School Student Murder| ఒక స్కూల్ పిల్లాడు తన కంటే రెండేళ్లు సీనియర్ అయిన మరో విద్యార్థిని చిన్న గొడవ కారణంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని జరిగింది.
వివరాల్లోకి వెళితే.. కర్ణాటక రాష్ట్రం హుబ్బలి నగరంలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. హుబ్బలిలోని గురుసిద్దేశ్వర్ నగర్ ప్రాంతంలోని మరుసవీరా మఠం వద్ద ఉన్న స్కూల్ లో ఆరవ తరగతి చదువుకునే సాయి అనే 12 ఏళ్ల బాలుడు.. అదే స్కూల్ లో 8వ తరగతి చదువుకునే చేతన్ (14) అనే మరో బాలుడితో కలిసి స్కూల్ బయటకు వెళ్లాడు. అయితే అక్కడ ఒక షాపులో ఒక రూ.5 చిప్స్ ప్యాకెట్ కోసం గొడవ పడ్డారు. ఈ క్రమంలో సాయిని.. చేతన్ కిందకు తోసేశాడు. ఆ తరువాత వెంటనే సాయి పరుగుల తీస్తూ వెళ్లి ఒక కత్తి తీసుకొని వచ్చాడు.
ఆ తరువాత అజాగ్రత్తగా ఉన్న చేతన్ కడుపులో ఆ కత్తితో పొడిచేశాడు. ఈ ఘటన సాయంత్రం 7 గంటల సమయంలో జరిగింది. సాయంత్రం ట్యూషన్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిసింది. అయితే స్థానికులు వెంటనే చేతన్ కు రక్తస్రావం కావడం చూసి అతని తల్లిదండ్రులను సమాచారం అందించారు. వారు చేతన్ ని ఆస్పత్రికి తీసుకెళ్లారు.
ఆ వెంటనే సాయి తల్లిదండ్రులకు కూడా విషయం తెలియడంతో .. వారు కూడా ఆస్పత్రికి చేరుకున్నారు. అయితే చేతన్ అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు. పోలీసులకు ఆస్పత్రి యజమాన్యం సమాచారం అందించడంతో వారు విచారణ చేసి సాయిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రస్తుతం నిందితుడు సాయిని బాలుర కారాగారానికి తరలించామని.. తెలిపారు. హుబ్బళ్ళి-ధార్వాడ పోలీస్ కమిషనర్ శశి కుమార్ ఈ సంఘటనను “ఆందోళన కలిగించే విషయం” అని పేర్కొన్నారు. నిందితుడు చిన్న వయస్సు గలవాడు కావడం వల్ల ఈ కేసు మరింత సునిశితంగా ఉందని ఆయన చెప్పారు. ఈ కేసును చాలా జాగ్రత్తగా విచారణ చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు ఎవరి నిర్లక్ష్యం కారణమై ఉండవచ్చనే విషయాన్ని కూడా అధికారులు పరిశీలిస్తున్నారు.
Also Read: ఇంట్లో సీసీటీవీ కెమేరాలు.. తర్వాతి రోజు భర్త హత్య, అసలు ఏం జరిగింది?
ఈ సంఘటన స్థానికులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇద్దరు బాలుర మధ్య గతంలో ఎలాంటి విభేదాలు లేకపోవడంతో, ఈ దాడి ఎందుకు జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంఘటన జరిగిన సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులు స్థానికులతో మాట్లాడుతున్నారు. ఈ సాక్ష్యాలు కేసును పరిష్కరించడంలో సహాయపడతాయని అధికారులు అభిప్రాయపడ్డారు.
ఇలాంటి సంఘటనలు సమాజంలో ఆందోళన కలిగిస్తున్నాయి. యువతలో హింస పెరగడానికి కారణాలు ఏమిటనే విషయంపై చర్చించాల్సిన ఉందని ఇలాంటి ఘటనలు ఉదాహరణగా మారాయి.