BigTV English

Neeraj Chopra: నీరజ్ చోప్రా.. మళ్లీ మెరిశాడు!

Neeraj Chopra: నీరజ్ చోప్రా.. మళ్లీ మెరిశాడు!

Lausanne Diamond League 2024: భారతదేశం బంగారు బాబు, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరోసారి మరో చోట మెరిశాడు. ఈసారి స్విట్జర్లాండ్ లో జరుగుతున్న లుసానె డైమండ్ లీగ్ 2024లో తన సత్తా చాటాడు. ఈసారి తన బల్లాన్ని 89.49 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. అయితే 90 మీటర్ల కల నెరవేరకపోయినా, ఈ సీజన్ లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.


ఈ లీగ్ లో మొదటి ప్రయత్నంలో నీరజ్ చోప్రా అందరినీ నిరాశపరిచాడు. 82.10 మీటర్లు మాత్రమే విసిరి నాలుగో స్థానంలో నిలిచాడు. అంతా అయిపోయిందని అనుకున్నారు.

కానీ తర్వాత మనోడు తేరుకుని వరుసగా 83.21, 83.13, 85.58 మీటర్లు విసిరాడు. ఇక చివరి ప్రయత్నంలో గ్రెనెడా ప్లేయర్ అండర్సన్ పీటర్స్ ఏకంగా 90.61 మీటర్లు జావెలిన్‌ను విసిరి అగ్రస్థానంలోకి దూసుకెళ్లాడు. ఇక లాభం లేదనుకుని, పారిస్ ఒలింపిక్స్ కోసం చేసిన ప్రాక్టీస్ ను గుర్తు చేసుకున్న నీరజ్ పరుగెత్తి, పరుగెత్తి తన బలాన్నంతా ఉపయోగించి బల్లాన్ని విసిరాడు.


అంతే అది 89.49 మీటర్ల దూరంలో పడింది. దీంతో ఎప్పటిలా రెండో స్థానం దక్కింది. జర్మన్ ప్లేయర్ వెబర్ జులియన్ 87.08 మీటర్లతో మూడో స్థానాన్ని పొందాడు. పారిస్ ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన పాకిస్తాన్ జావెలిన్ త్రోయర్ అర్షద్ నదీమ్ ఈ టోర్నీకి దూరంగా ఉన్నాడు. గాయం కారణంగానే అతను బరిలోకి దిగలేదని తెలుస్తోంది.

Also Read: ఇక ఆడింది చాలు.. చదువుకుంటా: అర్చన కామత్

బంగారు బాబు నీరజ్ చోప్రా.. నెమ్మదిగా ఏడాది ఏడాదికి డౌన్ అవుతున్నాడని అంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన నీరజ్ చోప్రా పారిస్ ఒలింపిక్స్ కి వచ్చేసరికి సిల్వర్ మెడల్ కి పరిమితమయ్యాడు. ఇప్పుడు కూడా డైమండ్ లీగ్ 2022లో గోల్డ్ మెడల్ సాధించి.. 2024కి వచ్చేసరికి సిల్వర్ మెడల్ కి పరిమితమయ్యాడు.

ఇక్కడ గుడ్డిలో మెల్ల ఏమిటంటే మెడల్స్ తగ్గుతున్న, కాలంతో, యువతతో పోటీ పడుతున్నాడు. ఏడాదికేడాది తను విసురుతున్న జావెలిన్ దూరం మాత్రం పెరుగుతోంది. ఇదొక ఆశావాహ పరిణామమని కోచ్ లు వ్యాఖ్యానిస్తున్నారు.

 

Related News

IND VS AUS: బీసీసీఐ ఫోన్ లిఫ్ట్ చేయ‌ని కోహ్లీ..వ‌న్డేల్లోకి అభిషేక్ శ‌ర్మ‌ ?

IND VS BAN: బంగ్లాతో నేడు సూప‌ర్ 4 ఫైట్‌…టీమిండియా గెల‌వాల‌ని పాకిస్థాన్, శ్రీలంక ప్రార్థ‌న‌లు

ICC -USA: ఆ క్రికెట్ జ‌ట్టుకు షాక్‌… సభ్యత్వ హోదాను రద్దు చేసిన ICC

Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌల‌ర్‌ అబ్రార్ అస‌భ్య‌క‌ర‌మైన సైగ‌లు….ఇచ్చిప‌డేసిన‌ హ‌స‌రంగా

SL Vs PAK : శ్రీలంక కి షాక్.. కీల‌క‌పోరులో పోరాడి నిలిచిన పాక్..!

Shoaib Akhtar : K.L. రాహుల్ ఆడి ఉంటే.. మా పాకిస్తాన్ చిత్తుచిత్తుగా ఎప్పుడో ఓడిపోయేది

SL Vs PAK : త‌డ‌బ‌డ్డ శ్రీలంక.. పాకిస్తాన్ టార్గెట్ ఎంతంటే..?

IND Vs PAK : పాకిస్తాన్ ప్లేయర్లను కుక్కతో పోల్చిన సూర్య.. వీడియో వైరల్

Big Stories

×