BigTV English

National Sports Awards : అర్జున అవార్డ్ అందుకున్న షమి.. సాత్విక్‌ – చిరాగ్‌ జోడికి ఖేల్‌రత్న..

Arjuna Award : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 2023 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రధానం చేశారు. దేశంలో క్రీడలలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్న అవార్డును భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టిలకు రాష్ట్రపతి ప్రధానం చేశారు.

National Sports Awards :  అర్జున అవార్డ్ అందుకున్న షమి.. సాత్విక్‌ – చిరాగ్‌ జోడికి ఖేల్‌రత్న..

National Sports Awards : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం 2023 సంవత్సరానికి గానూ జాతీయ క్రీడా పురస్కారాల ప్రధానోత్సవం జరిగింది. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము అవార్డులు ప్రధానం చేశారు. దేశంలో క్రీడలలో ఇచ్చే అత్యున్నత పురస్కారం ఖేల్‌రత్న అవార్డును భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ జోడీ రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌- చిరాగ్‌ శెట్టిలకు రాష్ట్రపతి ప్రధానం చేశారు.


దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం అర్జున అవార్డును టీమ్ఇండియా సీనియర్‌ ఫాస్ట్ బౌలర్ షమి అందుకున్నాడు. అర్జున అవార్డును పొందడం సంతోషంగా భావిస్తున్నానని షమి పేర్కొన్నాడు. సాత్విక్‌- చిరాగ్‌ జోడీ ఆసియా క్రీడల్లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం, కామన్వెల్త్‌ క్రీడల్లో రజత పతకాలు సాధించారు.

2023 వన్డే ప్రపంచకప్‌లో షమి అద్భుతమైన ఆట తీరు ప్రదర్శించాడు. ఏడు మ్యాచ్‌ల్లో 24 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. భారత్‌ ప్రపంచకప్ ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధిక వికెట్ల తీసి రికార్డు సృష్టించాడు. షమికి ముందు శిఖర్ ధవన్(2021), రవీంద్ర జడేజా(2019), రోహిత్ శర్మ (2015), రవిచంద్రన్ అశ్విన్(2014), విరాట్ కోహ్లి(2013) సంవత్సరంలో అర్జున అవార్డులను పొందారు.


షమి రెండు అర్ధసెంచరీలు నమోదు చేశాడు. టీమిండియా తరుపున 64 టెస్ట్ లు, 23 టీ 20లు , 101 వన్డేలు ఆడి మొత్తం 448 వికెట్లు తీశాడు. రాష్ర్టపతి చేతుల మీదగా మొత్తం 26 మంది అర్జున అవార్డులను అందుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి మహ్మద్‌ హుసాముద్దీన్‌ (బాక్సింగ్‌), ఈషా సింగ్‌ (షూటింగ్‌), అజయ్‌కుమార్‌ రెడ్డి (అంధుల క్రికెట్‌)లకు ఈ అవార్డులు దక్కాయి.

Related News

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Big Stories

×