E-Paper
Advertisement

అయ్యో పాపం.. మామిడికాయ కోసం వెళ్తే.. బంగారు గొలుసు చోరీ

అయ్యో పాపం.. మామిడికాయ కోసం వెళ్తే.. బంగారు గొలుసు చోరీ
Advertisement

Chain Snatching: పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలోని తిలక్‌నగర్ డౌన్ ఏరియాలో పట్టపగలే జరిగిన ఒక చైన్ స్నాచింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంటి ముందు పనులు చేసుకుంటున్న ఓడ్నాల భూలక్ష్మి అనే మహిళ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఒక దుండగుడు ఆమెను లక్ష్యంగా చేసుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో ఇంటి సమీపంలో ఉన్న చెట్టు నుండి ఒక మామిడికాయ కింద రాలింది. దానిని తీసుకునేందుకు భూలక్ష్మి ముందుకు వెళ్లారు.

ఆమె మామిడికాయను తీసుకుని వెనక్కి తిరిగి వస్తుండగా, బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఒక్కసారిగా ఆమె మెడలోని బంగారు గొలుసును రన్నింగ్‌లోనే లాక్కొని క్షణాల వ్యవధిలో అక్కడి నుంచి పరారయ్యాడు. ఊహించని ఈ ప్రమాదంతో కంగుతిన్న భూలక్ష్మి తేరుకుని దొంగను వెంబడించినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనిపై ఆమె వెంటనే గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, అక్కడి సీసీటీవీ ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. చైన్ స్నాచింగ్ దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా నిక్షిప్తం కావడంతో, ఆ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి ఫోటోను పోలీసులు విడుదల చేశారు. ఫుటేజ్ లోని వ్యక్తి ఆచూకీ తెలిస్తే వన్ టౌన్ పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

Also Read: హర్యానాలో ఘోరం.. 10 సెకన్లలో 30 రౌండ్ల కాల్పులు.. యువకుడి దారుణ హత్య!

Advertisement

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×