Netizence Comments on Team India after loss SL vs IND 3rd ODI Match: శ్రీలంక వన్డే జట్టులో ఆడిన టీమ్ ఇండియా ఆటగాళ్లందరికి అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది. అయితే ఇందులో సీనియర్లయిన రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ ఇద్దరూ కూడా ఈ సిరీస్ కి రెస్ట్ అడిగారు. కానీ గౌతం గంభీర్ పట్టుపట్టి మరీ పిలిచి ఆడించాడు. ఫలితంగా రోహిత్ శర్మ బ్యాటర్ గా సఫలమయ్యాడు. కానీ జట్టుని గెలిపించలేకపోయాడు. సిరీస్ ఓటమి పాలైంది.
ఇక విరాట్ కొహ్లీకి శ్రీలంకపై అద్భుతమైన రికార్డ్ ఉంది. ఏకంగా 10 సెంచరీలు చేశాడు. మరి అలాంటి ఆటగాడు, అసలు ఆడటమే రాదన్నట్టు ఆడాడు. మూడు వన్డేల్లో 14, 24, 20 ఇలాగే చేశాడు. జట్టుని కాపాడి, ఒంటిచేత్తో గెలిపించే విరాట్ కొహ్లీ ఇలా అయిపోవడంపై తనని ఏమీ అనలేక, నెట్టింట సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. చివరికి గౌతం గంభీర్ పై పడుతున్నారు.
ఇంట్లో పడుకున్నోళ్లని లేపి, ఆడటానికి రమ్మంటే ఇలాగే ఉంటుందని సెటైర్లు వేస్తున్నారు. అసలు కొహ్లీకి ప్రాక్టీస్ ఎక్కడుందని అంటున్నారు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ ను చూస్తుంటే సీనియర్లందరూ ఇంతవరకు దొరికిన ఖాళీ సమయంలో ఫుల్ రిలాక్స్ అయిపోయారని అర్థమవుతోందని అంటున్నారు. మొత్తం ప్రాక్టీస్ ని అటకెక్కించేశారని చెబుతున్నారు.
Also Read: సిరాజ్ తో అన్ని ఓవర్లు అవసరమా?: రోహిత్ కెప్టెన్సీపై విమర్శలు
ఇవన్నీ చూసిన తర్వాత రాబోవు సిరీస్ లకి సీనియర్ల వళ్లు వంగాలంటే, కనీసం నెలరోజుల ముందు నుంచే కండీషనింగ్ క్యాంపులు నిర్వహించాలని అంటున్నారు. లేదంటే టీమ్ ఇండియా బ్రాండ్ వాల్యూ పడిపోతుందని అంటున్నారు. అలాగే బ్యాటింగ్, బౌలింగు కోచ్ లు ప్రాక్టీస్ పెంచాలి.
శ్రీలంక జూనియర్ స్పిన్నర్లు.. టీమ్ ఇండియాలోని వరల్డ్ క్లాస్ నెంబర్ వన్ బ్యాటర్లను వణికిస్తుంటే, మన సీనియర్ బౌలర్లు శ్రీలంక బ్యాటర్లపై వీసమెత్తయినా ప్రభావం చూపలేకపోయారు. ఇటు బౌలింగు, అటు బ్యాటింగ్ అన్నింటా టీమ్ ఇండియా వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనిపించాయి.
కొత్తగా జట్టులోకి వచ్చిన శివమ్ దూబెకి మరెన్ని అవకాశాలు ఇవ్వాలనేది ఆలోచించాలి. అలాగే రియాన్ పరాగ్ రూపంలో ఒక ఆశాకిరణం కనిపిస్తోంది. వన్డే జట్టుకి పనికి రారని తీసేసిన సూర్యకుమార్, యశస్వి జైశ్వాల్, రుతురాజ్ గైక్వాడ్, సంజూ శాంసన్ వీరందరినీ జట్టులోకి తీసుకోవాలి. రాబోవు వన్డే సిరీస్ లకు.. వన్డే జట్టులో మార్పులు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్లు పేర్కొంటున్నారు.