BigTV English

T20 World cup: T20 వరల్డ్ కప్ లో ఏయే రికార్డులు నమోదయ్యాయంటే..

T20 World cup: T20 వరల్డ్ కప్ లో ఏయే రికార్డులు నమోదయ్యాయంటే..

చిన్న జట్ల సంచలనాలు, పెద్ద జట్ల హోరాహోరి పోరుతో… తాజా T20 వరల్డ్ కప్ క్రికెట్ అభిమానులకు అసలు సిసలు మజాను పంచింది. అనూహ్యంగా ఫైనల్ చేరిన పాకిస్థాన్ ఆఖరి మెట్టుపై బోల్తా కొట్టగా… వర్షం కారణంగా ఐర్లండ్ చేతిలో ఓటమి మినహా అద్బుత ఆటతీరుతో టైటిల్ ఎగరేసుకుపోయింది… ఇంగ్లండ్ టీమ్. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగిన టోర్నీలో… ఎన్నో కొత్త రికార్డులు కూడా నమోదయ్యాయి. అవేంటో చూద్దాం!


టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ.. ఈ T20 వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఆరు ఇన్నింగ్స్‌ల్లో 296 పరుగులు చేశాడు… కోహ్లీ. నెదర్లాండ్స్‌ బ్యాటర్ మాక్స్ 242 రన్స్ తో రెండోస్థానంలో, సూర్యకుమార్‌ యాదవ్‌ 239 రన్స్ తో మూడో స్థానంలో నిలిచారు. అలాగే ఎక్కువ హాఫ్‌ సెంచరీలు చేసిన బ్యాటర్లలో తొలిస్థానంలో కోహ్లీ నిలిస్తే… రెండో ప్లేస్ లో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. కోహ్లీ 4 హాఫ్ సెంచరీలు చేస్తే… సూర్యకుమార్‌ 3 అర్ధ సెంచరీలు చేశాడు.

ఇక బౌలర్లలో శ్రీలంక ఆటగాడు హసరంగ అత్యధికంగా 15 వికెట్లు తీశాడు. అతని తర్వాత ఇంగ్లండ్ బౌలర్ సామ్‌ కరన్‌ 13 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే టాప్‌ -10 బౌలర్ల లిస్టులో ఒక్క టీమ్‌ఇండియా ఆటగాడు కూడా లేడు. పది వికెట్లు తీసిన అర్ష్‌దీప్‌ సింగ్‌ 11వ స్థానంలో నిలిచాడు. ఇక ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన సామ్‌ కరన్‌… ఓ మ్యాచ్ లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన బౌలర్ గా నిలిచాడు. అఫ్గానిస్థాన్‌పై పది పరుగులు మాత్రమే ఇచ్చి… ఐదు వికెట్లు పడగొట్టాడు.. సామ్ కరన్. ఇక 93 డాట్ బాల్స్ వేసి… నెదర్లాండ్స్ బౌలర్ ఫ్రెడ్ క్లాసెన్ కూడా రికార్డు సృష్టించాడు.


ఈ ప్రపంచకప్ లో… ఓ మ్యాచ్ లో అత్యధిక స్కోరు చేసిన ఆటగాడిగా దక్షిణాఫ్రికా ప్లేయర్ రిలీ రూసో నిలిచాడు. బంగ్లాదేశ్ పై 109 రన్స్ చేశాడు… రూసో. ఇక శ్రీలంక పై 104 రన్స్ చేసిన కివీస్ బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ వరల్డ్ కప్ లో సెంచరీలు కొట్టింది వీళ్లిద్దరు మాత్రమే. ఇక అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్లలో మన సూర్యకుమార్‌ యాదవ్‌ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. 6 ఇన్నింగ్స్‌ల్లో 26 ఫోర్లు బాది SKY మొదటి స్థానంలో ఉండగా… 6 ఇన్నింగ్స్‌ల్లో 25 బౌండరీలతో కోహ్లీ రెండోస్థానంలో, 6 ఇన్నింగ్స్‌ల్లో 24 ఫోర్లతో జోస్‌ బట్లర్‌ మూడో స్థానంలో ఉన్నారు. ఇక జింబాబ్వే బ్యాటర్ సికందర్‌ రజా… అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో 11 సిక్స్‌లు బాదిన రజా తొలిస్థానంలో… 6 ఇన్నింగ్స్‌ల్లో 10 సిక్స్‌లు కొట్టిన ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్‌ హేల్స్‌ రెండో స్థానంలో, 8 ఇన్నింగ్స్‌ల్లో 10 సిక్స్‌లు కొట్టిన శ్రీలంక బ్యాటర్ కుశాల్ మెండిస్‌ మూడో స్థానంలో ఉన్నారు.

Tags

Related News

OTT Movie : ప్రేయసి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు… లవ్ ముసుగులో అమ్మాయికి నరకం… రకుల్ కిరాక్ క్రైమ్ థ్రిల్లర్

Heavy Rains: తెలంగాణకు రెడ్ అలర్ట్.. హైదరాబాద్‌లో భారీవర్షాలతో మునిగిపోయే జోన్స్ ఇవే

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Big Stories

×