EPAPER

Duleep Trophy: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్‌కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు

Duleep Trophy: దులీప్ ట్రోఫీ.. రెండో రౌండ్‌కు టీమ్స్ ఎంపిక.. జట్టులోకి తెలుగు కుర్రాడు

Duleep Trophy Round 2 Squard Announced: దులీప్ ట్రోఫీలో రెండో రౌండ్ మ్యాచ్‌లు ఈ నెల 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌ల కోసం బీసీసీఐ టీమ్స్ ప్రకటించింది. బంగ్లాదేశ్‌తో ఈ నెల 19న మొదలుకానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌కు ఎంపికైన ఇండియా ఎ కెప్టెన్ శుభమన్ గిల్, కేఎల్ రాహుల్, యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, కుల్ దీప్ యాదవ్, ఆకాశ్ దీప్ తదితరులు దులీప్ ట్రోఫీ తర్వాత రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండరు.


అలాగే ఇండియా బి టీమ్‌కి ప్రాతినిధ్యం వహిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ రెండో రౌండ్ మ్యాచ్ ఆడి అనంతరం టీమిండియాతో కలుస్తాడు. ఇండియా ఎ కెప్టెన్‌గా గిల్ స్థానంలో మయాంక్ అగర్వాల్ ను నియమించగా.. ఇండియా బి టీమ్ లోకి రింకు సింగ్, సుయాశ్ ప్రభ్ దేశాయ్‌లను ఎంపిక చేశారు. ఇక ఇండియా సిలో ఎలాంటి మార్పులు చేయలేదు. కుడి చేతి బొటనవేలు గాయం నుంచి కోలుకుంటున్న సూర్యకుమార్ యాదవ్ రెండో రౌండ్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడం లేదు.

ఇదిలా ఉండగా, ఆంధ్ర యంగ్ క్రికెటర్ షేక్ రషీద్ ఇండియా ఎ జట్టులోకి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్ తో టెస్ట్ సిరీస్ కు ఎంపికైన ధ్రువ్ జురెల్ స్థానంలో అతడిని బీసీసీఐ ఎంపిక చేసింది. గురువారం అనంతపురంలో ఇండియా డి జట్టుతో జరగనున్న మ్యాచ్‌లో రషీద్ బరిలోకి దిగనున్నారు. కాగా, గతంలో ఇండియా అండర్ 19 జట్టుకు కూడా రషీద్ ప్రాతినిధ్యం వహించారు. అలాగే ఐసీఎల్ లో సీఎస్‌కు తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే.


Also Read: వీరిద్దరి మధ్యా ఏదో ఉందా? నీరజ్ ని మెచ్చుకున్న మను

ఇండియా-ఎ జట్టు:
మయాంక్ అగర్వాల్(కెప్టెన్), రియాన్ పరాగ్, తిలక్ వర్మ, శివమ్ దూబె, తనుష్ కొటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, ఖలీల్ అహ్మద్, అవేశ్ ఖాన్, కుమార్ కుశాగ్రా, శాశ్వత్ రావత్, ప్రథమ్ సింగ్, అక్షయ్ వాడ్కర్, ఎస్ కె రషీద్, శామ్స్ ములానీ, ఆకిబ్ ఖాన్.

ఇండియా-బి జట్టు:
అభిమన్యు ఈశ్వరన్(కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, ముషీర్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ, ముకేశ్ కుమార్, రాహుల్ చాహర్, సాయి కిషోర్, మోహిత్ అవస్తీ, జగదీష్ నారాయన్, సుయాశ్ ప్రభు దేశాయ్, రింకు సింగ్, హిమాన్షఉ మంత్రి.

ఇండియా-సి జట్టు:
రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), సాయి సుదర్శన్, రజత్ పటీదార్, హిమాన్షు చౌహాన్, హృతిక్ షోకిన్, అభిషేక్ పొరెల్, బాబా ఇంద్రజిత్, ఆర్యన్ జుయల్, మానవ్ సుతార్, విజయ్ కుమార్ వైశాఖ్, అన్షుల్ కాబోజ, మయాంక్ మార్కండే, సందీప్ వారియర్, గౌరవ్ యాదవ్.

ఇండియా-డి జట్టు:
శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), అథర్వ తైడే, యశ్ దూబె, పడిక్కల్, రికీ భుయ్, శరాంశ్ జైన్, అర్ష్ దీప్, ఆదిత్య ఠాక్రే, హర్షిత్ రాణా, ఆకాశ్ సేన్ గుప్తా, కేఎస్ భరత్, సౌరభ్, సంజు శాంసన్, నిశాంత్ సంధు, విద్వత్ కావేరప్ప.

Related News

Brs Harish Rao : తెలంగాణపై ఎందుకంత వివక్ష ? రాష్ట్రానికి నిధులు తీసుకురావడంలో బీజేపీ నేతలు విఫలం

lychee seeds: లిచీ పండ్ల కన్నా వాటిలో ఉన్న విత్తనాలే ఆరోగ్యకరమైనవి, వాటితో ఎన్నో సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు

Tehsildars transfer: తహసీల్దార్ బదిలీలకు గ్రీన్ సిగ్నల్.. సీసీఎల్ఏ ఆదేశాలు జారీ

Omar Abdullah: నేషనల్ కాన్ఫరెన్స్‌ వినాశానికి యత్నాలు.. జమ్మూ సీఎంగా ఒమర్‌ అబ్దుల్లానే!

Pithapuram Crime: 16 ఏళ్ల బాలికపై అత్యాచారం.. స్పందించిన పవన్‌ కల్యాణ్‌

KCR: గజ్వేల్ పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీకాంత్.. కేసీఆర్ నిజంగానే కనబడుటలేదా?

KTR on Hydra: హైడ్రాకు కేటీఆర్ కౌంటర్.. ఇంత పెద్ద లాజిక్ ఎలా మిస్సయ్యారో..

Big Stories

×