Michael Clarke Cancer : సాధారణంగా మొదటిసారి తమకు క్యాన్సర్ (Cancer) వచ్చిందనే విషయాన్ని తెలియగానే ఎవ్వరైనా వామ్మో.. అని భయపడుతుంటారు. క్యాన్సర్ వచ్చిందంటే చాలు ఇక మనకు చావు వచ్చిందని.. ఇది ఒక మరణ శిక్ష లాంటిది అని భయపడుతుంటారు. క్యాన్సర్ తో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ పేద ప్రజలు, ధనికులు అని తేడా లేకుండా అందరూ పోరాడుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు, క్రికెటర్లు (Cricketers) ఇలా రకాల వారు క్యాన్సర్ల బారిన పడుతున్నారు. క్యాన్సర్ వచ్చిన వారిలో టీమిండియా (Team India) క్రికెటర్ తో పాటు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ క్రికెటర్లు చాలా మందే ఉన్నారు. అయితే ఇప్పటి వరకు క్యాన్సర్ (Cancer) బారిన పడిన క్రికెటర్ల (Crickers) గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
యువరాజ్ సింగ్ :
టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ (Yuvaraj Singh) గురించి దాదాపు అందరికీ తెలిసిందే. యువరాజ్ సింగ్ క్యాన్సర్ ని జయించాడు. వాస్తవానికి యువరాజ్ సింగ్ స్టేజ్ -1 మెడియాస్టినల్ సెమినోమా ఉన్నట్టు నిర్ధారణ అయింది. అతని రోగ నిర్థారణ 2011 చివర్లో జరిగింది. అతను 2012 ప్రారంభంలో కీమోథెరఫీ చికిత్స పూర్తి చేశాడు. పూర్తిగా కొలుకొని క్రికెట్ కి తిరిగి వచ్చాడు. వాస్తవానికి 2011 ప్రపంచ కప్ తరువాత యువరాజ్ సింగ్ కి క్యాన్సర్ వ్యాధి సోకింది. తరువాత అందులోంచి బయటపడ్డాక క్రికెట్ లో మళ్లీ పునరాగమనం చేశాడు. భారత ప్రభుత్వం నుంచి అర్జున, పద్మ శ్రీ వంటి పురస్కారాలను అందుకున్నాడు యువరాజ్ సింగ్. జూన్ 10, 2019 న యువరాజ్ సింగ్ క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు.
మైకేల్ క్లార్క్ :
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ (Michael Clarke) స్కిన్ క్యానర్ తో పోరాడుతున్నారు. ఈ మధ్యనే ఆయనకు శస్త్ర చికిత్స కూడా జరిగింది. 2006లో మొదటిసారిగా క్లార్ కి ఈ క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఆయన చికిత్స పొందుతూనే ఉన్నారు. తాజా శస్త్ర చికిత్స తరువాత క్లార్క్ (Clarke) సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేసి ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ తరువాత తన ముఖానికి బ్యాండేజ్ ఉన్న ఫొటోను షేర్ చేస్తూ క్లార్క్ ఇలా రాసుకొచ్చారు. “స్కిన్ క్యాన్సర్ అనేది నిజం. తన ముక్కు నుంచి మరో క్యాన్సర్ కణాన్ని తొలగించారు. మీరు కూడా తరచూ మీ చర్మాన్ని పరీక్షించుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు క్లార్క్.
క్రిస్ కైర్న్స్ :
న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కైర్న్స్ (Chirs carins) అత్యవసర గుండె శస్త్రచికిత్స సమయంలో వెన్నెముక స్ట్రోక్‌తో బాధపడుతున్న చాలా నెలల తర్వాత.. ఫిబ్రవరి 2022లో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ క్రిస్ కైర్న్స్‌కు ప్రేగు క్యాన్సర్ఉ న్నట్లు నిర్ధారణ అయింది . వెన్నెముక స్ట్రోక్ కారణంగా నడుము నుంచి క్రింది భాగం పక్షవాతానికి గురై, తన కొనసాగుతున్న ఆరోగ్య సమస్యల గురించి ఆయన బహిరంగంగానే చెప్పారు.
రిచర్డ్ హాడ్లీ :
న్యూజిలాండ్ క్రికెట్ లెజెండ్ సర్ రిచర్డ్ హాడ్లీ ( R Hadlee) కి జూన్ 2018లో ప్రేగు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఇది సాధారణ కోలనోస్కోపీ సమయంలో కనుగొనబడింది. అతను కణితిని తొలగించడానికి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. తరువాత కీమోథెరపీ చికిత్స చేయించుకున్నాడు. ఆ తరువాత రెండో సారి కాలేయ క్యాన్సర్‌కు రెండవ శస్త్రచికిత్స జరిగింది.
జెఫ్రీ బాయ్‌కాట్ :
ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ జెఫ్రీ బాయ్ కాట్( G Boycott) గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు. 2002లో గొంతు క్యాన్సర్ తో బాధ పడి చికిత్స పొందాడు. ఆ తరువాత 2024లో రెండో సారి గొంతు క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. జులై 2024లో అతనికి గొంతులో కణతిని విజయవంతంగా తొలగించారు.
మాథ్యూ వాడే :
ఆస్ట్రేలియా వికెట్ కీపర్, బ్యాటర్ మాథ్యూ వాడే (M Wade) కు 16 సంవత్సరాల వయస్సులోనే క్యాన్సర్ ఉన్నట్టు నిర్దారణ అయింది. అతనికి రొమ్ము క్యాన్సర్ ఉండటంతో రెండు సార్లు కీమో థెరఫీ తరువాత అతని విజయవంతంగా కోలుకున్నాడు. వాడే ప్రముఖ కెరీర్ ను కొనసాగించాడు. ఆస్ట్రేలియా తరపున పలు ఫార్మాట్లలో ఆడుతూ 2021లో టీ-20 ప్రపంచ కప్ గెలుచుకున్నాడు.