Big Stories

Mumbai Indians: ముంబైకి.. మూడిందా?

mumbai indians team news

- Advertisement -

Mumbai Indians vs Rajasthan Royals(Latest sports news telugu): ముంబై ఇండియన్స్ జట్టుకేమైంది? అసలేమైంది? పట్టుమని 4 ఓవర్లు కాకుండానే 4 వికెట్లా? 21 బంతుల్లో చేసినవి కేవలం 20 పరుగులేనా? బాల్ కి ఒక పరుగు చేశారా? అందులో రోహిత్ శర్మతో సహా ముగ్గురు తొలి బంతికే డకౌట్.. ఏమిటీ వైపరీత్యం.. అని మ్యాచ్ చూస్తున్నవారందరూ షాక్ .

- Advertisement -

125 పరుగులైనా చేశారంటే గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే 20 పరుగులకే 4 వికెట్ల దశ నుంచి నెమ్మదిగా హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ కలిసి అలా ముందుకి నడిపించారు. సొంత గ్రౌండ్ మీద ఇరగదీస్తారనుకుంటే.. ఖాతా కూడా తెరవకుండా అయిపోయింది. ఇంకా గెలుపు ఖాతా తెరవని ఏకైక జట్టుగా మిగిలిపోయింది.

హార్దిక్ పాండ్యాకు వాంఖేడి స్టేడియంలో కూడా నిరనస తప్పలేదు. రోహిత్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో ఆగ్రహంగా ఉన్న అభిమానులు గత రెండు మ్యాచ్ ల తరహాలోనే ఈసారి కూడా ఆటాడుకున్నారు. టాస్ కు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా అంతరాయం కలిగించారు. చివరకు వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మర్యాద పాటించండి అని చెప్పినా జనం పట్టించుకోలేదు.

Also Read: ఆరు నెలల తర్వాత.. ‘బంగారు’ కొండ ఎత్తేసింది..!

ఇదే తీరు కొనసాగితే రాబోయే మ్యాచ్ ల్లో జట్టుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జట్టుపై కూడా హార్దిక్ పాండ్యా అనుచితంగా మాట్లాడటం టీమ్ పై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అది లైవ్ లో ప్రత్యక్షంగా కనిపిస్తోంది. ఒక బాల్ సరిగా పట్టుకోకపోయినా ఇలాక్కాదు, అలా పట్టుకోవాలి, ఇలాక్కాదు, అలా విసరాలి అని సీరియస్ అవుతున్నాడు.

నిజమే ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు ఇంటా బయటా కూడా ఒత్తిడితో నలిగిపోతున్నాడు. క్రికెటర్ కి మానసిక ఒత్తిడి ఉండకూడదు. బయట అభిమానుల నుంచి అది తీవ్ర స్థాయిలో ఉంది. దాంతో ఆటపై కాన్ సంట్రేషన్ చేయలేకపోతున్నాడు. బహుశా అది రోహిత్ శర్మపై కూడా పడినట్టుంది. దాంతో మనోడు మొదటి బాల్ కే డకౌట్ అయి వచ్చేశాడు.

మొత్తానికి ముంబై ఫ్రాంచైజీ చేసిన తెలివి తక్కువ పనికి ఇప్పుడు జట్టు భారీ మూల్యం చెల్లించుకుంటోంది.  ప్రస్తుతం హార్దిక్ చేతికి మళ్లీ గాయమైంది. కట్టుతో బౌలింగ్ కూడా చేయలేదు. ముఖ్యంగా ఓపెనింగ్ బౌలింగ్ ని బుమ్రా చేస్తుంటాడు. తనని పాండ్యా పక్కన పెట్టాడు. అంటే తన అవసరం లేదన్నట్టుగానే భావిస్తున్నాడు.

రోహిత్ శర్మని కూడా ఫీల్డింగ్ సెట్టింగులో లోకల్ ప్లేయర్ లా ట్రీట్ చేస్తున్నాడు. ఎంత గొప్ప ఆటగాడైనా వ్యక్తిత్వం సరిగా లేకపోతే, వాళ్లు రాణించలేరని చెబుతున్నారు. ఇవన్నీ లీడర్ షిప్ క్వాలిటీలు కావని, హార్దిక్ లో లేవని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News