Nitish Kumar Reddy: తెలుగు కుర్రాడు, టీమిండియా స్టార్ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డికి ( Nitish Kumar Reddy) ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పుడిప్పుడే టీం ఇండియాలో ఎదుగుతున్న నితీష్ కుమార్ రెడ్డిని.. కొంతమంది కేటుగాళ్లు టార్గెట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. నితీష్ కుమార్ రెడ్డి పేరుతో రకరకాల అకౌంట్లు క్రియేట్ చేసి… డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ ప్రచారంపై… తాజాగా స్వయంగా నితీష్ కుమార్ రెడ్డి ( Nitish Kumar Reddy) స్పందించాడు. తన పేరుతో చాలామంది అకౌంట్లు క్రియేట్ చేసి… రచ్చ చేస్తున్నారని.. సంచలన ట్వీట్ చేశాడు నితీష్ కుమార్ రెడ్డి.
Also Read: Ban on CSK – RR : 2016, 2017 లో రాజస్థాన్, CSK పై బ్యాన్.. కారణం ధోని కుట్రలేనా?
నితీష్ కుమార్ రెడ్డి సంచలన పోస్ట్
టీమిండియాలో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న నితీష్ కుమార్ రెడ్డి తాజాగా సంచలన పోస్ట్ పెట్టాడు. తన పేరుతో చాలా మంది అకౌంట్స్ క్రియేట్ చేసి.. డబ్బులు వసూలు చేస్తున్నారని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాబట్టి తన అకౌంట్ ఒరిజినల్… ఏది అనేది గుర్తుంచుకోండి. అనవసరంగా తన పేరుతో ఏమైనా మెసేజ్లు వస్తే.. సరిగ్గా చూసుకోండని రిక్వెస్ట్ చేశాడు. కొంతమంది వెధవలు.. తన పేరుతో దొంగ ట్వీట్లు పెట్టి… రచ్చ చేస్తున్నారని మండిపడ్డాడు. తన పేరుతో వివిధ అకౌంట్లు క్రియేట్ చేసి… జనాలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని తన దృష్టికి వచ్చినట్లు స్పష్టం చేశాడు నితీష్ కుమార్ రెడ్డి. ఇలాంటి నేపథ్యంలో… తన అభిమానులు జాగ్రత్తగా ఉండాలని కోరాడు. తన పేరుతో ఫేక్ మెసేజ్లు వస్తే అస్సలు.. స్పందించవద్దని కోరాడు. దీనితో నితీష్ కుమార్ రెడ్డి సోషల్ మీడియా పోస్టు వైరల్ గా మారింది.
Also Read: Nitish Kumar Reddy: టీమిండియా క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డికి షాక్….అకౌంట్ హ్యాక్?
హైదరాబాద్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డి
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో… నితీష్ కుమార్ రెడ్డి పెద్దగా రాణించడం లేదన్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ టోర్నమెంట్ కంటే ముందు నితీష్ కుమార్ రెడ్డి… గాయపడిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తీవ్రంగా గాయపడ్డాడు తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి. దీంతో అతడు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఆడడని కొంత ప్రచారం జరిగింది. కానీ చివరికి జట్టులోకి వచ్చాడు. ఈసారి ఆరు కోట్లు తీసుకుంటున్న నితీష్ కుమార్ రెడ్డి… 2024 ఐపీఎల్ టోర్నమెంట్లో ఆడినట్లు ఎక్కడ కూడా కనిపించలేదు. ఈసారి దారుణంగా విఫలం అవుతున్నాడు నితీష్ కుమార్ రెడ్డి. 21.83 యావరేజ్ తో ముందుకు వెళ్తున్నాడు. ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన నితీష్ కుమార్ రెడ్డి 182 పరుగులు మాత్రమే చేశాడు. గత సీజన్లో 33 పరుగులు చేశాడు నితీష్ కుమార్. దీంతో వచ్చే సంవత్సరం హైదరాబాద్ నుంచి తొలగిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది.
Hello, my fam! Lately I've been getting a lot of messages regarding various accounts impersonating me.
I want to confirm that this is my original and only account. Please avoid engaging with any other profiles claiming to be me & do report them.
— Nitish Kumar Reddy (@NKReddy07) May 24, 2025