Dhanashree Verma: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ యుజ్వేంద్ర చాహల్, అతని భార్య ధనశ్రీ వర్మ మధ్య విడాకుల వ్యవహారం గత కొద్ది రోజులుగా చర్చనియాంశంగా మారిన విషయం తెలిసిందే. చాహల్ – ధనశ్రీ వివాహం 2020 లో జరిగింది. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ జంట గతంలో చేసిన పోస్టులు అభిమానులను గందరగోళానికి గురిచేశాయి. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరినొకరు అన్ ఫాలో చేసుకోవడం, ధనశ్రీ తన పేరు నుండి చాహల్ అనే పదాన్ని తొలగించడంతో వీరి మధ్య విడాకులపై పుకార్లు వచ్చాయి.
అయితే తాజాగా ఈ జంట అధికారికంగా విడిపోయినట్లు సమాచారం. నివేదికల ప్రకారం వీరిద్దరికీ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఫిబ్రవరి 20 గురువారం రోజున తుది విచారణ ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టులో జరిగిందని.. న్యాయమూర్తి కౌన్సిలింగ్ ను సిఫార్సు చేయగా.. 45 నిమిషాల పాటు కొనసాగిన తర్వాత రెండు పార్టీలు స్నేహపూర్వకంగా విడిపోవాలనే నిర్ణయాన్ని ధ్రువీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ వచ్చిన అనంతరం చాహల్ ఇంస్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ చేశాడు.
” నేను లెక్కించలేనంత ఎక్కువసార్లు దేవుడు నన్ను రక్షించాడు. నేను రక్షించబడిన సమయాలను నేను ఊహించగలను. ఎల్లప్పుడూ నా వెంట ఉన్నందుకు దేవా, ధన్యవాదాలు. ఆమెన్” అని పోస్ట్ చేశాడు. అనంతరం ధనశ్రీ కూడా ఓ పోస్ట్ చేసింది.” మనం పడే బాధలు, పరీక్షలను కొంతకాలం తర్వాత ఆ దేవుడు ఆశీర్వాదాలుగా మార్చగలడని తెలిసింది. దేవుడిపై మీకున్న విశ్వాసమే.. మంచి జరిగేలా చేస్తుంది” అని ధనశ్రీ పోస్ట్ చేసింది.
ఇక అనంతరం చాహల్ నుంచి.. ధనశ్రీ ఏకంగా 60 కోట్ల భరణం డిమాండ్ చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో ధనశ్రీ పై తీవ్ర విమర్శలు వెలువడ్డాయి. 2020లో చాహల్తో పెళ్లికి ముందు 20 కోట్లతో పలు బిజినెస్ లు ప్రారంభించిన ధనశ్రీ.. చాహల్ ని పెళ్లి చేసుకుని, ప్రస్తుతం విడాకులు తీసుకొని 60 కోట్లు భరణంగా తీసుకుందని.. ఈ బిజినెస్ బాగుందని ధనశ్రీని ట్రోలింగ్ చేస్తున్నారు. అంతేకాదు ఇప్పటివరకు విడాకులు తీసుకున్న క్రికెటర్ల భార్యలలో.. ధనశ్రీ వర్మ అత్యధికంగా 60 కోట్లు తీసుకుందంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ భార్య.. భరణంగా అతడి వద్ద నుండి 26.75 కోట్లు తీసుకుందని.. అతడు రెండవ స్థానంలో ఉన్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ భరణం వార్తలపై ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను ఖండిస్తూ ధనశ్రీ కుటుంబం ఓ పత్రిక ప్రకటన విడుదల చేసింది. భరణం గురించి వస్తున్న కథనాలన్నీ నిరాధారమైనవేనని.. అసలు అంత మొత్తాన్ని ఎవరు అడగలేదని, అటువైపున వారు ఇస్తామని చెప్పలేదని అన్నారు. ధ్రువీకరణ లేని సమాచారాన్ని ప్రచురించడం పూర్తిగా బాధ్యతారాహిత్యమేనని, ఇలాంటి నిర్లక్ష్యపు చర్యలు హాని కలిగిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిజా నిజాలను ధ్రువీకరించుకోవాలని, ప్రతి ఒక్కరి పట్ల గౌరవంగా వ్యవహరించాలని మీడియాకు సూచించింది ధనశ్రీ కుటుంబం.
What an entrepreneur 🔥#Divorce #dhanashreeverma #yuzvendrachahal pic.twitter.com/jcpxiqgHji
— Sudiksha (@Su_diksha) February 22, 2025