియా పట్టుదలతో ఉంది.
Also Read: ICC Rankings : టీమిండియా ఆటగాళ్ల రికార్డు.. బ్యాటింగ్, బౌలింగ్ లో నెంబర్ వన్..!
అయితే ఈ మ్యాచ్ కి కీలక ఆటగాళ్లు దూరం కావడంతో ఇంగ్లాండ్ కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మరోవైపు భారత జట్టును కూడా గాయాల బెడద వెంటాడుతుంది. ఇప్పటికే ఆఖరి టెస్ట్ కి స్టార్ వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ దూరం కాగా.. ప్రధాన ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఫిట్నెస్ పై అనుమానాలు నెలకొన్నాయి. నాలుగవ టెస్ట్ లో బుమ్రా పూర్తి ఫిట్నెస్ గా కనిపించలేదు. అంతేకాకుండా ఎక్కువ వేగంతో కూడా బౌలింగ్ చేయలేకపోయాడు.
అలాగే 100కు పైగా పరుగులు సమర్పించుకొని కేవలం రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. దీంతో చివరి టెస్ట్ లో బుమ్రా ఆడతాడా..? లేదా..? అనే అనుమానాలు నెలకొన్నాయి. మరోవైపు గాయం కారణంగా నాలుగవ టెస్ట్ కి దూరమైన పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ ఫిట్నెస్ పై కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు. దీంతో చివరి టేస్ట్ లో టీమిండియా మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇక పంత్ స్థానంలో దృవ్ జురెల్ తుది జట్టులోకి రావడం దాదాపు ఖాయం. మొదట పంత్ కి ప్రత్యామ్నాయంగా తమిళనాడు వికెట్ కీపర్ జగదీషణ్ నారాయణ్ ని సెలక్టర్లు ఎంపిక చేసినప్పటికీ.. అనుభవం దృశ్యా దృవ్ జురెల్ వైపు మేనేజ్మెంట్ ఆసక్తి చూపించే అవకాశం ఉంది. వీరితోపాటు నాలుగవ టెస్ట్ లో విఫలమైన ఆల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్ పై కూడా వేటుపడే అవకాశం ఉంది. అతడి స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ జట్టులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: Ind vs Eng 5th test : ఇంగ్లాండ్ కి షాక్.. ఓవల్ టెస్ట్ నుంచి తప్పుకున్న కెప్టెన్ స్టోక్స్..!
వాస్తవానికి ఈ సిరీస్ లో భారత్ చాలావరకు ఆధిపత్యం ప్రదర్శించింది. కానీ కీలక సమయాల్లో చేతులెత్తేసింది. ఈ క్రమంలో చివరి టెస్ట్ లో రాణించి.. సిరీస్ ని విజయంతో ముగించాలని పట్టుదలతో ఉంది. ఇక గత రెండు మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన బెన్ స్టోక్స్.. గాయం కారణంగా చివరి టెస్ట్ కి దూరమయ్యాడు. అలాగే పని భారం దృశ్య ఆర్చర్ కూడా లేడు. అలాగే బ్రైడెన్ కార్స్, స్పిన్నర్ డాసన్ ని సైతం తప్పించారు. దీంతో ఏకంగా నాలుగు మార్పులతో ఇంగ్లాండ్ జట్టు బరిలోకి దిగబోతోంది.