Nasser Hussain On Virat Kohli : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే దాదాపు 40 మ్యాచ్ లు ఫినిష్ అయ్యాయి. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ( Delhi Capitals vs Royal Challengers Bengaluru) జట్ల మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ ( Virat Kohli) అత్యున్నత రికార్డు సాధించాడు. 19 సంవత్సరాల ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంటులో 9 వేల పరుగులు సాధించిన క్రికెటర్ గా హిస్టరీ సృష్టించాడు. అయితే విరాట్ కోహ్లీ 9 వేల పరుగులు చేసిన నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు నాసర్ హుస్సేన్ ( Nasser Hussain ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇన్నివేల పరుగులు చేసి ఏం లాభం… తన కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఒక్క టైటిల్ కూడా విరాట్ కోహ్లీ అందించలేకపోయాడని విమర్శలు చేశారు. తన స్వార్థం కోసం మాత్రమే ఐపీఎల్ ఆడుతున్నాడని నాసర్ హుస్సేన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అతనిపై విరాట్ కోహ్లీ అభిమానులు తమ స్థాయిలో స్పందిస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ 2008లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు 19 సంవత్సరాల లో విరాట్ కోహ్లీ 9 వేలకు పైగా పరుగులు సాధించాడు. 275 మ్యాచ్ లలో ప్రతినిత్యం వహించిన విరాట్ కోహ్లీ ఎనిమిది సెంచరీలు అలాగే 66 అర్థ సెంచరీలు నమోదు చేసుకున్నాడు. 40 యావరేజ్ తో బ్యాటింగ్ ఇరగదీశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 133 మాత్రమే ఉంది. ఓవరాల్ గా 9 వేలకు పైగా పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ.
విరాట్ కోహ్లీ 9000 పరుగులు సాధించిన నేపథ్యంలో నాసర్ హుస్సేన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విరాట్ కోహ్లీ ఇన్ని వేలకు పైగా పరుగులు సాధించినప్పటికీ ఏం లాభం లేదని మండిపడ్డారు. తన కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ఒక్కసారైనా టైటిల్ తీసుకురావడంలో విఫలమయ్యాడని మండిపడ్డారు నాసర్ హుస్సేన్. ఈ తొమ్మిది వేల పరుగులు కూడా టెస్ట్ ప్లేయర్ లాగా ఆడి సాధించాడని ఫైర్ అయ్యారు. అతడు చేసిన పరుగులన్నీ వృధా నేనంటూ ట్రోల్ చేశారు. అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ క్రమక్రమంగా తన బ్రాండ్ పెంచుకుంటుందని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ కంటే PSL మెరుగ్గా ఉందని వ్యాఖ్యానించారు నాసర్ హుస్సేన్. దీంతో నాసర్ హుస్సేన్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. విరాట్ కోహ్లీ అభిమానులు రంగంలోకి దిగి, నాసర్ హుస్సేన్ ను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు.
https://www.facebook.com/photo/?fbid=989716367302439&set=a.808612632079481