BigTV English

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావితం వీటిపైనే

Tariff Affect: ట్రంప్ సుంకాల మోత అమలులోకొచ్చింది.. ఎక్కువ ప్రభావితం వీటిపైనే

భారత్ పై 50 శాతం అమెరికా సుంకాల మోత నేటి నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ట్రంప్ నుంచి ఉపశమనం ఏదైనా ఉంటుందేమోనని ఆశించారంతా. కానీ అలాంటి ఉద్దేశమేమీ ఆయనకు లేదని స్పష్టమైంది. ఈరోజునుంచి భారత్ ఎగుమతులపై అమెరికా 50శాతం సుంకాలను ముక్కుపిండి వసూలు చేస్తుంది.


రొయ్యలపై మోత..
ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య 48బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతోంది. ఈ సుంకాల యుద్ధంలో బాగా నలిగిపోయే రంగం రొయ్యల వ్యాపారం. అత్యధిక ప్రభావం పడేది ఈ రంగంపైనే. భారత్ నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో 32.4 శాతం అమెరికాకు చేరుకుంటున్నాయి. రొయ్యల ఎగుమతులపై టారిఫ్ ని 50 శాతానికి అమెరికా పెంచింది. సో ఈ రంగంలో ఎగుమతులు చేసేవారికి అత్యధిక నష్టాలు తప్పవన్నమాట. పెట్రోలియం ఉత్పత్తుల విషయానికొస్తే.. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల్లో అమెరికాకు చేరుకునేవి కేవలం 4.3 శాతం మాత్రమే. వీటిపై అమెరికా 6.9 శాతం సుంకాలు వసూలు చేస్తోంది. సో పెట్రోలియం ఉత్పత్తులపై పెద్ద ప్రభావం లేదనే చెప్పాలి.

ఆర్గానిక్ రసాయనాలు..
భారత్ నుంచి ఎగుమతి అయ్యే ఆర్గానిక్ రసాయనాలలో 13.2 శాతం అమెరికాకు చేరుకుంటున్నాయి. వీటిపై అమెరికా 54 శాతం సుంకాలు విధిస్తోంది. అంటే ఈ రంగంపై కూడా ప్రభావం అధికమనే చెప్పాలి. ఫార్మా రంగంపై కొత్తగా టారిఫ్ విధించలేదు. అయితే ఫార్మా ఎగుమతుల్లో అమెరికాకు అత్యధికంగా 39.8 శాతం వెళ్తున్నాయి. సుంకాలు పెరగలేదు కాబట్టి ఫార్మా రంగం సేఫ్. ఇక కార్పెట్ల ఎగుమతులు కూడా భారత్ నుంచి అమెరికాకు ఎక్కువ. మన దేశంలో తయారయ్యే కార్పెట్లు 58.6 శాతం అమెరికాకు వెళ్తున్నాయి. వీటిపై కూడా అమెరికా సుంకాలు పెంచింది. మొత్తంగా 52.9 శాతం టారిఫ్ కట్టాలి. అంటే కార్పెట్ ఎగుమతులు కూడా దెబ్బతినే అవకాశం స్పష్టంగా ఉంది. రెడీమేడ్ దుస్తుల విభాగంలో టారిఫ్ 63.9 శాతానికి చేరుకుంది. భారత్ నుంచి 34.5 శాతం రెడీమేడ్ దుస్తులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. ఈ రంగంపై కూడా సుంకాల మోత మోగిందనే చెప్పాలి. అల్లిన దుస్తులు 32.2 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వీటిపై అత్యధికంగా 60.3 శాతానికి టారిఫ్ పెరిగింది. అంటే ఇకపై భారత్ లో అల్లిన దుస్తులు అమెరికాకు ఎగుమతి చేయాలంటే ఎగుమతి దారులు భారీగా నష్టపోవాల్సిందే. జౌళి పరిశ్రమపై కూడా 59 శాతానికి టారిఫ్ పెరిగింది. బంగారం, వజ్రాభరణాలు 40శాతం అమెరిరాకు ఎగుమతి చేస్తోంది భారత్. ఈ రంగంపై సుంకాలు 52.1 శాతానికి పెరిగాయి. స్టీల్, అల్యూమినియం, కాపర్ ఉత్పత్తులు 16.6 శాతం అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. వీటి ఉత్పత్తులపై అమెరికా 51.7 సుంకం వసూలు చేస్తోంది. అంటే ఈ రంగంపై కూడా ప్రభావం ఎక్కువేనని చెప్పాలి.


స్మార్ట్ ఫోన్లకు నో ప్రాబ్లమ్..
భారత్ నుంచి స్మార్ట్ ఫోన్ల ఎగుమతులు అమెరికాకు భారీగానే జరుగుతున్నాయి. 43.9 శాతం అమెరికాకు భారత్ ఎగుమతి చేస్తుండగా, దీనిపై టారిఫ్ లేదు. అంటే స్మార్ట్ ఫోన్ల ఎగుమతి రంగంపై ప్రభావం లేదన్నమాట. 2021-22 నుంచి భారత్‌ కు అమెరికా అతి పెద్ద బిజినెస్ పార్ట్ నర్ గా ఉంది. 2024-25లో ఈ రెండు దేశాల మధ్య 131.8 బిలియన్‌ డాలర్ల మేరకు భారీ వ్యాపారం జరిగింది. ఇందులో 86.5 బిలియన్‌ డాలర్ల మేర ఎగుమతులు, 45.3 బిలియన్‌ డాలర్ల మేర దిగుమతులు ఉన్నాయి. తాజా టారిఫ్ ల వల్ల రొయ్యల ఎగుమతులు, జౌళి రంగం, స్టీల్, అల్యూమినియం, కాపర్ ఎగుమతులపై తీవ్రమైన ప్రభావం కనపడుతుంది. అంటే ఆయా రంగాల్లో ఎగుమతులకు భారత్ కొత్త మార్కెట్ ని వెదుక్కోవాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది.

Related News

Modi New Strategy: మళ్లీ తెరపైకి మేడ్ ఇన్ ఇండియా.. మోదీ స్వదేశీ మంత్రం ఫలిస్తుందా?

Bihar: బీహార్ యాత్రలో సీఎం రేవంత్.. రాహుల్ గాంధీ ప్లాన్ అదేనా!

Jammu Kashmir: ఘోర ప్రమాదం.. కొండచరియలు విరిగిపడి 30 మంది మృతి..

Trump-Modi: 4సార్లు ట్రంప్ ఫోన్ కాల్ కట్ చేసిన మోదీ.. జర్మనీ పత్రిక సంచలన కథనం

Cloudburst: దోడాలో క్లౌడ్ బరస్ట్.. జమ్మూ ప్రాంతంలో వరదల విజృంభణ.. మళ్లీ ప్రాణనష్టం!

Big Stories

×