BigTV English

New Zealand Vs Australia: ఉత్కంఠ పోరులో గెలిచిన ఆసిస్.. పోరాడి ఓడిన కివీస్..

New Zealand Vs Australia: ఉత్కంఠ పోరులో గెలిచిన ఆసిస్.. పోరాడి ఓడిన కివీస్..

New Zealand Vs Australia: మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 389 పరుగుల భారీ లక్ష్యాన్ని కివీస్ ముందుంచింది. కళ్ల ముందు కొండంత లక్ష్యం…అసలు సాధ్యమవుతుందా? అని అంతా అనుకున్నారు. ఒక దశలో అసాధ్యాన్ని సుసాధ్యం చేసేలాగే కివీస్ కనిపించింది. కానీ 5 పరుగుల దగ్గర అంటే సరిగ్గా 383 పరుగుల వద్ద వారి పోరాటం ఆగిపోయింది. వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మధ్య ధర్మశాలలో జరిగిన మ్యాచ్ చివరి బాల్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. సమ ఉజ్జీలు, పోరాటయోధులు తలపడితే ఎలా ఉంటుందో వీరి మధ్య పోరు అలా సాగింది.


టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ కి వచ్చింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్ ఇద్దరూ మొదటి బాల్ నుంచే విధ్వంసం సృష్టించారు. వార్నర్ అయితే 6 సిక్స్ లు, 5 ఫోర్ల సాయంతో 65 బంతుల్లో 81 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఈ మ్యాచ్ లో కూడా సెంచరీ చేసేలాగే కనిపించాడు. ఇంతకుముందు మ్యాచ్ లో మాక్స్ వెల్ 40 బాల్స్ లోనే సెంచరీ చేశాడు. నేనెందుకు చేయలేను అన్నట్టుగానే ఆడాడు. తగ్గేదేలే అన్నట్టుగానే దంచి కొట్టాడు. కానీ అనుకోకుండా అవుట్ అయిపోయాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ ఇంకా బీభత్సంగా ఆడాడు. కేవలం 67 బంతుల్లో 7 సిక్స్ లు, 10 ఫోర్ల సాయంతో 109 పరుగులు చేశాడు.

వీరిద్దరి విధ్వంసం ఎలా జరిగిందంటే 19.1 ఓవర్లలో 175 పరుగులు చేశారు. అప్పుడు ఫిలిప్స్ బౌలింగ్ లో వార్నర్ కాట్ అండ్ బౌల్డ్ అయ్యాడు. తర్వాత 200 పరుగుల వద్ద సెంచరీ చేసిన హెడ్ అవుట్ అయ్యాడు. స్మిత్ (18),మార్ష్ (36), లబుషేన్ (18) త్వరత్వరగా అవుట్ అయ్యారు. తర్వాత మాక్స్ వెల్ (41), జోష్ ఇంగ్లిస్ (38), పాట్ కమిన్స్ (37) మెరుపులు మెరిపించారు. ఆఖరి 10 ఓవర్లలో 108 పరుగులు చేశారంటే ఎంత స్పీడుగా వీరు ఆడారో అర్థమవుతుంది.
మొత్తానికి 49.2 ఓవర్లలో 388 పరుగులకు ఆస్ట్రేలియా ఆలౌట్ అయ్యింది.


కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, ఫిలిప్స్ 3, శాంటర్న్ 2, మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషమ్ చెరో వికెట్ తీశారు.

భారీ లక్ష్యసాధన చేధించడానికి యుద్ధభూమిలోకి వచ్చిన సైనికుల్లా కివీస్ ఓపెనర్లు డావిన్ కాన్వే (28) , విల్ యంగ్ (32) వచ్చారు. ఇద్దరూ బిగినింగ్ బాగానే ఉన్నా, భారీ స్కోర్ గా మలచలేకపోయారు. ఇద్దరూ త్వరత్వరగా అవుట్ అయిపోయారు. 9.4 ఓవర్లు గడిచేసరికి 2 వికెట్ల నష్టానికి కివీస్ 72 పరుగులు చేసింది. ఫస్ట్ డౌన్ వచ్చిన రిచిన్ రవీంద్ర చక్కటి ఇన్నింగ్స్ ఆడాడు. కొండంత లక్ష్యం కంటి ముందున్నా ఎక్కడా నదురు లేదు, బెదురు లేదన్నట్టు ఆడాడు. 77 బాల్స్ లో సెంచరీ చేశాడు. 89 బాల్స్ లో 6 సిక్స్ లు, 9 ఫోర్లతో116 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. అప్పటికి రన్ రేట్ ని ఏ మాత్రం తగ్గకుండా చూసుకున్నాడు. డారీ మిచెల్ (54) సపోర్ట్ తో స్కోరుని ముందుకి నడిపించాడు.

తర్వాత టామ్ లాథన్ (21), ఫిలిప్స్ (12), మిచెల్ శాంట్నర్ (17) టపటపా అయిపోయారు. అప్పుడు జేమ్స్ నీషమ్ వచ్చి మ్యాచ్ ని గెలుపు ముంగిట వరకు తీసుకెళ్లాడు. 39 బాల్స్ లో 3 సిక్స్ లు, 3 ఫోర్లతో 58 పరుగులు చేసి, చివర్లో రనౌట్ అయ్యాడు. ఇంక ఆఖరున లాస్ట్ బాల్ కి 6 పరుగులు చేయాల్సి ఉండగా.. అది డాట్ బాల్.. అంతే 5 పరుగుల తేడాతో విజయం ముంగిట వరకు వచ్చి కివీస్ ఆగిపోయింది. ఆసిస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, హేజిల్ వుడ్ 2, కమిన్స్ 2, మ్యాక్స్ వెల్ ఒక వికెట్ తీశారు. కానీ వారు చేసిన పోరాటం మాత్రం నభూతో నభవిష్యతి అనాలి. అంత గొప్పగా ఆడారు. కొండంత లక్ష్యాన్ని చూసి అలా నెమ్మదిగా చేధించుకుంటూ అడపాదడపా ఫోర్లు, సిక్స్ లు కొడుతూ ముందుకు తీసుకువెళ్లిన తీరు ఇప్పటివరకు జరిగిన అన్ని వరల్డ్ కప్ మ్యాచ్ ల్లోకి హైలెట్ అని చెప్పాలి.

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×