E-Paper
Advertisement

స్పిన్న‌ర్లు అంటే ఫ్యాంట్లు త‌డుపుకుంటున్నాడు..అలాంటి తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ అవ‌స‌ర‌మా?

స్పిన్న‌ర్లు అంటే ఫ్యాంట్లు త‌డుపుకుంటున్నాడు..అలాంటి తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ అవ‌స‌ర‌మా?
Advertisement

Mohammad Kaif:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో తిలక్ వర్మపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అతడిని టెస్ట్ ప్లేయర్ అంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఐర్లాండ్ సిరీస్ నుంచి మొదలుకొని ఇప్పటివరకు తిలక్ వర్మ బ్యాట్ నుంచి పరుగులు రాలేదు. అంతేకాదు ఎక్కువ బంతులు ఎదుర్కొని… తక్కువ పరుగులు చేసిన సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో టి20 లకు తిలక్ వర్మ పనికిరాడని.. అలాంటి వాడిని వైస్ కెప్టెన్ ఎలా చేశారని నిలదీస్తున్నారు ఫ్యాన్స్. మాజీ క్రికెటర్లు సైతం… తిలక్ వర్మాను (Tilak Varma) తీసేసి, సంజు శాంసన్ ను తీసుకోండని డిమాండ్లు చేస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా మాజీ ఆట‌గాడు మహమ్మద్ కైఫ్ (Mohammad Kaif ) కూడా తన స్టైల్ లో స్పందించారు. స్పిన్నర్లను ఎదుర్కోలేని తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ అవసరమా..? ఆ ఒక్క పదవి ఉండటంతో టీమిండియాలో తిష్ట వేశాడని మండిపడ్డారు. తిలక్ వర్మాను తొలగించి.. రజత్ పాటిదార్ లాంటి మ్యాచ్ విన్నర్ ను తీసుకోవాలని డిమాండ్ చేశారు మహమ్మద్ కైఫ్. లేకపోతే టీమిండియా గెలవడం కష్టమేనని బాంబు పేల్చారు.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

స్పిన్న‌ర్ల‌ను ఎదుర్కొలేని తిల‌క్ వ‌ర్మ‌కు వైస్ కెప్టెన్సీ అవ‌స‌ర‌మా?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య టి20 సిరీస్ కొనసాగుతున్న నేపథ్యంలో తిలక్ వర్మ వరుసగా అన్ని మ్యాచ్ లలో విఫలమవుతున్నాడు. ఐర్లాండ్తో జరిగిన రెండు మ్యాచ్ లలో 74 పరుగులు సాధించిన తిలక్… ఇంగ్లాండ్ 51 పరుగులు మాత్రమే చేశాడు. ఏ ఒక్క మ్యాచ్ లో కూడా జట్టును గెలిపించేలా ఆడలేదు. దీంతో తిలక్ వర్మను తొలగించండి అంటూ డిమాండ్లు విపరీతంగా వస్తున్నాయి. అయితే దీనిపై మొహమ్మద్ చాలా సీరియస్ అయ్యారు. స్పిన్నర్లు వస్తే తిలక్ వర్మ భయపడిపోతున్నాడని హేళన చేశారు. స్పిన్నర్లను ఎదుర్కోవడం రాకపోతే నీకు వైస్ కెప్టెన్సీ ఎందుకు అంటూ నిలదీశారు.

స్పిన్నర్ల బౌలింగ్ లో తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ అత్యంత ఘోరంగా ఉందని పరువు తీశారు. అంతర్జాతీయ క్రికెట్ లో రాణించాలంటే ఈ లోపాన్ని కచ్చితంగా సరిదిద్దుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. ఫేస్ బౌలింగ్ వస్తేనే మనోడు సింహంలా రెచ్చిపోతాడని చురకలు అంటించారు. టీమిండియాలో ఆడే ప్రతి ప్లేయర్, అందరి బౌలింగ్ లో రెచ్చిపోయి ఆడాలని స్పష్టం చేశారు. వైస్ కెప్టెన్సీ పదవి తిలక్ వర్మ దగ్గర ఉంది కాబట్టి అతడు బతికి పోతున్నాడని.. లేకపోతే ఎప్పుడూ బయటకు పంపించేవారన్నారు. ఇప్పటికైనా అతని పక్కకు పెట్టి మరో క్రికెటర్ను తీసుకుంటే బెటర్ అన్నారు. రజత్ పాటిదార్ అలాంటి వాళ్లకు అవకాశం ఇస్తే బెటర్ అని సూచనలు చేశారు.

Advertisement

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

Related News

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు ఒక్కొక్క‌డికి 120 డిగ్రీల జ్వ‌రం వ‌చ్చింది!

వైభవ్ వయస్సు కంటే, ఎక్కువ రన్స్ చేయడం లేదు.. పరువు తీసిన మాజీ క్రికెటర్

Video: ఆర్చ‌ర్ బౌలింగ్ లో ఆడ‌టం చేత‌కావ‌డం లేదా? వైభ‌వ్ కు క్లాస్ పీకిన‌ గంభీర్

వ‌రుస ఓట‌ములు, గంభీర్ ను దించేందుకు బీసీసీఐ కిరాక్ ప్లాన్‌..ఆ రాక్ష‌సుడే వ‌స్తున్నాడు ?

ఇంగ్లాండ్ చేతిలో ఓట‌మి, ఒలింపిక్స్ నుంచి టీమిండియా ఔట్? రంగంలోకి పాకిస్తాన్‌

టీమిండియాను చూస్తే జాలేస్తోంది..సిక్స‌ర్లు కాదు సింగిల్ తీయ‌డానికి కూడా ముప్ప‌తిప్ప‌లు ప‌డుతున్నారు

ఈ ఇద్ద‌రు బీహారీలే టీమిండియాను నాశ‌నం చేస్తున్నారు

Big Stories

Advertisement
×