Navjot Singh Sidhu: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఫైనల్ మ్యాచ్ మే 31వ తేదీన జరగనున్న సంగతి తెలిసిందే. ఇలాంటి క్రమంలో అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియానికి ( Ahmedabad Narendra Modi Stadium) రావాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి ఐసీసీ నుంచి పిలుపు వెళ్ళింది. అటు భారత క్రికెట్ నియంత్రణ మండలి (Board of Control for Cricket in India) కూడా ఆహ్వానం పంపిందట. ఐసీసీ ఈవెంట్లలో భాగంగా మే 30, 31 తేదీలలో స్పెషల్ మీటింగ్స్ ఉన్నాయట. ఈ క్రమంలోనే ఈ సమావేశాలకు రావాలని మొహ్సిన్ నఖ్వీకి పిలుపు వెళ్ళింది. ఇందులో భాగంగానే ఐపీఎల్ ఫైనల్ తిలకించేలా ఐసీసీ ప్లాన్ చేసింది. ఈ క్రమంలోనే ఇండియా పర్యటనకు మొహ్సిన్ నఖ్వీ వస్తాడని చర్చ జరుగుతోంది.
ఐపిఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు మొహ్సిన్ నఖ్వీ వస్తాడన్న వార్త నేపథ్యంలో.. ఇండియన్ ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది. శత్రువు వచ్చినా కూడా తాము ఆహ్వానం పలుకుతామని పేర్కొందట. అయితే ఈ అంశంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ ( Navjot Singh Sidhu) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాకు మొహ్సిన్ నఖ్వీని ఆహ్వానించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తాను ఎప్పటి నుంచో ఇదే విషయాన్ని చెబుతున్నానని వెల్లడించారు. ఇండియా అలాగే పాకిస్తాన్ మధ్య సంబంధాలు పెంచుకోవాలి తప్ప… తెంచుకోకూడదని కోరారు.
యుద్ధం వచ్చినప్పుడు పోరాడిన తరహాలోనే… ఇప్పుడు రెండు జట్ల క్రికెటర్లు స్నేహ పూర్వకంగా ఉండాలని నవజ్యోత్ సింగ్ సిద్ధూ స్పష్టం చేశారు. మోడీ ప్రభుత్వం కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మొహ్సిన్ నఖ్వీకి భారత సర్కార్ నుంచి ఆహ్వానం వెళ్లడం హర్షించ దగ్గ విషయమని తెలిపారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రెండు ప్రభుత్వాలు కలిసికట్టుగా వెళ్లాలని కూడా నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసినట్లు ఓ వార్త వైరల్ గా మారింది. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియదు కానీ…నవజ్యోత్ సింగ్ సిద్ధూ చేసిన వ్యాఖ్యలు దుమారం నేర్చుకున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ తిలకించేందుకు మొహ్సిన్ నఖ్వీకి ఆహ్వానం అందినట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పర్యటన నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీకి పాకిస్తాన్ ప్రభుత్వం ఓకే చెప్పలేదని తెలుస్తోంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య సంబంధాలు ఏ మాత్రం బాగాలేవని.. ఈ క్రమంలోనే వర్చువల్ గా ఐసీసీ కార్యక్రమాలకు హాజరుకావాలని మొహ్సిన్ నఖ్వీకి ఆదేశాలు జారీ చేసిందట పాకిస్తాన్ సర్కార్.