Tanveer Ahmed : టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ప్రస్తుతం టీ20 సిరీస్ జరుగుతోంది. అయితే ఈ సిరీస్ లో చెత్త ప్రదర్శన కనబరిచిన టీమిండియా, మరో సిరీస్ కోల్పోయింది. మొన్న ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో కూడా 3-0 తేడాతో సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో టీమిండియా ప్రదర్శన పై దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. మన టీమిండియా మాజీ క్రికెటర్లతో పాటు… విదేశీయులు కూడా రెచ్చిపోయి కామెంట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ కూడా నోరు చేరాడు. ఇంగ్లాండ్ బౌలర్ల దెబ్బకు టీమిండియా బ్యాటర్లకు 120 డిగ్రీల జ్వరం వచ్చిందని హేళన చేశారు. ఇంగ్లాండ్ గడ్డపై ఒక్కో బంతి ఆడేందుకు… టీమిండియా క్రికెటర్లు మూడు చెరువుల నీళ్లు తాగుతున్నారని చురకలు అంటించారు. అందుకే వరుసగా మూడు టి20 లో ఓడిపోయారని సెటైర్లు పేల్చారు.
ఇంగ్లాండ్ చేతిలో వరుసగా 3 టీ20 లు ఓడిపోయిన టీమ్ ఇండియాపై మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ దారుణమైన కామెంట్స్ చేశారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో ఆడిన టీమిండియా ప్లేయర్లు… ఇంగ్లాండ్ గడ్డపై ఆడేందుకు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఇక్కడ మైదానాలలో ఇంగ్లీష్ బౌలర్స్ వేసే స్పీడుకు, టీమిండియా ఆటగాళ్లు గజగజ వణికిపోతున్నారని సెటైర్లు గెలిచారు. వాళ్లు వేసే బంతులకు.. టీమిండియా క్రికెటర్లకు జ్వరమే వస్తుందని పరువు తీశారు. హైవే లాంటి మైదానాలలో అలవాటు చేసుకున్న టీమిండియా క్రికెటర్లు… ఇక్కడ తేలిపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా ప్లేయర్ల కోసం ఇంగ్లాండులో కూడా హైవే లాంటి మైదానాలు సిద్ధం చేయాలని ఎద్దేవా చేశారు. లేదా బౌండరీ గేట్లు చిన్నగా… 30 మీటర్లు ఉండేలా చూడాలని ఐసీసీకి రిక్వెస్ట్ కూడా పెట్టారు. అప్పుడే టీమిండియా ప్లేయర్లు అద్భుతంగా విదేశీ గడ్డలపై కూడా హేళన చేశారు తన్వీర్ అహ్మద్.