E-Paper
Advertisement

Pakistan Vs New Zealand: మూడో మ్యాచ్‌ కివీస్‌దే.. బాబర్ హిస్టరీ క్రియేట్.. నాలుగో ప్లేస్‌లో రోహిత్!

Pakistan Vs New Zealand: మూడో మ్యాచ్‌ కివీస్‌దే.. బాబర్ హిస్టరీ క్రియేట్.. నాలుగో ప్లేస్‌లో రోహిత్!
Advertisement

Pakistan Vs New Zealand 3rd T20 2024: రావల్సిండి వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ విజయం సాధించింది. పాకిస్థాన్‌పై ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది ఆ జట్టు. తొలుత బ్యాటింగ్ చేసిన బాబర్ సేన నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. పాకిస్థాన్ ఆటగాళ్లలో షాదాబ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఓపెనర్ ఆయూబ్ 32, బాబర్ 37, ఇర్ఫాన్‌ఖాన్ 30 పరుగులతో రాణించారు. కివీస్ బౌలర్లలో సోధి రెండు వికెట్లు నేలకూల్చాడు.

అనంతరం 179 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్, 18.2 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. మిడిలార్డర్ ఆటగాడు మార్క్ చాప్‌మస్ వీరవిహారం చేశాడు. కేవలం 42 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్‌లతో 87 పరుగులు చేశాడు. డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్, రాబిన్‌సన్ సమయోచితంగా రాణించారు. పాక్ బౌలర్లలో అబ్బాస్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఐదు టీ 20 సిరీస్ 1-1 సమంగా ఇరుజట్లు ఉన్నాయి. తొలి మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. రెండు మ్యాచ్‌ను పాక్ గెలుచుకోగా, మూడో మ్యాచ్‌ను కివీస్ సొంతం చేసుకుంది. ఇరుజట్ల మధ్య నాలుగో టీ 20 మ్యాచ్ లాహోర్ వేదికగా ఏప్రిల్ 25న జరగనుంది.

బాబర్ హిస్టరీ క్రియేట్
Advertisement

మరోవైపు పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ ద్వారా 67 ఇన్నింగ్స్‌లు ఆడిన బాబర్, 37.43 సగటుతో 2246 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ పేరిట ఉండేది. ఆయన 76 మ్యాచ్‌ల్లో 32.40 సగటుతో 2236 పరుగులు చేశాడు. ఈ జాబితాలో నాలుగో ప్లేస్‌లో రోహిత్ శర్మ (1648), ఐదో స్థానంలో కోహ్లి(1570) ఉన్నారు.

Advertisement

 

Tags

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×