Sehwag Century: వీరేంద్ర సెహ్వాగ్.. ఈ పేరు చెబితే చాలు క్రీడా ప్రపంచంలో అతడు సృష్టించిన విధ్వంసం గుర్తొస్తుంది. టెస్టులు, వన్డేలు, టి-20 లు అనే తేడా లేకుండా.. ఫార్మాట్ ఏదైనా సరే దూకుడుగా ఆడడమే వీరేంద్ర సెహ్వాగ్ స్పెషాలిటీ. టెస్ట్ మ్యాచ్ లలోనూ టి-20 తరహా బ్యాటింగ్ చేయడం సెహ్వాగ్ స్టైల్. భారత జట్టు ఓపెనర్ గా వీరేంద్ర సెహ్వాగ్ ఎన్నో రికార్డులు బద్దలు కొట్టాడు.
Also Read: Sara – Gill: గిల్ డ్రెస్సింగ్ రూమ్ లోకి సచిన్ కూతురు… ఒకరిపై ఒకరు పడుకుని మరీ !
టెస్టుల్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేసిన ఏకైక భారత ఆటగాడు వీరు. వన్డేల్లో సచిన్ టెండుల్కర్ తర్వాత డబుల్ సెంచరీ బాధిన రెండవ భారత ఆటగాడిగాను వీరేంద్ర సెహ్వాగ్ రికార్డు క్రియేట్ చేశాడు. ట్రిపుల్ సెంచరీ చేయడమే కష్టం అనుకుంటే.. సిక్స్ బాది 300 మార్క్ అందుకున్న ధైర్యవంతుడు సెహ్వాగ్. ఇలా చెప్పుకుంటూ పోతే వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి.
సెహ్వాగ్ సెంచరీ చేయకుండా లంక కుట్ర:
అయితే ఓ సందర్భంలో వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేయకుండా శ్రీలంక క్రికెటర్లు కుట్ర చేశారు. 2010లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మరోసారి వైరల్ గా మారింది. 2010లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో సెహ్వాగ్ 99 పరుగులతో క్రీజ్ లో ఉండగా.. అతడి సెంచరీని అడ్డుకోవాలని కుట్ర చేశారు శ్రీలంక ఆటగాళ్లు. 2010లో భారత్, శ్రీలంక, న్యూజిలాండ్ జట్ల మధ్య ట్రై సిరీస్ జరిగింది. ఈ ట్రై సిరీస్ లో భాగంగా మూడవ మ్యాచ్ లో భారత్ – శ్రీలంక జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్ లో శ్రీలంక తొలుత బ్యాటింగ్ చేసింది. భారత బౌలర్ల దెబ్బకు లంక 170 పరుగులకే కుప్పకూలింది. అనంతరం లక్ష్య చేతనలో భారత్ కూడా నాలుగు వికెట్లను కోల్పోయినప్పటికీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా ఓడిపోతామని భావించిన శ్రీలంక ఆటగాళ్లు.. సెహ్వాగ్ సెంచరీని అడ్డుకోవాలని భావించారు. 35వ ఓవర్ వద్ద భారత్ విజయానికి మరో ఐదు పరుగులు అవసరమయ్యాయి. ఇందులో సెహ్వాగ్ ఒక్క పరుగు చేస్తే అతడి సెంచరీ పూర్తవుతుంది. ఈ క్రమంలో సూరజ్ రందీవ్ వేసిన బంతిని సెహ్వాగ్ బలంగా కొట్టే క్రమంలో.. ఆ బంతి మిస్ అవుతుంది.
Also Read: CSK – RCB: RCB జెర్సీతో అభిమాని.. చితకబాదిన ధోని ఫ్యాన్స్… వీడియో వైరల్
ఆ సందర్భంలో లంక కెప్టెన్, కీపర్ సంగక్కర కావాలనే ఆ బంతిని వదిలేస్తాడు. దీంతో ఆ బంతి ఎక్స్ట్రా పరుగుల రూపంలో ఫోర్ వెళ్ళిపోతుంది. ఆ తరువాత బౌలర్ సూరజ్ రంధీవ్ కావాలని నో బాల్ వేశాడు. ఆ బంతిని సెహ్వాగ్ 6 బాదినప్పటికీ.. నో బాల్ కారణంగా సింగిల్ రావడంతో భారత్ గెలుపొందింది. దీంతో సిక్స్ కొట్టినప్పటికీ సెహ్వాగ్ మాత్రం సెంచరీని తన ఖాతాలో వేసుకోలేకపోయాడు. ఇక మ్యాచ్ అనంతరం బౌలర్ కావాలనే నో బాల్ వేశాడని వీరేంద్ర సెహ్వాగ్ ఆరోపించాడు. ఈ విషయంపై లంక ఆటగాళ్లు దిల్షాన్, రన్దీవ్ పై తీవ్ర విమర్శలు రావడంతో.. రన్దీవ్ పై ఒక మ్యాచ్ వేటు వేయగా, దిల్షాన్ కి జరిమానా విధించారు.
?utm_source=ig_web_copy_link