Sourav Ganguly Biopic: బాలీవుడ్‌లో బయోపిక్స్‌కు సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు బీ టౌన్‌లో ఒక సినిమా హిట్ అవ్వాలంటే అది బయోపిక్ అయ్యిండాలని కూడా మేకర్స్ ఫిక్స్ అయ్యేవాళ్లు. అలా గత కొన్నేళ్లలో పలువురు స్టార్ క్రికెటర్స్ బయోపిక్స్ కూడా తెరకెక్కాయి. అందులో చాలావరకు ప్రేక్షకులను విపరీతంగా మెప్పించి బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యాయి కూడా. ఇప్పుడు మరొక క్రికెటర్ బయోపిక్‌కు కూడా సన్నాహాలు మొదలయ్యాయని తెలుస్తోంది. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. ఫేమస్ మాజీ ఇండియన్ స్కిప్పర్ సౌరవ్ గంగూలీ. తనపై బయోపిక్ తెరకెక్కుతున్న విషయాన్ని స్వయంగా తానే ప్రకటించడంతో పాటు అందులో హీరో ఎవరో కూడా బయటపెట్టేశారు గంగూలీ.
డేట్స్ లేవు
మామూలుగా మాజీ క్రికెటర్లు ప్రెస్ మీట్‌లో పాల్గొన్న ప్రతీసారి తమ బయోపిక్ గురించి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా సౌరవ్ గంగూలీకి కూడా అదే ప్రశ్న ఎదురయ్యింది. దీంతో అసలు మ్యాటర్ బయటపెట్టేశారు ఈ మాజీ క్రికెటర్. ‘‘నేను విన్నదాని ప్రకారం రాజ్‌కుమార్ రావు టైటిల్ రోల్ ప్లే చేస్తారని తెలుస్తోంది. కానీ డేట్ సమస్యలు ఉన్నాయట. అందుకే ఈ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి దాదాపు ఏడాది అయినా పడుతుంది’’ అని ప్రకటించారు గంగూలీ. దీంతో అప్పుడే సౌరవ్ గంగూలీ బయోపిక్ గురించి ప్రేక్షకుల్లో చర్చలు మొదలయ్యాయి. అది కూడా రాజ్‌కుమార్ రావు హీరోగా నటిస్తున్నాడంటూ మూవీ పక్కా హిట్ అని చాలామంది ఫిక్స్ అయిపోతున్నారు.
తనే పర్ఫెక్ట్
రాజ్‌కుమార్ రావు (Rajkummar Rao) చివరిగా ‘మిస్టర్ అండ్ మిసెస్ మహి’ అనే సినిమాలో కనిపించాడు. ఆ సినిమాలో కూడా తను ఒక క్రికెటర్ పాత్రలోనే కనిపించి అలరించాడు. ఈ మూవీలో క్రికెటర్‌లాగా కనిపించడం కోసం రాజ్‌కుమార్ రావుతో పాటు జాన్వీ కపూర్ కూడా క్రికెట్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. దీంతో తను అయితే సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో పర్ఫెక్ట్ అని చాలామంది బాలీవుడ్ ప్రేక్షకులు ఫీలవున్నారు. రాజ్‌కుమార్ రావు ఏం సినిమా చేసినా దానికి తను 100 శాతం పర్ఫెక్ట్‌గా న్యాయం చేస్తాడని ఫ్యాన్స్ అనుకుంటూ ఉంటారు. అలాగే సౌరవ్ గంగూలీ బయోపిక్‌కు కూడా తనే పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు. దీనిపై రాజ్‌కుమార్ రావు స్పందించాలని ఉంది.
Also Read: సల్మాన్ ఖాన్ హాలీవుడ్ డెబ్యూ.. మరీ అలాంటి పాత్రలో అంటే ఫ్యాన్స్ ఫీలవుతారేమో.!
కెరీర్‌లో ఎన్నో కాంట్రవర్సీలు
ఇండియన్ క్రికెట్ టీమ్‌కు కెప్టెన్స్‌గా వ్యవహరించిన వారిలో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కూడా ఒకరు. ఆయన ఆధ్వర్యంలోనే ఇండియా ఎన్నో టెస్టులను, వరల్డ్ కప్‌ను కూడా గెలిచింది. అప్పట్లో టీమ్ ఇండియా కోచ్ అయిన గ్రెగ్ చాపెల్‌తో గొడవ వల్ల ఇండియన్ టీమ్‌కు దూరంగా వెళ్లిపోయారు గంగూలీ. మళ్లీ చాలాకాలం తర్వాత తిరిగొచ్చారు. ఇప్పటికీ సౌరవ్ గంగూలీ కెరీర్‌లో కాంట్రవర్సీల గురించి క్రికెట్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటూ ఉంటారు. తన కెరీర్‌లో మొత్తం 7000 టెస్ట్ రన్స్ తీశారు గంగూలీ. ఓడీఐల్లో మొత్తం కలిపి 11,000 రన్స్ తీశారు. 2008లో ఐపీఎల్ మొదలయిన కొత్తలో కోలకత్తా నైట్ రైడర్స్ (కేకేఆర్) టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించారు. అలా తన కెరీర్‌లో మరచిపోలేని మైలురాళ్లు ఎన్నో ఉన్నాయి.