E-Paper
Advertisement

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు
Advertisement

Irfan Pathan Recalls Sledging Akhtar With Dhoni :  మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2007 సమయంలో టీమిండియా కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్న మహేంద్రసింగ్ ధోని.. అంచనాలకు మించి ప్రతిభ కనబరిచాడు. ప్రస్తుత టీమిండియా ఉన్నత స్థాయిలో ఉండడానికి కారణం మహేంద్రసింగ్ ధోని వేసిన పునాదులే అని చెప్పవచ్చు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోని గురించి ఇర్ఫాన్ పఠాన్ మరోసారి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. ధోని గురించి ఎప్పుడూ నెగిటివ్ గా మాట్లాడే ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan)… తాజాగా అతడు చేసిన మంచి పని గురించి కూడా రివీల్ చేశారు. 2006 లో పాకిస్తాన్ తో జరిగిన పైసలాబాద్ టెస్ట్ (India in Pakistan Test Series, 2006) సందర్భంగా ధోని, తాను ఇద్దరం కలిసి షోయబ్ అక్తర్ ను (Shoaib Akhtar ) బకరా చేసినట్లు గుర్తు చేశారు. దీంతో మ్యాచ్ ఓడిపోకుండా కాపాడగలిగామని వెల్లడించారు ఇర్ఫాన్ పఠాన్. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

2006 సమయంలో పాకిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (Pakistan vs India) మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరిగేవి. ఈ క్రమంలోనే పైసలాబాద్ టెస్ట్ ( Iqbal Stadium, Faisalabad) మ్యాచ్ కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరిగింది. ఇందులో యంగ్ క్రికెటర్లుగా మహేంద్ర సింగ్ ధోనితో పాటు ఇర్ఫాన్ పఠాన్ బరిలో దిగారు. ఇదే మ్యాచ్ లో మహేంద్రసింగ్ ధోని 148 పరుగులు చేయగా… ఇర్ఫాన్ పఠాన్ 90 పరుగులు చేసి టీమిండియాను కాపాడారు. అయితే ఈ మ్యాచ్ లో షోయబ్ అక్తర్ చాలా భయంకరంగా బౌలింగ్ చేశాడట. అతడిని ఎదుర్కోవడం ఇండియన్ క్రికెటర్లకు చాలా కష్టతరం అని ధోనితో పాటు ఇర్ఫాన్ పఠాన్ భావించారు.

Advertisement

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

ఈ క్రమంలోనే షోయబ్ అక్తర్ ఏకాగ్రతను దెబ్బతీసే స్కెచ్ ధోని వేశాడని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చారు. షోయబ్ అక్తర్ ఏకాగ్రతను దెబ్బతీసేందుకు స్లెడ్జింగ్ చేద్దామని ధోని తనతో వివరించినట్లు గుర్తు చేశారు. ఇక ధోని ప్లాన్ ప్రకారమే… షోయబ్ అక్తర్ ముందు ధోని పగలబడి నవ్వడం… స్లెడ్జింగ్ లాంటివి చేశాడని వివరించారు ఇర్ఫాన్ పఠాన్. ఈ క్రమంలో ఇన్ స్వింగర్లు, అవుట్ సింగర్లు వేయకుండా.. ధోని తలపైకి బౌన్సర్లను షోయబ్ అక్తర్ సంధించాడని గుర్తు చేశారు ఇర్ఫాన్ పఠాన్. ఇక ఆ బౌన్సర్లను అవలీలగా తామిద్దరం సిక్సర్లు లేదా బౌండరీలకు మలిచామని తెలిపారు. స్లెడ్జింగ్ చేయ‌కుండా ఉండింటే, షోయ‌బ్ అక్త‌ర్ మ‌రింత రెచ్చిపోయి, టీమిండియాను ఆలౌట్ చేసేవాడ‌ని వెల్ల‌డించారు. అప్ప‌ట్లోనే ధోని చూపించిన స‌మ‌య‌స్ఫూర్థి కార‌ణంగానే ఆ మ్యాచ్ ఓడిపోకుండా డ్రా చేసుకున్న‌మ‌న్నారు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

Related News

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

పాకిస్తాన్ ప‌త‌నానికి ఆకిబ్ జావేదే కార‌ణం..ఆ 7 గురు క్రికెట‌ర్ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు

PSL ర‌ద్దు అయ్యేలా బీసీసీఐ కుట్ర‌లు…విదేశీ క్రికెట‌ర్లను టార్చ‌ర్ చేసి మ‌రీ

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

Big Stories

Advertisement
×