E-Paper
Advertisement

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !
Advertisement

Jay Shah – Asia Cup 2026 : ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ (Women’s Asia Cup 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ నేపథ్యంలో ఇప్పటికే మూడు జట్లు సెమీ ఫైనల్స్ స్థానాలను ఖరారు చేసుకున్నాయి. ఇండియా, పాకిస్తాన్ తో పాటు శ్రీలంక ఇప్పటికే సెమీ ఫైనల్ లో అడుగుపెట్టాయి. బంగ్లాదేశ్ మరో మ్యాచ్ గెలిస్తే సెమీస్ లోకి దూసుకు వెళ్తుంది. ఇలాంటి క్రమంలో మొహ్సిన్ న‌ఖ్వీకి (Mohsin Naqvi) ఊహించని షాక్ తగిలినట్లు వార్తలు వస్తున్నాయి. ఆసియా కప్ 2026 టోర్నమెంట్ ఫైనల్ సందర్భంగా ఐసీసీ చైర్మన్ జై షా (Jay Shah ) ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఐసీసీ చైర్మన్ హోదాలో ఆయన హాజరవుతున్నారు. ఒకవేళ ఆయన ఫైనల్స్ కు వస్తే…ప్రోటోకాల్ ప్ర‌కారం ఆసియా కప్ ట్రోఫీ కూడా జై షా చేతుల మీదుగా గెలిచిన జట్టు అందుకుంటుంది. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఆసియా కప్ పై మ‌ళ్లీ వివాదం..న‌ఖ్వీ చేతుల మీదుగా తీసుకుంటారా ?

ఆసియా కప్ వచ్చిందంటే చాలు టీమిండియాకు టెన్షన్ మొదలవుతుంది. కష్టపడి ట్రోఫీ గెలిచినా కూడా.. చేతిలో దాకా వచ్చి దూరం పోతోంది. 2025 పురుషుల ఆసియా కప్ ఫైనల్స్ లో పాకిస్తాన్ జట్టును సూర్య కుమార్ యాదవ్ సేన చిత్తుగా ఓడించింది. ఆ టోర్నమెంట్ సందర్భంగా పాకిస్తాన్ ను మూడు సార్లు ఓడించిన టీమిండియా… టైటిల్ కూడా గెలుచుకుంది. అయితే టైటిల్ మాత్రం మొహ్సిన్ న‌ఖ్వీ చేతుల మీదుగా అందుకోవడం ఇష్టం లేక సూర్యకుమార్ యాదవ్ అక్కడి నుంచి ఇండియాకు వచ్చేసాడు.

Advertisement

PCB confiscate mobile phones of Pakistan cricketers : పాకిస్తాన్ జ‌ట్టులో పెను ప్ర‌కంప‌న‌లు…ప్లేయ‌ర్ల మొబైల్ ఫోన్లను లాగేసుకున్న PCB

అయితే ఈ టోర్నమెంట్ గడిచి ఏడాది పూర్తయిన కూడా ఏసీసీ చైర్మన్ గా ఉన్న మొహ్సిన్ న‌ఖ్వీ టైటిల్ మాత్రం ఇండియాకు పంపించలేదు. తన కార్యాలయంలోనే దాచి పెట్టేసాడు. ఎంత మంది విమర్శలు చేసి.. ట్రోలింగ్ చేసినా కూడా మొహ్సిన్ న‌ఖ్వీ తగ్గడం లేదు. ఇక ఇప్పుడు మహిళల ఆసియా కప్ సందర్భంలోనూ మొహ్సిన్ న‌ఖ్వీనే టైటిల్ ఇవ్వాల్సి ఉంది. దీంతో ఈ టోర్నమెంట్ ఆడి దండగా.. వెనక్కి వచ్చేయాలని టీమిండియా ఉమెన్స్ జట్టును కోరుతున్నారు క్రికెట్ అభిమానులు. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.

మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో మ‌ట్టి కొట్టిన బీసీసీఐ…ఆసియా క‌ప్ ఫైన‌ల్స్ కు జై షా !

Advertisement

ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో కూడా టీమిండియా ఫైనల్స్ దాకా వెళ్లి ఛాంపియన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలాంటి క్రమంలో మొహ్సిన్ న‌ఖ్వీ టైటిల్ ఇచ్చే ఛాన్స్ ఉన్న నేపథ్యంలో… బీసీసీఐ చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఐసీసీ చైర్మన్ బాధ్యతలు వహిస్తున్న జై షాను దుబాయ్ కి పంపిస్తున్నారట. అతడికి ఏసీసీ నుంచి ఆహ్వానం అందేలా చేసి… ఫైనల్స్ కు హాజరు అయ్యేలా బీసీసీఐ స్కెచ్ వేసినట్లు చెబుతున్నారు. అతని చేతుల మీదుగానే ఆసియా కప్ ఉమెన్స్ ట్రోఫీ అందించేలా ఇప్పటికే కార్యాచరణ రూపొందించిందట బీసీసీఐ. అయితే దీన్ని ఆపేందుకు మొహ్సిన్ న‌ఖ్వీ చాలా ట్రై చేశాడట. కానీ పలుకుబడి ఉన్న బీసీసీఐ ముందు అతని పాచికలు పారలేదని అంటున్నారు. ఈ క్రమంలో మొహ్సిన్ న‌ఖ్వీ నోట్లో బీసీసీఐ మట్టి కొట్టిందని ప్రచారం సాగుతోంది.

Tanveer Ahmed On IND VS PAK: అదరగొట్టిన ఇండియా, పాకిస్తాన్ మరో ఘోర ఓటమి…ఫిక్సింగ్ చేశారంటూ త‌న్వీర్ ఆరోప‌ణ‌లు

Related News

షోయ‌బ్ అక్త‌ర్ ను ధోని స్లెడ్జింగ్ చేసి, పాకిస్తాన్ కొంప‌ముంచాడు

2017లో విరాట్ కోహ్లీని చూసి ప్యాంట్ త‌డుపుకున్నా..అమీర్ సంచ‌ల‌నం !

ఒరేయ్ వాహాబ్ రియాజ్…మాకు ఆసియా క‌ప్ వ‌ద్దు రా, ద‌మ్ముంటే టీమిండియాను ఓడించండి

నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తే, ఇమ్రాన్ ఖాన్ లాగా కుక్క చావు చ‌చ్చేవాడిని

పాకిస్తాన్ ప‌త‌నానికి ఆకిబ్ జావేదే కార‌ణం..ఆ 7 గురు క్రికెట‌ర్ల జీవితాల‌తో ఆడుకుంటున్నాడు

PSL ర‌ద్దు అయ్యేలా బీసీసీఐ కుట్ర‌లు…విదేశీ క్రికెట‌ర్లను టార్చ‌ర్ చేసి మ‌రీ

పాకిస్తాన్ లో ప‌ర్య‌టించనున్న టీమిండియా..మోడీ స‌ర్కార్ గ్రీన్ సిగ్నల్ ?

Big Stories

Advertisement
×