BigTV English

KKR Next Mentor: అయితే, కేకేఆర్ మెంటార్ ద్రవిడ్ కాదా?

KKR Next Mentor: అయితే, కేకేఆర్ మెంటార్ ద్రవిడ్ కాదా?

Who will be Kokata Knight Riders’ next Mentor: ఈయన అటు నుంచి ఇటొచ్చాడు. ఆయన ఇటు నుంచి అటు వెళతాడని అంతా అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఈయనెవరు? ఆయనెవరు? అని ఆశ్చర్యపోతున్నారా? అదేనండీ… కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి గౌతంగంభీర్ టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా వెళ్లాడు. ఇన్నాళ్లూ అదే ప్లేస్ లో ఉన్న రాహుల్ ద్రవిడ్…కేకేఆర్ మెంటార్ గా వెళతాడని అంతా అనుకున్నారు.


కానీ ఇప్పుడు ద్రవిడ్ ఆ ప్లేస్ లోకి వెళ్లడం లేదని తెలిసింది. ఏం జరిగిందో తెలీదు. కేకేఆర్ వేరే మెంటార్ కోసం చూస్తున్నారని సమాచారం. ఆ జట్టు అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ కూడా టీమ్ ఇండియా కోచింగ్ స్టాఫ్ లో చేరనున్నట్టు తెలిసింది. అందుకని గౌతంతో కలిసి ఎంతమంది వెళితే, వారి ప్లేస్ ని భర్తీ చేసే పనిలో కేకేఆర్ పడింది.

ప్రస్తుతం సౌతాఫ్రికా లెజండరీ ప్లేయర్ జాక్వెస్ కలిస్ తో మాట్లాడుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంటే రాహుల్ ద్రవిడ్ కి ఇంక చెక్ పెట్టినట్టే అంటున్నారు. లేదంటే ద్రవిడ్ కే కోచ్ లేదా మెంటార్ గా వెళ్లడం ఇష్టం లేదా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మూడేళ్లు టీమ్ ఇండియా హెడ్ కోచ్ గా బిజీగా గడిపిన ద్రవిడ్ కొన్నాళ్లూ ఫ్యామిలీతో ఉండాలని భావిస్తున్నాడని కొందరు కామెంట్ చేస్తున్నారు.


టీమ్ ఇండియా కోచ్ గా పదవీ కాలం ముగిసిన వెంటనే ద్రవిడ్ మాట్లాడుతూ నాకిప్పుడు ఉద్యోగం లేదు. నేను నిరుద్యోగిని, కొత్త ఉద్యోగం వెతుక్కోవాలి.. అన్న మాటలు నెట్టింట వైరల్ అయ్యాయి. దీంతో పలు ఫ్రాంచైజీలు ద్రవిడ్ తో టచ్ లోకి వెళ్లాయి. షారూఖ్ ఖాన్ అయితే బ్లాంక్ చెక్ కూడా ఇచ్చేందుకు రెడీ అయ్యారని అంటున్నారు. మరేం జరిగిందో తెలీదు, మొత్తానికి కేకేఆర్ మనసు మార్చుకుందనే తెలుస్తోంది.

Also Read: పాక్ మాజీ ఆటగాడు అఫ్రిది రియాక్ట్.. గంభీర్‌లో నచ్చింది అదే..

కలిస్ గతంలో కోల్ కతా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 2012, 14 సీజన్లలో ఆ జట్టు తరఫున ఆడాడు. 2015లో కేకేఆర్ బ్యాటింగ్ కన్సల్టెంట్ గా ఉన్నాడు. తర్వాత నుంచి వరుసగా నాలుగు సీజన్లకు కేకేఆర్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. తర్వాత బాధ్యతల నుంచి దిగి, దక్షిణాఫ్రికా జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్ గా వెళ్లిపోయాడు. ప్రస్తుతం వస్తే మాత్రం గౌతం గంభీర్ ప్లేస్ లో మెంటార్ గా వస్తాడని అంటున్నారు.

Related News

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Big Stories

×