BigTV English

Jr NTR – Neel Movie : తారక్ – నీల్ మూవీ టైటిల్ ఇదే… ఏకంగా జక్కన్ననే లీక్ చేశాడు సామి

Jr NTR – Neel Movie : తారక్ – నీల్ మూవీ టైటిల్ ఇదే… ఏకంగా జక్కన్ననే లీక్ చేశాడు సామి

Jr NTR – Neel Movie : సౌత్ సినిమా ఇండస్ట్రీలో కేజిఎఫ్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు ప్రశాంత్ నీల్. మామూలుగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. అలానే ఈ సినిమాకి సీక్వెల్ గా కూడా వచ్చిన కే జి ఎఫ్ 2 కూడా మంచి కలెక్షన్స్ వసూలు చేసింది. దాదాపు 1000 కోట్లకు పైగా ఈ సినిమా వసూలు చేసింది. ఇక అప్పటినుంచి ప్రశాంత్ నీల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది అని చెప్పాలి. అక్కడితో ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా కూడా అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభాస్ హీరోగా సలార్ అనే సినిమాను చేశాడు ప్రశాంత్. ప్రభాస్ కెరియర్ కి ఆ సినిమా బ్లాక్ బస్టర్ కం బ్యాక్ అయింది. సినిమా ఫస్ట్ షో పడగానే పాజిటివ్ టాక్ సాధించుకుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్నట్లు అధికారికంగా ఎప్పుడో అనౌన్స్ చేశారు.


ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్లు తెలిసిన విషయమే. దీని గురించి అధికారిక ప్రకటన కూడా వచ్చింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఈ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి. అందరూ కూడా ఈ సినిమా రెండు పార్ట్స్ లో వస్తుంది అని అనుకున్నారు. కానీ ఈ సినిమాకి ఫ్రీక్వెల్ కానీ సీక్వెల్ కానీ లేదు అని తెలుస్తుంది. ఇది కంప్లీట్ గా సాగిపోయే సింగిల్ సినిమా అని సమాచారం వినిపిస్తుంది. త్వరలో కూడా దీని గురించి అధికార ప్రకటన రానుంది. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎన్టీఆర్ రీసెంట్ గా దేవర సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చాడు.

Also read : Thalapathi Vijay: సింప్లిసిటీ అంటూ ఫ్యాన్స్, యాక్టింగ్ అంటూ ట్రోల్స్


టైటిల్ రివీల్

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను ఖరారు చేస్తారు అని కొన్నిచోట్ల వార్తలు వినిపిస్తూ వచ్చాయి. కానీ దాని గురించి అధికారిక ప్రకటన రాలేదు. ప్రదీప్ రంగనాథన్ నటించిన డ్రాగన్ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా కొన్ని వార్తలు వినిపించాయి. ఎన్టీఆర్ టైటిల్ ని కాపీ కొట్టాడు అంటూ సోషల్ మీడియాలో పోస్టులు కూడా కనిపించాయి. అయితే ఇప్పుడు ఈ అన్ని సందేహాలకు ఒక్క స్టేట్మెంట్తో చెక్ పెట్టేసాడు జక్కన్న. ఎస్.ఎస్ రాజమౌళి మాట్లాడుతూ ప్రశాంత నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ అని టైటిల్ ని రివీల్ చేసేసాడు. ఇప్పటివరకు చాలామందికి సినిమా టైటిల్ మీద డౌట్ ఉండేది కానీ ఎస్.ఎస్ రాజమౌళి చెప్పడంతో ఆల్మోస్ట్ టైటిల్ కూడా కన్ఫర్మ్ అయింది. మరి ఈ విషయంపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారు వేచి చూడాలి.

Also read : Hit 3 Trailer Lunch Event : 15 ఏళ్ల క్రితం ఒక అమ్మాయిని కలవడానికి వైజాగ్ వచ్చేవాడిని

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×