Pakistan New Central Contracts: పాకిస్తాన్ క్రికెటర్లకు బంపర్ ఆఫర్ తగిలింది. తాజాగా కొత్త సెంట్రల్ కాంట్రాక్టు జీతాలను ( PAKISTAN CRICKETERS NEW CENTRAL CONTRACT ) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెటర్ల ( PAKISTAN CRICKETERS SALARIES) జీతాలు భారీగా పెరిగినట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. టెస్టులు, వన్డేలు, టి20 లు, రంజీలు ఆడే ప్లేయర్లను డివైడ్ చేస్తూ.. ఈ సెంట్రల్ కాంట్రాక్టు జీతాలను ఈ సంవత్సరం కోసం సిద్ధం చేసిందట పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. రేపు లేదా ఎల్లుండి అధికారికంగా దీనిపై ప్రకటన కూడా ఉండన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇండియా చేతిలో ప్రతిసారి చావు దెబ్బ తింటున్న పాకిస్తాన్ క్రికెటర్లకు ఆ దేశానికి సంబంధించిన క్రికెట్ బోర్డు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2026-27 సంవత్సరంకు గాను సెంట్రల్ కాంట్రాక్టు ఆటగాళ్ల జీతాలను నాలుగు విభాగాలుగా డివైడ్ చేసి.. ప్రకటించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇక ఈ సెంట్రల్ కాంట్రాక్టు ప్రకారం టెస్ట్ ప్లేయర్లకు PKR 4.8 కోట్లు ఏడాదికి రానున్నాయి. అంటే దాదాపు ఒక్కో ఆటగాడికి రూ.1.44 కోట్లు రానున్నాయి. అలాగే టెస్టులతో పాటు వన్డేలు ఆడే ప్లేయర్లకు PKR 6 కోట్లు సంవత్సరానికి ఇవ్వనున్నారు. వన్డేలతో పాటు టి20 లు ఆడే క్రికెటర్లకు PKR 2.16 కోట్లు లభించనున్నాయి. టి20లతో పాటు లీగ్ మ్యాచ్లు ఆడే వాళ్లకు PKR 1.8 కోట్లు దక్కుతాయి. అలాగే ఒక్కో టెస్ట్ ఆడితే మ్యాచ్ ఫీజు కింద PKR 15 లక్షలు దక్కనున్నాయి. అంటే ఇండియన్ రూపాయలలో రూ.5 లక్షలువస్తాయి. ఒక్క వన్డే ఆడితే PKR 7.5 లక్షలు, టి20 లకు PKR 5 లక్షలు చొప్పున అందించనున్నారు.
ఐసీసీ నుంచి వచ్చే వార్షిక ఆదాయంలో మూడు శాతం వాటాను సెంట్రల్ కాంట్రాక్టు ఉన్న ఆటగాళ్లకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. అంతేకాదు ఐసీసీ టోర్నమెంట్లు ఆడే వాళ్లకు బోనస్ లు కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకవేళ ఐసీసీ టోర్నమెంట్ గెలిస్తే 500% మ్యాచ్ ఫీజు బోనస్ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆసియా కప్ గెలిస్తే 300% బోనస్ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. దీంతో పాకిస్తాన్ క్రికెటర్లు సంబరాలు చేసుకుంటున్నారు. వచ్చే ఐసీసీ టోర్నమెంటులో కచ్చితంగా పాకిస్తాన్ క్రికెట్ జట్టు టైటిల్ గెలవాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్లాలని.. ఈ బోనస్ లు ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది.
🚨 NEW CENTRAL CONTRACT SALARIES FOR PAKISTAN CRICKETERS 🚨
Test players – PKR 4.8 crore annually
Test & ODI players – PKR 6 crore annually
ODI & T20I players – PKR 2.16 crore annually
T20I & league players – PKR 1.8 crore annuallyMatch fees:
Test – PKR 15 lakhs per match
ODI… pic.twitter.com/eM0lyb5PFr— Rayham. (@RayhamUnplugged) June 18, 2026