HCA – SRH: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ {HCA} అంటేనే వివాదాలకు కేరాఫ్ అనే పేరు పడిపోయింది. హెచ్సీఏ లో నిత్యం అంతర్గత కలహాలే. ఇక ఇందులో నిధుల గోల్మాల్ వార్తలు అయితే ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. 2025 ఐపీఎల్ సందర్భంలో కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ లో సంచలనం రేగింది. ఉచిత ఐపిఎల్ టికెట్ల కోసం సన్రైజర్స్ హైదరాబాద్ {SRH} ఫ్రాంచైజీని బెదిరించారని ఆరోపణలతో పాటు, నిధుల దుర్వినియోగం, ఫోర్జరీ కేసుల్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు.
Also Read: Sehwag Century: 99 పరుగుల వద్ద సెహ్వాగ్ సెంచరీని అడ్డుకున్న లంక… ఎంత కుట్రలు చేసారురా
ఆయనతోపాటు మరో నలుగురిని కూడా అదుపులోకి తీసుకోవడం క్రీడా వర్గాల్లో తీవ్ర చర్చనియాంశమైంది. 2025 ఐపీఎల్ సందర్భంగా ఓ మ్యాచ్ కి తమకు టికెట్స్ కేటాయించలేదని స్టేడియంలోని కార్పోరేట్ బాక్స్ కి హెచ్సీఏ తాళం వేసింది. ఈ ఘటనతో విసిగిపోయిన సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం.. ఇక హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతామని హెచ్చరించింది. ఈ వివాదం రాష్ట్రంలో సంచలనంగా మారడంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఈ మేరకు ఎస్ఆర్హెచ్ – హెచ్సిఏ వివాదం పై ప్రభుత్వం విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని ఇబ్బందులకు గురిచేసినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. ఎస్సారెచ్ యాజమాన్యం 10% టికెట్లను హెచ్సిఏ కి ఫ్రీగా ఇస్తుందని.. మరో 10% టికెట్లు కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్లు విజిలెన్స్ నివేదికలో బట్టబయలైంది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సీఏ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు నిర్ధారించిన విజిలెన్స్ అధికారులు.. హెచ్సీఏ పై చర్యలకు సిఫారసు చేశారు.
దీంతో విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్సీఏ పై సిఐడి కేసు నమోదు చేసింది. ఈ కేసులో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును జూలై 9 బుధవారం రోజున అరెస్టు చేశారు. మరోవైపు తాజాగా ఈ కేసులోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ {ఈడి} ఎంట్రీ ఇచ్చింది. ఎఫ్ఐఆర్, నిందితుల రిమాండ్ రిపోర్టు సహా సీజ్ చేసిన HCA రికార్డులను అందించాలని శుక్రవారం సిఐడి కి లేఖ రాసింది. వాటి ఆధారంగా ఈడి కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ {ఈసీఐఆర్} నమోదు చేసి దర్యాప్తు చేపట్టనుంది.
అలాగే మనీలాండరింగ్ కోణంలో కూడా ఈ కేసు విచారణ చేయనుంది. అయితే జగన్మోహన్ రావు పై కేసు ఎలా నమోదయిందంటే.. గౌలిపుర క్రికెట్ క్లబ్ హైదరాబాద్ లో ఉంది. ఆ క్లబ్ అధ్యక్షుడు సి. కృష్ణ యాదవ్. ఈయన మాజీ మంత్రి కూడా. కృష్ణ యాదవ్ సంతకాన్ని శ్రీ చక్ర క్లబ్ కు ప్రెసిడెంట్ గా ఉన్న కవిత ఫోర్జరీ చేశారు. కవితకు హెచ్సీఏ ఆఫీస్ బేరర్ రాజేందర్ యాదవ్ సహకరించారు. వీరిద్దరూ భార్యాభర్తలు కూడా. అలా ఫోర్జరీ చేసిన డాక్యుమెంట్లను జగన్మోహన్ రావుకు అందించారు.
Also Read: Sara – Gill: గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సచిన్ కూతురు… ఒకరిపై ఒకరు పడుకుని మరీ !
ఆ డాక్యుమెంట్స్ ని ఉపయోగించి హెచ్సీఏ అధ్యక్ష పదవికి పోటీ చేశాడు జగన్మోహన్. హెచ్సీఏ కి అధ్యక్షుడు అయ్యాక నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డాడనేది జగన్మోహన్ రావు పై ఉన్న ప్రధాన అభియోగం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గురువారెడ్డి.. ఈ నిధుల దుర్వినియోగంపై నేరుగా సిఐడి కి ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన సిఐడి అతనిపై కేసు నమోదు చేసింది.