E-Paper
Advertisement

IPL : సూర్య సూపర్ సెంచరీ.. రషీద్ ఖాన్ మెరుపులు వృథా.. ముంబై విజయం..

IPL : సూర్య సూపర్ సెంచరీ.. రషీద్ ఖాన్ మెరుపులు వృథా.. ముంబై విజయం..
Advertisement

IPL : సూర్య కుమార్ యాదవ్ ఐపీఎల్ లో తన జోరును కొనసాగిస్తున్నాడు. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అద్భుత సెంచరీతో అదరగొట్టాడు. దీంతో గుజరాత్ పై ముంబై 27 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 5 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. సూర్యకుమార్ ( 103, 49 బంతుల్లో 11 ఫోర్లు, 6 సిక్సులు), ఇషాన్ కిషన్ (31), రోహిత్ (29), విష్ణు వినోద్ (30) మెరుపులు మెరిపించడంతో ముంబై స్కోర్ రెండు వందలు దాటింది. రషీద్ ఖాన్ మినహా గుజరాత్ బౌలర్లు అందరూ తేలిపోయారు. అద్భుతంగా బౌలింగ్ చేసిన రషీద్ 4 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

219 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ ఆదిలోనే తడబడింది. వృద్ధిమాన్ సాహా (2), గిల్ (6), హార్ధిక్ పాండ్యా (4) దారుణంగా విఫలమయ్యారు. దీంతో 26 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత విజయ్ శంకర్ (29), డేవిడ్ మిల్లర్ (41) కాసేపు నిలబడ్డారు. అభినవ్ మనోహర్ (2) , విజయ్ శంకర్ వెంటవెంటనే అవుట్ కావడంతో 55 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. మిల్లర్ , రాహుల్ తెవాటియా (14) జట్టు స్కోర్ 100 పరుగులు వద్ద అవుట్ అయ్యారు. ఈ దశలో గుజరాత్ స్కోర్ 120 దాటడం కూడా కష్టమే అనిపించింది.

Advertisement

అనూహ్యంగా రషీద్ ఖాన్ (79, 32 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సులు) రెచ్చిపోయాడు. జోసెఫ్ తో కలిసి 9 వికెట్ కు 40 బంతుల్లో 88 పరుగులు జోడించాడు. దీంతో గుజరాత్ 20 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది.

ముంబై బౌలర్లలో ఆకాష్ మద్వాల్ 3 వికెట్లు, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ రెండేసి వికెట్లు, బెరెన్ డార్ఫ్ ఒక వికెట్ తీశారు. అద్భుతంగా సెంచరీ బాదిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

పాకిస్తాన్ జ‌ట్టును చావుదెబ్బ కొడ‌తాం..దీప్తి శర్మ హెచ్చ‌రిక‌

పాకిస్తాన్ జోలికి వ‌స్తే, ప‌ళ్లు రాల‌గొడ‌తా.. ఇర్ఫాన్ ప‌ఠాన్ కు వ‌సీం హెచ్చ‌రిక‌

ప్యాంట్లు మార్చినంత ఈజీగా పాకిస్తాన్‌ కోచ్ ల‌ను మార్చుతున్నారు !

ఛీ తూ..అస‌లు నీది బ‌తుకేనా ? ఇంగ్లండ్ దెబ్బ‌కు ఇమామ్ ప్యాంట్ త‌డిపేసుకున్నాడు

టీమిండియాలో లెస్బియన్ జంట..లైవ్ మ్యాచ్ లో రొమాన్స్?

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

Big Stories

Advertisement
×