Virender Sehwag: టీమిండియా మాజీ క్రికెటర్, డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్ గ్రౌండ్ లోకి దిగాడు అంటే… ప్రత్యర్థి బౌలర్లు గజగజ వణికి పోవాల్సిందే. అయితే అలాంటి డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పర్సనల్ లైఫ్ ఏ మాత్రం బాగాలేదు. భార్యకు దూరంగా ఉంటున్న వీరేంద్ర సెహ్వాగ్, సింగిల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. తన తల్లి దగ్గరే ఉంటూ… లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అయితే అలాంటి వీరేంద్ర సెహ్వాగ్ గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. దేవర సినిమాలో JR. ఎన్టీఆర్ భార్యగా చేసిన శృతి మరాఠేతో (shruti marathe) వీరేంద్ర సెహ్వాగ్ రిలేషన్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు బికినీలో శృతి మరాఠే ఉండగా, ఆమెను హగ్ చేసుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీంతో తన భార్య ఆర్తీని కాదని, ఎన్టీఆర్ హీరోయిన్ శృతి మరాఠే (shruti marathe)తో సంబంధం పెట్టుకున్నాడని చర్చ మొదలైంది. అందుకే ఆర్తీకి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు వైరల్ అవుతున్నాయి.
వీరేంద్ర సెహ్వాగ్, శృతి మరాఠే (shruti marathe)తో చాలా రొమాంటిక్ గా దిగిన ఫోటోలు వాస్తవం కాదు. ఇవి ఓ వెబ్ సిరీస్ లో మార్ఫింగ్ చేసి వాడుకున్న ఫోటోలు. ప్రీతం అండ్ పెడ్రో అనే వెబ్ సిరీస్ ఇటీవల హాట్ స్టార్ లో రిలీజ్ అయింది. ఇది సైబర్ క్రైమ్ నేపథ్యంలో వచ్చింది. రాజ్ కుమార్ హిరానీ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. గోవా పరిసర ప్రాంతాల్లో ఈ సిరీస్ తీశారు. అయితే ఈ మూవీలో గోవా క్రీడా మంత్రి భార్యగా శృతి మరాఠే ప్రత్యేక పాత్రలో నటించారు. అయితే ఇందులో శృతి కొడుకును ఆమె మాజీ ప్రియుడు కిడ్నాప్ చేస్తాడు. ఈ క్రమంలోనే శృతి మరాఠేతో చాలా క్లోజ్ గా దిగిన ఫోటోలను చూపించి డబ్బుల కోసం బెదిరిస్తాడు. అయితే, ఆ ఫోటోలను మళ్లీ మార్ఫింగ్ చేసి వీరేంద్ర సెహ్వాగ్ ఫేస్ పెడతారు. సినిమా కథ ప్రకారం వీరేంద్ర సెహ్వాగ్ ముఖం పెట్టడంతో శృతి మరాఠే బండారం బయట పడకుండా ఉంటుంది. దీంతో అక్కడ ఫన్ సన్నివేశం చోటు చేసుకుంటుంది. అంతేకానీ వీరేంద్ర సెహ్వాగ్, శృతి మరాఠే (shruti marathe) మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఓ వెబ్ సిరీస్ కోసం వాళ్ళ ఫోటోలను వాడుకున్నారు.
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తన భార్య ఆర్తికి విడాకులు ఇచ్చేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. బిసిసిఐ పాలకమండలిలో కీలక పదవిలో ఉన్న వ్యక్తితో ఆర్తి రిలేషన్ పెట్టుకున్నారట. ఈ క్రమంలోనే ఆమెకు దూరంగా ఉంటున్నాడట వీరేంద్ర సెహ్వాగ్. ఈ క్రమంలోనే తన భార్యను వదిలి తల్లి దగ్గరే ఉంటున్నాడు. అయితే విడాకులపై మాత్రం ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. కాగా వీరేంద్ర సెహ్వాగ్ కు ఇద్దరు కొడుకులు ఉన్నారు.
Virender Sehwag has finaly moved on from Aarti Sehwag now 🔥 pic.twitter.com/mTCy8ZgUt1
— Venky Mama (@venkymama100) July 8, 2026