E-Paper
Advertisement

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు లంక మాజీల వార్నింగ్
Advertisement

Srilanka Warns Vaibhav:  టీమిండియా, ఆఫ్ఘనిస్తాన్ అలాగే శ్రీలంక ఏ జట్లు కలిసి ట్రై సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసిందే. శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ట్రై సిరీస్ నేపథ్యంలో నిన్న టీమిండియా అలాగే శ్రీలంక ఏ మధ్య కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ నేపథ్యంలో సూపర్ ఓవర్ జరగగా, శ్రీలంక ప్లేయర్లతో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) గొడవ పెట్టుకున్నాడు. ఓవరాక్షన్ చేశారన్న నేపథ్యంలో ఓ ప్లేయర్ ను వెనక్కి నెట్టేసాడు వైభవ్. ఈ సంఘటన ఇప్పుడు వివాదంగా మారింది. అయితే లంక గడ్డపై తమ క్రికెటర్లను వైభవ్ సూర్యవంశీ బెదిరించిన నేపథ్యంలో మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. 15 ఏళ్ల బుడ్డోడు వైభవ్ పై చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఐసిసికి కూడా శ్రీలంక మాజీ క్రికెటర్లు లేఖలు రాసినట్లు వార్తలు వస్తున్నాయి.

Also Read:  Ind vs Pak Women’s T20 World Cup 2026 : పాక్ ప్లేయ‌ర్ల‌పై దీప్తి శర్మ మర్డర్ అటెమ్ట్ ? జేబులో స్ప్రే బాటిల్ పెట్టుకుని ప్లాన్

ఇక చాలు ఫ్లైట్ ఎక్కి ఇంటికి వెళ్లి, ఐపీఎల్ ఆడుకో…వైభ‌వ్ కు వార్నింగ్

Advertisement

ట్రై సిరీస్ నేపథ్యంలో శ్రీలంక క్రికెటర్లతో గొడవపడ్డ వైభవ్ సూర్య వంశీ పై అక్కడి మాజీ క్రికెటర్లు సీరియస్ అవుతున్నారు. వైభవ్ సూర్య వంశీ పై బ్యాన్ విధించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. ఇక మరికొందరైతే… శ్రీలంక దేశాన్ని ఖాళీ చేసి.. ఇండియా వెళ్లిపొమ్మని స్పష్టం చేస్తున్నారు. ఇండియాకు వెళ్లి ఐపీఎల్ ఆడుకో అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఐపీఎల్ లో ఓవరాక్షన్ చేసినట్లుగా ఇక్కడ చేస్తే… అసలు నడవదని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు శ్రీలంక మాజీ క్రికెటర్లు. బీసీసీఐ అండ దండలు ఉన్నాయని ఇలా రెచ్చిపోతున్నాడని సీరియస్ అవుతున్నారు.

వైభ‌వ్ సూర్య‌వంశీపై భారీ ఫైన్ వేసే ఛాన్స్‌

శ్రీలంక క్రికెటర్లతో గొడవపడ్డ వైభవ్ సూర్యవంశీ పై ఐసీసీ కూడా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే వైభవ్ ను రెచ్చగొట్టిన విషేన్ హలంబాగే పైన ఐసీసీ తో పాటు శ్రీలంక బోర్డు చర్యలు తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలోనే వైభవ్ పై కూడా ఒక మ్యాచ్ ఆడకుండా నిషేధం విధిస్తారని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, నిన్నటి సంఘటనలో వైభవ్ సూర్యవంశీ తప్పు ఏమీలేదని టీమిండియా మాజీ క్రికెటర్లు కూడా వాదిస్తున్నారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు చూస్తే ఎవరు తప్పు చేశారనేది క్లారిటీ వస్తుందని అంటున్నారు. కాగా రేపు ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా ఏ జట్ల మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఉదయం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. అయితే ఇందులో టీమిండియా గెలిచి ఫైనల్ కి వెళ్తే… శ్రీలంకతో తలపడుతుంది. ఈ క్రమంలో వైభవ్… శ్రీలంక పై ప్రతీకారం తీర్చుకుంటాడని ఇండియన్ ఫ్యాన్స్ చెబుతున్నారు.

Advertisement

Also Read: Shoaib Akhtar On Ind vs Pak Women’s T20 World Cup 2026 : మీ ఆట చూస్తే విర‌క్తి పుడుతోంది…కామెంట్రీ ప్యానెల్ లో కూర్చోలేక‌పోతున్నాం

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టును సంక‌నాకిస్తున్నాడు..న‌ఖ్వీ త‌ప్పుకుంటేనే, నేను ఛార్జ్ తీసుకుంటా

పాకిస్తాన్ ప్లేయ‌ర్లు ఇలాగే ఆడితే, PSL దుకాణం మూసుకోవాల్సిందే

దున్న‌పోతుల్లా తిన‌డం కాదు, పాకిస్తాన్ జెండా ఎగుర‌వేయ‌డం నేర్చుకో ?

దారిన పోయే ప్ర‌తి అడ్డ‌మైన వాడికి టీమిండియాలో ఛాన్స్ ఇస్తున్నారు

ప్రియురాలితో తిరుమ‌ల‌లో మెరిసిన‌ హ‌ర్ధిక్ పాండ్యా…న‌యా లుక్ అదుర్స్‌

కామన్‌వెల్త్‌లో భార‌త్ దూకుడు..మ‌రో రెండు గోల్డ్ మెడ‌ల్స్‌

పాకిస్తాన్ ను ఓడించేందుకు వెస్టిండీస్ కుట్రలు.. వైట్ వాష్ చేసేందుకు మాస్ట‌ర్ ప్లాన్‌

వాడికి బౌలింగ్ చేయ‌డం కంటే, రిటైర్మెంట్ ఇవ్వ‌డం బెట‌ర్‌

Big Stories

Advertisement
×