Glenn Phillips: ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025 ని ఘనవిజయంతో ఆరంభించింది న్యూజిలాండ్ జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్ తో ఫిబ్రవరి 19 బుధవారం రోజున జరిగిన తొలి మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 320/5 స్కోర్ చేసింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్, టామ్ లేథమ్ సెంచరీలతో సత్తా చాటారు. ఇక ఆ జట్టు ఆల్రౌండర్ గ్లేన్ ఫిలిప్స్ మెరుపు ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. మెరుపు షాట్లతో పాక్ బౌలర్ల పై ఎదురుదాడికి దిగి 39 బంతులలోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 61 పరుగులు చేశాడు.
అనంతరం పాకిస్తాన్ జట్టు 321 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ బౌలర్ ఓరూర్క్ వేసిన బంతిని రిజ్వాన్ స్క్వేర్ కట్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ డీప్ పాయింట్ లో ఫీల్డింగ్ చేస్తున్న గ్లేన్ ఫిలిప్స్ చిరస్మరణీయమైన క్యాచ్ అందుకున్నాడు. దీంతో ఈ ఆరంభ మ్యాచ్ లోనే క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించే అద్భుత క్షణం నమోదయింది. ఫిలిప్స్ ఒంటి చేత్తో క్యాచ్ అందుకొని ఆటని కీలకమైన మలుపు తిప్పాడు.
అద్భుతమైన స్పందనతో గాల్లోకి ఎగిరి ఒంటి చేతితో క్యాచ్ అందుకున్నాడు. ఈ అద్భుతాన్ని చూసిన క్రీడాభిమానులు ఆశ్చర్యంతో అలరించారు. దీంతో న్యూజిలాండ్ జట్టు సభ్యులు కూడా ఫిలిప్స్ ని అభినందించేందుకు పరిగెత్తుకొచ్చారు. ఈ క్యాచ్ తో సపరేట్ ఫ్యాన్స్ ని ఏర్పరచుకున్నాడు. ఈ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025లో ఇదే బెస్ట్ క్యాచ్ గా నిలుస్తుందని ఎక్స్పర్ట్స్ కూడా అంటున్నారు. అయితే గ్లేన్ ఫిలిప్స్ ఇలాంటి క్యాచ్ పట్టడం ఇది మొదటిసారేం కాదు. టి-20 వరల్డ్ కప్ 2022 లో కూడా ఇలాగే గాల్లోకి జంప్ చేసి మరి ఫిలిప్స్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్ ని అందుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన ఆ మ్యాచ్ లో మిచల్ శాంట్నర్ వేసిన బంతిని మార్కస్ స్టోయినిస్ హాఫ్ సైడ్ గాల్లోకి లేపగా.. ఫిలిప్స్ జంప్ చేసి మరీ అందుకున్నాడు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా న్యూజిలాండ్ క్రికెట్ జట్టు మాజీ క్రికెటర్, కామెంటేటర్ సైమన్ డౌల్.. ఫిలిప్స్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. అతడు అంత ఫిట్నెస్ గా ఉండడానికి, ఇంత అద్భుతమైన క్యాచ్ నీ అందుకోవడానికి కారణం అతడు రోజుకి 800 పుష్ – అప్ లు కొడతాడని.. ఆ అంకితభావమే అతడి ఆట తీరును మెరుగుపరుస్తుందని తెలిపాడు.
ఈ విషయం తెలిసిన క్రీడాభిమానులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అతడు మోస్ట్ డేంజరస్ ఫీల్డర్ గా మారడానికి కారణం ఇదే అయ్యుండొచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. ఇక గ్లేన్ ఫిలిప్స్ సౌదీ అరేబియాలోని జెడ్డా లో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} 2025 మెగా వేలంలో అమ్ముడుపోలేదు. అతడి బేస్ ధరను రెండు కోట్లుగా నిర్ణయించారు. గత సంవత్సరం ఫిలిప్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకి ప్రాతినిధ్యం వహించాడు. అతడిని హైదరాబాద్ విడుదల చేయడంతో.. వేలంలో అమ్ముడుపోలేదు.
?utm_source=ig_embed&utm_campaign=loading" data-instgrm-version="14">