BigTV English

Shabbir Ali: కేసీఆర్ కంటే నేను సీనియర్.. బిడ్డా చాలెంజ్ చేస్తున్నా

Shabbir Ali: కేసీఆర్ కంటే నేను సీనియర్.. బిడ్డా చాలెంజ్ చేస్తున్నా

KCR: ‘మాజీ సీఎం కేసీఆర్ కంటే నేను సీనియర్ లీడర్‌ను. మంత్రిగా కూడా సీనియర్‌ను. బిడ్డా.. చాలెంజ్ చేస్తున్నా ముందు
ఫిరాయింపులకు పాల్పడింది ఎవరు? అన్ని ఆధారాలను తెచ్చి చూపిస్తాను. 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో నలుగురిని
చేర్చుకుని పార్టీని విలీనం చేశారు. ఎమ్మెల్సీలను అలాగే చేర్చుకున్నారు. మొత్తం 46 మందిని రాజీనామా చేయించకుండా
గులాబీ పార్టీలో చేర్పించుకున్నారు. తలసానిని రాజీనామా చేయించకుండా ఏకంగా మంత్రి పోస్టు ఇచ్చారు’ అని ప్రభుత్వ
సలహాదారు షబ్బీర్ అలీ విమర్శలు గుప్పించారు. కురియన్ కమిటీ ముందు హాజరైన షబ్బీర్ అలీ.. ఆ తర్వాత మీడియాతో
మాట్లాడారు.


కామారెడ్డిలో పార్లమెంటు, అసెంబ్లీలో మెజార్టీ వచ్చిందని కురయన్ కమిటీకి చెప్పానని షబ్బీర్ అలీ వివరించారు. ఉదయం
నుంచే బీఆర్ఎస్ బూత్ ఏజెంట్లు బయటికి వెళ్లిపోయారని, బీఆర్ఎస్ ఓటర్లు బీజేపీకి ఓటు వేశారని చెప్పారు.
ఫిరాయింపులకు పాల్పడింది బీఆర్ఎస్ పార్టీనే అని విమర్శించారు. ఎంత పడితే అంత మందిని ఇష్టారీతిన
లాగేసుకున్నారని, అసెంబ్లీలో కనీసం ప్రతిపక్ష గొంతే లేకుండా చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని సెటైర్ వేశారు. 46
మందిని రాజీనామా చేయించకుండా చేర్చుకున్నారని బీఆర్ఎస్ తీరును తప్పుబడట్టిన ఆయన.. తలసాని శ్రీనివాస్
యాదవ్‌ను కనీసం రాజీనామా కూడా చేయింకుండా మంత్రిని చేశారని వివరించారు.

ఎమ్మెల్సీలను కూడా అలాగే చేర్చుకున్నారని, తాము అలా చేయడం లేదని షబ్బీర్ అలీ అన్నారు. ఒక వేళ నేను వెళ్లాల్సి
ఉంటే పదవికి రాజీనామా చేసే వెళ్లిపోతానని స్పష్టం చేశారు. ఇవన్ని కేటీఆర్ రుజువు చేయాలని, లేకుంటే రాజీనామా
చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం గురించి తాను కేటీఆర్‌కు ట్వీట్ కూడా చేశారని చెప్పారు. అయితే.. కేటీఆర్ తన
అకౌంట్‌ను బ్లాక్ చేశారని పేర్కొన్నారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అంగట్లో సరుకులా కొన్నారని, కానీ, ఇప్పుడు
అభివృద్ధి కోసం తమ పార్టీలోకి వస్తున్నారని వివరించారు. వాళ్లు తమ పార్టీని కూలగొట్టారని, తాము కూడా బీఆర్ఎస్‌ను
కూలగొడతామని చెప్పారు. త్వరలోనే అందరూ కాంగ్రెస్‌లోకి వస్తారని పేర్కొన్నారు.


Related News

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Hyderabad News: హైదరాబాద్‌ వాసులకు సూచన.. ఆ ప్రాంతాల్లో 24 గంటలపాటు తాగునీటి సరఫరా బంద్

Big Stories

×