BigTV English

David Miller: మిల్లర్ భారీ సిక్స్.. బంతి దొంగిలించిన పాక్ ఫ్యాన్స్ !

David Miller: మిల్లర్ భారీ సిక్స్.. బంతి దొంగిలించిన పాక్ ఫ్యాన్స్ !

David Miller: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టుతో తలపడే ప్రత్యర్థి ఎవరనేది తేలిపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ రెండవ సెమీ ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టు గర్జించింది. ఈ రెండవ సెమీఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్ సన్ సెంచరీలతో విరుచుకుపడడంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక స్కోరు నమోదు చేసింది న్యూజిలాండ్.


 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. సౌత్ ఆఫ్రికా బౌలర్లలో లుంగీ ఎంగిడి 3, కగిసో రబాడ 2, ముల్దర్ ఒక వికెట్ చొప్పున పడగొట్టారు. న్యూజిలాండ్ బ్యాటర్లలో ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ టి-20 తరహా బ్యాటింగ్ చేశాడు. 27 బంతులలో 49 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 362/6 రన్స్ చేసింది. అనంతరం 363 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా కి చేజింగ్ చాలా కష్టంగా మారింది.


సాధించాల్సిన రన్ రేట్ ఎక్కువగా ఉండడం, మరోవైపు న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు ఆరంభం నుండే ఒత్తిడికి గురయ్యారు. డేవిడ్ మిల్లర్ {100} సెంచరీ పోరాటం వృధా అయ్యింది. టెంబా బవుమా {56}, వాన్ డెర్ డసెన్ {69} హాఫ్ సెంచరీలు సాధించినా.. వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో చివరకు సౌత్ ఆఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 97 వికెట్లు కోల్పోయి 312 పరుగులు మాత్రమే చేసింది.

న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ శాంట్నర్ 3, మ్యాట్ హెన్రీ, ఫిలిప్స్ చెరో రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర, బ్రేస్ వెల్ తలో వికెట్ తీశారు. అయితే ఈ రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ లో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డేవిడ్ మిల్లర్ డీప్ కవర్ వైపు భారీ సిక్స్ కొట్టాడు. దీంతో బంతిని పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు లాహోర్ స్టేడియం నుండి బయటకు పరుగులు తీశారు.

ఐసీసీ ఈవెంట్ లో ఇలా జరగడం ఇదే మొదటిసారి అని క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆ ఇద్దరి వ్యక్తులు స్టేడియం నుండి బంతిని తీసుకుని వెళ్లిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది చూసిన నెటిజెన్లు నవ్వుకుంటున్నారు. ఇక ఈ మ్యాచ్ లో సెంచరీ ద్వారా కేన్ విలియమ్ సన్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. సౌత్ ఆఫ్రికా పై సెంచరీ తో కలిపి వన్డేలో కేన్ 15 సెంచరీలు చేశాడు.

 

అన్ని ఫార్మాట్లలో కలిపి ఇప్పటివరకు 48వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విలియంసన్ 4వ స్థానానికి చేరుకున్నాడు. ఇక ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న క్రికెటర్లలో అన్ని ఫార్మాట్లలో కలిపి అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు విరాట్ కోహ్లీ {82} పేరిట ఉంది. ఓవరాల్ గా అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు భారత క్రికెట్ దిగ్గజం సచిన్ {100} పేరిట ఉంది.

Tags

Related News

NZ vs Zim: 359 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం

RCB: రూ.1650 కోట్లు, 80 వేల మందితో స్టేడియం.. ఎక్కడంటే

Rohit Sharma: రోహిత్ శర్మ పొట్టపై దారుణంగా ట్రోలింగ్… కోహ్లీ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ

Andhra Premier League: అమరావతి రాయల్స్ విజయం.. మ్యాచ్ హైలైట్స్ ఇవే

Akash Deep: ఒక్క సిరీస్.. ఆకాష్ దీప్ కెరీర్ మొత్తం మార్చేసింది… కొత్త కారు.. కొత్త లైఫ్

Rahul Dravid: మనీష్, పృథ్వి, పంత్ కెరీర్ నాశనం చేసిన రాహుల్ ద్రావిడ్… ఇప్పుడు వైభవ్ ది కూడా ?

Big Stories

×